Miami heats
-
లేకర్స్ అదరహో...
ఫ్లోరిడా: విఖ్యాత ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ లీగ్ ‘నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) టైటిల్‌ను లాస్ ఏంజెలిస్ లేకర్స్ జట్టు దక్కించుకుంది. ‘బెస్ట్ ఆఫ్ సెవెన్’ పద్ధతిలో జరిగిన ఫైనల్లో లేకర్స్ జట్టు 4–2తో మయామి హీట్ జట్టును ఓడించింది. తద్వారా ఈ టైటిల్‌ను 17వసారి సాధించింది. బోస్టన్ సెల్టిక్స్ పేరిట ఉన్న అత్యధిక ఎన్బీఏ టైటిల్స్ (17) రికార్డును సమం చేసింది. ఆరో ఫైనల్లో లేకర్స్ 106–93 పాయింట్ల తేడాతో మయామి హీట్ జట్టును ఓడించింది. మరో ఫైనల్ మిగిలి ఉండగానే టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. లేకర్స్ స్టార్ ప్లేయర్ లేబ్రాన్ జేమ్స్ 28 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దివంగత కోబీ బ్రయాంట్ సభ్యుడిగా 2010లో చివరిసారిగా ఎన్బీఏ విజేతగా నిలిచిన లేకర్స్... పదేళ్ల తర్వాత మళ్లీ చాంపియన్‌గా నిలిచింది. -
హీట్స్’ హోం గ్రౌండ్లో...
ఫ్లోరిడా: టి20 సిరీస్‌కు ముందు లభించిన విరామంలో భారత ఆటగాళ్లు అమెరికాలో సరదాగా గడుపుతున్నారు. అశ్విన్, ధావన్, భువనేశ్వర్ గురువారం అమెరికా బాస్కెట్ బాల్ టీమ్ ‘మియామీ హీట్స్’ హోం గ్రౌండ్ ‘ది అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఎరీనా’ను సందర్శించారు. జట్టు ఆటగాళ్లు టైలర్ జాన్సన్, బ్రియాంట్ వెబర్‌లతో ముచ్చటించిన క్రికెటర్లు... కొద్ది సేపు బాస్కెట్‌బాల్ కూడా ఆడారు. ఇతర భారత జట్టు సభ్యులలో కొందరు షాపింగ్ చేయగా, మరికొందరు హోటల్ రూంలకే పరిమితమయ్యారు. భారత్‌నుంచి ధోని, బుమ్రా కలిసి బుధవారం ఫ్లోరిడా చేరుకున్నారు. మరో వైపు ఈ సిరీస్‌ను 0-2తో ఓడితే టీమిండియా ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో రెండు నుంచి మూడో స్థానానికి పడిపోతుంది. 2-0తో గెలిస్తే నంబర్‌వన్‌కు చేరువయ్యే అవకాశం ఉండగా... 1-1తో సిరీస్ ముగిస్తే రెండో స్థానంలోనే కొనసాగుతుంది.