
వాషింగ్టన్ : భారత్‌లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టిని (51) అధ్యక్షుడు జో బైడెన్ పునర్నియమించారు. ఎరిక్ నియామకాన్ని అమెరికా కాంగ్రెస్‌లో సెనేట్ ఆమోదించాల్సి ఉంది. లాస్ ఏంజెల్స్ మాజీ మేయర్ అయిన ఎరిక్ గార్సెట్టి బైడెన్‌కు అత్యంత సన్నిహితుడు. గతంలో 2021 జులైలో ఎరిక్‌ను భారత రాయబారిగా నియమించినప్పుడు అప్పట్లో రిపబ్లికన్ సెనేటర్ చక్ గ్రాసిటీ అడ్డుకున్నారు.
మరోవైపు తన పాలనా విభాగంలోని కీలక పదవుల్లో అరడజనుకిపైగా ఇండియన్ అమెరికన్లను బైడెన్ మంగళవారం రీ నామినేట్ చేశారు. బైడెన్ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ మేనేజ్‌మెంట్ రిసోర్సెస్ పదవికి రిచర్డ్ వర్మ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ బోర్డు ప్రతినిధిగా డాక్టర్ వివేక్ హాలెగెరె మూర్తి (45)ని రీ నామినేట్ చేస్తూ సెనేట్ ఆమోదానికి పంపించారు. వీరే కాకుండా ప్రవాస భారతీయులైన అంజలి చతుర్వేది, రవి చౌధరి, గీతా రావు గుప్తా, రాధా అయ్యంగార్‌లను ప్రభుత్వంలో వివిధ పదవులకు రీ నామినేట్ చేస్తూ సెనేట్‌కు పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment