
లాస్‌ఏంజెలెస్: లెజెండరీ గాయకుడు ఎల్విస్ ప్రెస్లీ ఏకైక కూతురు లీసా మేరీ ప్రెస్లీ(54) గురువారం చనిపోయారు. అస్వస్థతకు గురైన తన కూతురు లాస్‌ఏంజెలెస్‌లోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారని ఆమె తల్లి నటి, ప్రిసిల్లా ప్రెస్లీ వెల్లడించారు.
తండ్రి రూపురేఖలు, గళంతో వృత్తిపరంగా ఆయన అడుగుజాడల్లోనే నడిచిన లీసా మేరీ..2000 సంవత్సరాల్లో తన సొంత రాక్ ఆల్బమ్‌లను విడుదల చేశారు. ఇన్ ది ఘెట్టో, డోన్ట్ క్రై డాడీ వంటి రికార్డుల్లో తండ్రి ఎల్విస్‌తోపాటు ఆమె పాడారు. మైకేల్ జాక్సన్, నికొలస్ కేజ్‌లతోపాటు నలుగురిని పెళ్లాడి, కొంతకాలానికే విడిపోయారు. ఈమెకు నలుగురు సంతానం కలిగారు.
Comments
Please login to add a commentAdd a comment