Eric
-
భారత్, యూఎస్ రక్షణ బంధం మరింత బలోపేతం
సాక్షి, విశాఖపట్నం: భారత్, అమెరికా మధ్య రక్షణ విభాగ బంధం మరింత బలోపేతం కానుందని భారత్–యూఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి స్పష్టం చేశారు. పసిఫిక్ సముద్రజలాల్లో అన్ని దేశాలూ స్వేచ్ఛాయుత వాణిజ్య కార్యకలాపాలు సాగించేలా చేయడమే తమ లక్ష్యమన్నారు. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖపట్నంలో భారత్, యూఎస్ త్రివిధ దళాల ఆధ్వర్యంలో టైగర్ ట్రయాంఫ్ యుద్ధ విన్యాసాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా.. ఐఎన్ఎస్ జలాశ్వా యుద్ధనౌక ఆన్‌బోర్డుపై ఇరుదేశాల ప్రతినిధులు మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎరిక్ మాట్లాడుతూ సాగర జలాల సరిహద్దుల్లో చొరబాట్లు, సముద్రపు దొంగల ఆట కట్టించేందుకు భారత్‌తో కలిసి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. యూఎస్ సెవెన్త్ ఫ్లీట్ రిజర్వ్ వైస్ కమాండర్ రియర్ అడ్మిరల్ జోక్విన్ జె మార్టినైజ్ మాట్లాడుతూ టైగర్ ట్రయాంఫ్ నిర్వహణతో భారత్, యూఎస్ మధ్య ఉన్న బంధాన్ని ప్రపంచానికి చాటిచెబుతున్నామన్నారు. తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ మాట్లాడుతూ టైగర్ ట్రయాంఫ్ విన్యాసాల్లో భాగంగా హార్బర్ ఫేజ్‌లో విపత్తు, యుద్ధ సమయంలో రెండు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని ఎలా అందిపుచ్చుకోవాలనే అంశాలతో పాటు ప్రీసెయిల్ చర్చలు, వృత్తిపరమైన విషయాలపై ఎక్స్పర్ట్స్ ఎక్స్చేంజిలు జరగనున్నాయని తెలిపారు. విన్యాసాల్లో భాగంగా ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ప్రధాన కేంద్రంలో కమాండ్ కంట్రోల్ సెంటర్, జాయింట్ రిలీఫ్, మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశామని వివరించారు. 29న కాకినాడలో మెడికల్ రిలీఫ్ క్యాంపుతో పాటు.. జాయింట్ ఎక్సర్సైజ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. యూఎస్ఎస్ సోమర్సెట్ యుద్ధ నౌక కమాండింగ్ ఆఫీసర్ కెప్టెన్ మిచైల్ బ్రాండ్, ఈస్ట్రన్ ఫ్లీట్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండ్ రియర్ అడ్మిరల్ రాజేష్ ధన్కర్, ఐఎన్ఎస్ జలశ్వా కమాండింగ్ అధికారి కెప్టెన్ సందీప్ బిశ్వాల్‌తో పాటు ఇరు దేశాల త్రివిధ దళాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు గార్సెట్టి ఎంపిక ఖరారు
వాషింగ్టన్: రెండు సంవత్సరాలకుపైగా ఎటూ తేలని భారత్‌లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి ఎంపిక ప్రక్రియ ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. అమెరికా పార్లమెంట్ ఎగువసభలో జరిగిన ఓటింగ్‌లో 52–42 ఓటింగ్ ఫలితంతో గార్సెట్టి నామినేషన్ గండాన్ని విజయవంతంగా గట్టెక్కారు. దీంతో భారత్‌లో అమెరికా రాయబారిగా గార్సెట్టి త్వరలో నియామకం కానున్నారు. తొలిసారిగా 2021 జూలైలో గార్సెట్టిని భారత్‌లో అమెరికా రాయబారిగా నామినేట్ చేస్తున్నట్లు అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. లాస్ ఏంజెలిస్ నగర మాజీ మేయర్ అయిన గార్సెట్టిపై పలు లైంగిక వేధింపులు, ఆధిపత్య ధోరణి ఆరోపణలు ఉన్నాయి. ఇన్నాళ్లూ అమెరికా నూతన రాయబారి వ్యవహారం సందిగ్ధంగా ఉండటంతో చరిత్రలో తొలిసారిగా 2021 జనవరి నుంచి ఇప్పటిదాకా భారత్‌లో అమెరికా రాయబారిగా ఎవరూ లేరు. కాగా, బైడెన్‌కు సన్నిహితుడు నూతన రాయబారిగా వస్తుండటంతో భారత్‌తో సత్సంబంధాలు మెరుగుపడతాయని భారతీయ అమెరికన్లు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. -
ముగిసిన ఫార్ములా ఈ రేస్ వరల్డ్ ఛాంపియన్ షిప్
-
భారత్‌లో అమెరికా రాయబారిగా ఎరిక్..!
వాషింగ్టన్ : భారత్‌లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టిని (51) అధ్యక్షుడు జో బైడెన్ పునర్నియమించారు. ఎరిక్ నియామకాన్ని అమెరికా కాంగ్రెస్‌లో సెనేట్ ఆమోదించాల్సి ఉంది. లాస్ ఏంజెల్స్ మాజీ మేయర్ అయిన ఎరిక్ గార్సెట్టి బైడెన్‌కు అత్యంత సన్నిహితుడు. గతంలో 2021 జులైలో ఎరిక్‌ను భారత రాయబారిగా నియమించినప్పుడు అప్పట్లో రిపబ్లికన్ సెనేటర్ చక్ గ్రాసిటీ అడ్డుకున్నారు. మరోవైపు తన పాలనా విభాగంలోని కీలక పదవుల్లో అరడజనుకిపైగా ఇండియన్ అమెరికన్లను బైడెన్ మంగళవారం రీ నామినేట్ చేశారు. బైడెన్ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ మేనేజ్మెంట్ రిసోర్సెస్ పదవికి రిచర్డ్ వర్మ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ బోర్డు ప్రతినిధిగా డాక్టర్ వివేక్ హాలెగెరె మూర్తి (45)ని రీ నామినేట్ చేస్తూ సెనేట్ ఆమోదానికి పంపించారు. వీరే కాకుండా ప్రవాస భారతీయులైన అంజలి చతుర్వేది, రవి చౌధరి, గీతా రావు గుప్తా, రాధా అయ్యంగార్లను ప్రభుత్వంలో వివిధ పదవులకు రీ నామినేట్ చేస్తూ సెనేట్‌కు పంపించారు. -
అయిదు నిమిషాల్లోనే బ్యాటరీ చార్జింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత ఆటో మొబైల్ రంగంలో ఇప్పుడు ‘ఎలక్ట్రిక్’ హాట్ టాపిక్‌గా మారింది. ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఉన్న కంపెనీలు అధిక సామర్థ్యమున్న బ్యాటరీల తయారీపై ఫోకస్ చేశాయి. ఈవీ టెక్నాలజీలో ఉన్న సింగపూర్ సంస్థ షాడో గ్రూప్ అనుబంధ కంపెనీ అయిన బెంగళూరుకు చెందిన అదరిన్ ఇంజనీరింగ్ టెక్నాలజీస్ ఓ అడుగు ముందుకేసి అల్ట్రా కెపాసిటర్ బ్యాటరీని అభివృద్ధి చేసింది. అయిదు నిమిషాల్లోనే చార్జింగ్ పూర్తి అవడం దీని ప్రత్యేకత. ఎరిక్ పేరుతో రూపొందించిన త్రిచక్ర వాహనానికై ఈ బ్యాటరీని తయారు చేశారు. బ్యాటరీని ఒకసారి చార్జింగ్ చేస్తే వాహనం 70 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్ ఈ టెక్నాలజీని ధ్రువీకరించింది. అంతేకాదు 10 ఏళ్లపాటు మన్నుతుందని స్పష్టం చేసిందని షాడో గ్రూప్ కో–సీఈవో సౌరభ్ మార్కండేయ సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధికి వెల్లడించారు. డీజిల్ వాహనంతో పోలిస్తే ఖర్చు 25–30 శాతం తగ్గుతుందని చెప్పారు. గంటకు 50 కిలోమీటర్ల వేగం.. ఎరిక్ బ్రాండ్‌లో ప్యాసింజర్ వేరియంట్‌తోపాటు కార్గో రకం కూడా రూపొందించారు. ప్యాసింజర్ వాహనం గంటకు 50 కిలోమీటర్లు, కార్గో మోడల్ 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కార్గోలో 550 కిలోల సరుకు రవాణా చేయవచ్చు. రెండు రకాల బ్యాటరీలను అందుబాటులోకి తెచ్చామని సౌరభ్ మార్కండేయ తెలిపారు. ‘అల్ట్రా కెపాసిటర్ బ్యాటరీ జీవిత కాలం 10 ఏళ్లు. ధర రూ.4 లక్షలు. లిథియం అయాన్ బ్యాటరీ జీవిత కాలం రెండున్నరేళ్లు. చార్జింగ్కు 8 గంటలు పడుతుంది. ఒకసారి చార్జింగ్ చేస్తే 80–100 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. ధర రూ. లక్ష ఉంది. అల్ట్రా కెపాసిటర్ అభివృద్ధికి రెండేళ్లు పట్టింది. ఈ మోడల్ వాహనాలు ఇండోనేషియాకు ఎగుమతి చేయనున్నాం. భారత్‌లో క్యాబ్ అగ్రిగేటర్లు, లాజిస్టిక్స్ కంపెనీలతో మాట్లాడుతున్నాం. 2019 అక్టోబరు నుంచి మార్కెట్లో వాహనం అందుబాటులో ఉంటుంది’ అని చెప్పారు. పుణేలో ఉన్న ప్లాంటు కోసం షాడో గ్రూప్ రూ.70 కోట్లు వెచ్చిస్తోంది. సౌరభ్ మార్కండేయ -
కూతురి బాధ తట్టుకోలేకే...ట్రంప్ నిర్ణయం
లండన్: సిరియా వైమానిక స్థావరంపై దాడి చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకోవడానికి ఆయన కుమార్తె ఇవాంకా వేదన కూడా కారణమని ట్రంప్ కుమారుడు ఎరిక్ తెలిపారు. సిరియా గ్యాస్ దాడిలో గాయపడిన చిన్నారులపై మందును స్ప్రే చేస్తున్న చిత్రాలను చూసి తన తండ్రి చలించిపోయారని ఆయన చెప్పారు. గ్యాస్ దాడిలో తన గుండె పగిలిపోయిందని ఇవాంకా చెప్పినట్లు ‘టెలిగ్రాఫ్ పత్రిక’ పేర్కొంది. దాడి భయంకరంగా ఉందని, తన తండ్రి సకాలంలో చర్య తీసుకుంటాడని ఆమె చెప్పంది. కాగా యుద్దవిమానాలు విష రసాయనాలతో వాయువ్య సిరియాపై జరిపిన దాడిలో 72మందికి పైగా అమాయకుల ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మృతుల్లో ఎక్కువమంది చిన్నారులే ఉన్నారు. రెబెల్స్ ఆధీనంలోని ఇడ్లిబ్ ప్రావిన్స్ పరిధిలోగల ఖాన్ షేఖున్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ఈ నేపథ్యంలో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాల మద్దతున్న కుర్దిష్–అరబ్ కూటమి లక్ష్యంగా చేసుకుని గత కొద్ది రోజులుగా దాడులు ముమ్మరం చేసింది. -
ఎలాంటి బిజినెస్ డీల్స్ ఉండవు : ట్రంప్
అమెరికాకు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన వ్యాపారాలన్నింటిన్నీ వదిలివేస్తానని సంచలన నిర్ణయం ప్రకటించిన అనంతరం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష పదవిలో తాను వైట్‌హోస్‌లో ఉన్నంత వరకు తన వ్యాపారాలు ఎలాంటి ఒప్పందాలు చేసుకోవని ప్రకటించారు. అయితే వటవృక్షంలో విస్తరించి ఉన్న రియల్ ఎస్టేట్ బిజినెస్‌లను ఎలా నిర్వహించబోతున్నారో అనే దానికి మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు. ప్రెస్ కాన్ఫరెన్స్‌ను వాయిదా వేసిన అనంతరం సోమవారం రాత్రి ఆయన ఈ ప్రకటన చేశారు. వాయిదా వేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు వివాదాలు తనకు చుట్టుముట్టుకోకుండా ఉండేందుకు తీసుకోబోయే ప్లాన్స్‌ను వివరిస్తానని వాగ్దానం చేశారు. కానీ ఆ కాన్ఫరెన్స్‌ను ట్రంప్ వాయిదావేశారు. సమాచార ప్రసార సాధనంగా ఆయన ఎక్కువగా వాడే ట్విట్టర్లో ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించారు. తను అధ్యక్ష పదవి చేపట్టే ముందు వ్యాపారాలన్నింటిన్నీ తన కొడుకులు డాన్, ఎరిక్‌లకు అప్పజెప్పుతానని ప్రకటించారు. టాప్ ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీలను నడిపిస్తారని ట్విట్టర్లో పేర్కొన్నారు. కానీ తన వైట్‌హోస్‌లో ఉన్నప్పుడు ఎలాంటి కొత్త డీల్స్ ఉండవని క్లారిటీ ఇచ్చారు. అధ్యక్షుడిగా ఉన్నంతమాత్రానా వ్యాపారాలు చేయకూడదని ఎలాంటి చట్టాలు లేకపోయినా.. తాను మాత్రం పూర్తిస్థాయి అధ్యక్షుడిగా ఉండటానికే కృషిచేస్తానని వాగ్దానం చేశారు. బ్యాంకు రుణాలు, లీజులు వంటి డీల్స్ అవసరమయ్యే తన రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎలా నిర్వహిస్తారనే దానిపై ఆయన స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదు. సీఎన్ఎన్ అనాలిసిస్ ప్రకారం ట్రంప్ మొత్తం 500 కంపెనీలను కలిగి ఉన్నారు. వాటిలో 150 కంపెనీలు టర్కీ, ఖత్తర్, సౌదీ అరేబియా వంటి కనీసం 25 విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. -
హిందువుల కోసం రంగంలోకి ట్రంప్ కొడుకు!
ఓర్లాండో: ఈ నెల 8న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇండియన్ అమెరికన్ ఓటర్లను ఆకట్టుకోవడానికి తన కొడుకును రంగంలోకి దింపారు. ట్రంప్ తనయుడు ఎరిక్ శనివారం ఫ్లోరిడాలోని హిందూ దేవాలయాన్ని సందర్శించి.. హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదట సూట్ వేసుకొని వచ్చిన ఎరిక్ (32) ఆలయం వద్ద భారతీయ సంప్రదాయ దుస్తులైన షెర్వాణీ ధరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సందర్శించి.. దేవుడికి హారతి ప్రాధాన్యం, హిందు సంప్రదాయాలు, ఆచారాల గురించి పూజారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎరిక్‌కు కాషాయ ప్రతిమను ప్రధాన పూజారి బహూకరించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫ్లోరిడా కీలకంగా మారింది. ఫ్లోరిడాలో సంపన్న హిందూ జనాభా నానాటికీ పెరుగుతూ.. ఎన్నికల్లో కీలక పాత్ర పోషించేదశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ ఇక్కడి హిందువులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించారు. నరేంద్రమోదీ 2014 ఎన్నికల నినాదం ఆధారంగా ‘అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్’ అంటూ టీవీల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థులు ఇలా నేరుగా ఇండియన్ అమెరికన్ ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.