ఫ్లోరిడా: విఖ్యాత ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ లీగ్ ‘నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్‌బీఏ) టైటిల్‌ను లాస్ ఏంజెలిస్ లేకర్స్ జట్టు దక్కించుకుంది. ‘బెస్ట్ ఆఫ్ సెవెన్’ పద్ధతిలో జరిగిన ఫైనల్లో లేకర్స్ జట్టు 4–2తో మయామి హీట్ జట్టును ఓడించింది. తద్వారా ఈ టైటిల్‌ను 17వసారి సాధించింది. బోస్టన్ సెల్టిక్స్ పేరిట ఉన్న అత్యధిక ఎన్‌బీఏ టైటిల్స్ (17) రికార్డును సమం చేసింది. ఆరో ఫైనల్లో లేకర్స్ 106–93 పాయింట్ల తేడాతో మయామి హీట్ జట్టును ఓడించింది. మరో ఫైనల్ మిగిలి ఉండగానే టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. లేకర్స్ స్టార్ ప్లేయర్ లేబ్రాన్ జేమ్స్ 28 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దివంగత కోబీ బ్రయాంట్ సభ్యుడిగా 2010లో చివరిసారిగా ఎన్‌బీఏ విజేతగా నిలిచిన లేకర్స్... పదేళ్ల తర్వాత మళ్లీ చాంపియన్‌గా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment