Lisa
-
తారీఫ్ కరే క్యా ఉస్కీ..
లిసా మిశ్రా.. గాయనిగా, గేయరచయితగా సంగీత, సాహిత్యాభిమానులకు ఏనాడో పరిచయం. తాజాగా నటనారంగంలోకి అడుగుపెట్టి తన అభినయ కళనూ ప్రదర్శించింది. ఆ ఫ్యాన్ బేస్నూ సంపాదించుకుంది.👉లిసా పుట్టింది ఒడిశాలోని బరంపురంలో. పెరిగింది అమెరికాలోని షికాగోలో. నాలుగో ఏట నుంచే సంగీతం నేర్చుకోవడం ప్రారంభించింది. పదిహేనో ఏట నుంచి గిటార్లో శిక్షణ పొందటం మొదలుపెట్టింది. అకడమిక్స్ విషయానికి వస్తే ఇల్లినాయీ వెజ్లీయన్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ అండ్ రిలిజియన్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది.👉పదమూడేళ్ల వయసులో లిసా.. యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేసి, తన పాటల వీడియోలను అందులో పోస్ట్ చేయసాగింది. అయితే ఆమె అలా వీడియోలు అప్లోడ్ చేయడం వాళ్లమ్మకు నచ్చలేదు. ఎందుకు అందరి కళ్లల్లో పడటం అంటూ అభ్యంతరం చెప్పింది. దాంతో కేవలం ఆడియో రికార్డింగ్స్‌ని మాత్రమే పోస్ట్ చేయసాగింది. ఆమె స్వరమాధుర్యానికి ఫిదా అయిపోయారు శ్రోతలు. ఆ ఆడియో పోస్ట్‌లకు వచ్చిన రెస్పాన్స్ చూసి లిసా వాళ్లమ్మ, కూతురి పాటల వీడియోలకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 👉యూట్యూబ్‌లోని ఆమె పాటల వీడియోలకు అమెరికన్ పాప్ మ్యూజిక్ కూడా స్పందించింది. 2016, గ్రామీ అవార్డ్ గెలుచుకున్న ‘కలరింగ్ బుక్’ ఆల్బమ్‌లో పాడే అవకాశాన్నిచ్చింది. 2017లో ఎమ్మీ అవార్డ్స్‌కి నామినేట్ అయిన ‘బ్రౌన్ గర్ల్స్’ వెబ్ సిరీస్‌లోనూ థీమ్ సాంగ్ పాడింది.👉పాశ్చాత్య ప్రపంచంలో లిసా అంత కీర్తి సాధించినా.. ఆమె మీద భారత్ దృష్టి పడింది మాత్రం ఆమె ‘వీరే ది వెడ్డింగ్’లోని ‘తారీఫా’ పాటను పాడి, ఇన్‌స్టాలో పోస్ట్ చేశాకే! ఇన్‌స్టాలో ఆ వీడియో చూసిన సోనమ్ కపూర్, రియా కపూర్లు ఆమెను బాలీవుడ్‌కి పిలిచి, ‘తారీఫా’ రిప్రైజ్ వర్షన్‌ను పాడించారు. దాంతో ఇక్కడా ఆమె లైమ్‌లైట్‌లోకి వచ్చింది. బాలీవుడ్ ప్రయాణాన్ని మొదలుపెట్టింది.👉‘జడ్జ్‌మెంటల్ హై క్యా’, ‘స్కై ఈజ్ పింక్’, ‘గుడ్ న్యూస్’, ‘జుగ్‌జుగ్ జియో’, ‘లైగర్’, ‘దోనో’ వంటి సినిమాల్లో ఆమె పాడిన పాటలన్నీ హిట్టే! సినిమాల్లో పాడే చాన్స్ రాగానే తనకు ఇష్టమైన పాప్ మ్యూజిక్ వరల్డ్‌కి గుడ్ బై చెప్పలేదు. అక్కడా వినిపించడానికి ప్లాన్ చేసుకుంటోంది. గాయనిగానే కాదు పాటలను రాస్తూ తన రచనా పాటవాన్నీ చూపిస్తోంది.👉క్షణం తీరిక లేని ఆమె షెడ్యూల్లో తన కోసం కాల్షీట్ సర్దే వీలుంటుందేమో చూడమని ఓటీటీ రిక్వెస్ట్ చేసింది.. ‘కాల్ మి బే’ వెబ్ సిరీస్ ఆఫర్‌తో! ఎంతో ఉత్సాహంగా ‘యెస్’ చెప్పింది లిసా. ప్రాధాన్యమున్న పాత్రలో నటించి వీక్షకులు, విమర్శల ప్రశంసలు అందుకుంటోంది. ఆ సిరీస్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో స్ట్రీమ్ అవుతోంది.సింగర్, సాంగ్ రైటర్ అయిన నాకు యాక్టింగ్ అనేది సవాలే! చాలెంజెస్ అంటే ఇష్టం కాబట్టి యాక్టర్‌గానూ ఇంట్రడ్యూస్ అయ్యాను. మంచి రోల్స్ వస్తే నటననూ కంటిన్యూ చేస్తాను.– లిసా మిశ్రా. -
ఈ కొరియన్ ఖవ్వాలీ విన్నారో.. వహ్వా వహ్వా..! అనక తప్పదు!
పాపులర్ ‘కె–పాప్’ మనకు సుపరిచితం. మరి ‘కె–ఖవ్వాలి అంటే?’ అని అడిగితే ‘అదేమిటీ!’ అని మిక్కిలి ఆశ్చర్యపోయేవారితో పాటు ‘ఎక్కడి ఖవ్వాలీ? ఎక్కడి కొరియా’ అని దూరాభారాలను కూడా లెక్కవేసే వాళ్లు ఉంటారు. ‘కొరియన్ సింగర్స్ సింగింగ్ ఖవ్వాలి’ ట్యాగ్‌లైన్‌తో పోస్ట్ చేసిన ఈ ‘కె –ఖవ్వాలి’ వీడియో వైరల్ అయింది. కల్చరల్ ఎక్స్చేంజ్కు అద్దం పట్టే ఈ వీడియోలో కొరియన్ గాయకులు సంప్రదాయక ఖవ్వాలి మెలోడీలను అద్భుతంగా ఆలపించే దృశ్యం, హార్మోని సుమధుర శబ్దం నెటిజనుల చేత ‘వహ్వా వహ్వా’ అనిపిస్తోంది. ‘బ్యూటీఫుల్ కల్చరల్ ఎక్స్చేంజ్’ లాంటి ప్రశంసలు కామెంట్ సెక్షన్లో కనిపించాయి. ఇవి చదవండి: ప్రముఖ కొరియన్ సింగర్ అనుమానాస్పద మరణం: షాక్‌లో ఫ్యాన్స్ -
Blackpink Lisa: మోస్ట్ టాలెంటెడ్ రాపర్, సింగర్, డాన్సర్, బ్లాక్‌పింక్ లిసా (ఫోటోలు)
-
ఎల్విస్ ప్రెస్లీ కూతురు లీసా మేరీ మృతి
లాస్ఏంజెలెస్: లెజెండరీ గాయకుడు ఎల్విస్ ప్రెస్లీ ఏకైక కూతురు లీసా మేరీ ప్రెస్లీ(54) గురువారం చనిపోయారు. అస్వస్థతకు గురైన తన కూతురు లాస్ఏంజెలెస్లోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారని ఆమె తల్లి నటి, ప్రిసిల్లా ప్రెస్లీ వెల్లడించారు. తండ్రి రూపురేఖలు, గళంతో వృత్తిపరంగా ఆయన అడుగుజాడల్లోనే నడిచిన లీసా మేరీ..2000 సంవత్సరాల్లో తన సొంత రాక్ ఆల్బమ్‌లను విడుదల చేశారు. ఇన్ ది ఘెట్టో, డోన్ట్ క్రై డాడీ వంటి రికార్డుల్లో తండ్రి ఎల్విస్తోపాటు ఆమె పాడారు. మైకేల్ జాక్సన్, నికొలస్ కేజ్లతోపాటు నలుగురిని పెళ్లాడి, కొంతకాలానికే విడిపోయారు. ఈమెకు నలుగురు సంతానం కలిగారు. -
అతడి వల్లే ఇదంతా.. సన్‌రైజర్స్ మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలవలేదు!
IPL 2022 MI Vs SRH: వరుసగా ఐదు పరాజయాలతో ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఐపీఎల్-2022 సీజన్ ఆరంభంలో రెండు ఓటముల తర్వాత వరుసగా ఐదు మ్యాచ్ గెలిచి పడిలేచిన కెరటంలా దూసుకువచ్చిన విలియమ్సన్ బృందం.. ఆ తర్వాత చతికిలపడింది. వరుస మ్యాచ్‌లలో ఓడి మరోసారి విమర్శల పాలైంది. ముఖ్యంగా గత రెండు మ్యాచ్‌లలో ఆర్సీబీ చేతిలో 67 పరుగులు, కేకేఆర్ చేతిలో 54 పరుగుల తేడాతో ఓడి ప్లే ఆఫ్స్ రేసులో మరింత వెనుకబడింది. దీంతో ఆఖరి రెండు మ్యాచ్‌లలో భారీ విజయాలు సాధిస్తే తప్ప ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండవు. ఇలాంటి తరుణంలో మంగళవారం(మే 17న) ముంబై ఇండియన్స్‌తో పోరుకు ఎస్ఆర్హెచ్ సిద్ధమైంది. లీసా స్తాలేకర్(ఫైల్ ఫొటో) ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ మహిళా క్రికెటర్ లీసా స్తాలేకర్ ఈ ఎడిషన్‌లో విలియమ్సన్ సేన మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలవడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. సన్‌రైజర్స్ ప్రయాణం ముగిసినట్లే అనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ ఇందుకు గల కారణాలను విశ్లేషించారు. ‘‘గత చివరి రెండు మ్యాచ్‌లలో వాళ్లు(సన్‌రైజర్స్) 120+ స్కోరు చేశారు. తొలుత బ్యాటింగ్ చేసినా.. లక్ష్య ఛేదనకు దిగినా ఇలాంటి స్కోర్లు ఎంతమాత్రం సరిపోవు. ముఖ్యంగా టాపార్డర్‌లో కేన్ విలియమ్సన్ బాగా ఆడితేనే ఫలితం ఉంటుంది. ఓ వరల్డ్‌క్లాస్ ప్లేయర్ నుంచి కనీస ప్రదర్శన ఆశించడంలో తప్పులేదు. తను అస్సలు స్థాయికి తగ్గట్లు రాణించడం లేదు. అందుకే వాళ్లు చివరి రెండు మ్యాచ్‌లు గెలుస్తారని అనుకోవడం కష్టమే అనిపిస్తోంది’’ అని లీసా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇక గాయాలబారిన పడిన వాషింగ్టన్ సుందర్, నటరాజన్ సేవలను సన్‌రైజర్స్ కోల్పోవడం తీవ్ర ప్రభావం చూపుతోందని ఆమె పేర్కొన్నారు. కేన్ విలియమ్సన్ ఓపెనర్‌గా కాకుండా వన్‌డౌన్‌లో వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కాగా ఈ సీజన్లో ఆడిన 12 మ్యాచ్‌లలో విలియమ్సన్ సాధించిన పరుగులు 208. అత్యధిక స్కోరు 57. చదవండి👉🏾IPL 2022: 'మయాంక్ ఏం కెప్టెన్సీ చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు' #OrangeArmy, before our game tonight, @nicholas_47 has a message from the #Riser camp for all of you. 🗣️🧡#MIvSRH #ReadyToRise #TATAIPL pic.twitter.com/VrCIRczoN3 — SunRisers Hyderabad (@SunRisers) May 17, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Moneytalks: ‘లిజన్ టు మై మనీ టాక్’ సాంగ్ విన్నారా?
Everyone silent Listen to my money talk ... లాలిస మనోబాల్, ప్రాణ్ ప్రియా ఎవరు? అని అడిగితే చెప్పడం కష్టం కావచ్చుగానీ ‘ర్యాపర్ లీసా’ అంటే మాత్రం జవాబు చెప్పడం సూపర్ ఈజీ. థాయ్‌లాండ్‌లోని బురిరమ్ ప్రావిన్స్‌లో పుట్టిన లీసా సౌత్ కొరియన్ గర్ల్ గ్రూప్ ‘బ్లాక్‌పింక్’లో సింగర్,ర్యాపర్, డ్యాన్సర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా వచ్చిన సింగిల్ ఆల్బమ్ ‘లాలిసా’ ఆమెకు మంచి పేరు తీసుకువచ్చింది. బిల్బోర్డ్ చార్ట్‌లో ఫిమేల్ సోలోయిస్ట్ బెస్ట్–సెల్లింగ్ ఆల్బమ్‌గా హల్చల్ చేస్తుంది. ఈ ఆల్బమ్‌లో ‘మనీ’ పాట పాప్లర్ అయింది. మనీ గురించి మనకు తెలియనిదేముంది! ఎక్కడా స్థిరంగా ఉండదు. కదులుతూనే ఉంటుంది. ఎప్పుడూ మౌనంగా ఉండదు. మాట్లాడుతూనే ఉంటుంది. చాలా రకాలుగా శాసిస్తూనే ఉంటుంది. ‘ఎవ్రీ వన్ సైలెంట్/ లిజన్ టు మై మనీ టాక్/ స్పెండ్ హౌ ఐ లైక్ ఇట్’ అని స్వీటు స్వీటుగా పాడుకుంటుంది లీసా. చదవండి: Saree Styles With Sweater: చలికాలంలో ఫ్యాషనబుల్‌గా వెచ్చని స్టైల్! -
నిజంగా గుండె పగిలింది.. కనీసం చివరి మ్యాచ్ అయినా ఆడనివ్వండి!
Lisa Sthalekar Comments on David Warner: డేవిడ్ వార్నర్ పట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ వ్యవహరిస్తున్న తీరును ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత లీసా స్తాలేకర్ తప్పుబట్టింది. జట్టుకు అతడు అందించిన సేవలను అసమానవైనవని, అలాంటి వార్నర్ విషయంలో అవనమానకరంగా ప్రవర్తించడం సరికాదని పేర్కొంది. ఈ మేరకు క్రిక్‌బజ్ లైవ్‌లో ఆమె మాట్లాడుతూ.. ‘‘డేవిడ్ వార్నర్ విషయంలో ఎస్ఆర్హెచ్ ప్రవర్తించిన తీరు చూసి గుండె పగిలింది. ఫ్రాంఛైజీ కోసం అతడు చాలా చేశాడు. జట్టును ముందుండి నడిపించాడు. 2016లో టైటిల్ సాధించిపెట్టాడు. అలాంటి కెప్టెన్ పట్ల ఈవిధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు. తను చేసిన తప్పేంటో అర్థం కావడం లేదు. నిజంగా ఫ్రాంఛైజీ తీరు అస్సలు నచ్చడం లేదు. నాకు తెలిసి.. వచ్చే ఏడాది వాళ్లు తనను రీటైన్ చేసుకోరేమో! కాబట్టి తనను చివరి మ్యాచ్ ఆడనిస్తే బాగుంటుంది. హైదరాబాద్ అభిమానులు తన ఆట కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారన్న విషయం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది’’ అని పేర్కొంది. కాగా ఐపీఎల్-2021 సీజన్ తొలి అంచెలో ఆరెంజ్ ఆర్మీ వరుస వైఫల్యాల నేపథ్యంలో వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించిన యాజమాన్యం.. ఆ తర్వాత తుది జట్టులో కూడా అవకాశం ఇవ్వలేదు. ఇక యూఏఈ వేదికగా జరుగుతున్న రెండో అంచెలో ఈ ఆసీస్ బ్యాటర్ విఫలం కావడంతో... పూర్తిగా పక్కన పెట్టేసింది. కొన్ని మ్యాచ్‌లలో కనీసం మైదానంలో కూడా అతడు కనిపించలేదు. అయితే, ఇటీవలి కేకేఆర్ మ్యాచ్‌లో డగౌట్లో వార్నర్ కనిపించడంతో అభిమానులు కాస్త సంతోషించారు. ఇక హైదరాబాద్ తరఫున తనకు ఇదే చివరి సీజన్ కాబోతుందంటూ వార్నర్ సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో... లీసా వలె ఫ్యాన్స్ సైతం అతడిని చివరి మ్యాచ్ ఆడనివ్వాలని కోరుతున్నారు. ఇక బుధవారం హైదరాబాద్ జట్టు, ఆర్సీబీతో తలపడనున్న సంగతి తెలిసిందే. మరి ఈరోజు వార్నర్ మైదానంలోనైనా కనిపిస్తాడో లేదో చూడాలి!.. ఇక ఇప్పటికే విలియమ్సన్ సేన ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. చదవండి: T20 World Cup: పొలార్డ్ టాప్-5 ఫేవరెట్ లిస్టు.. ఆశ్చర్యకరంగా తను కూడా! -
జస్టిస్ ఫర్ లీసా: ట్విటర్లో పెను విధ్వంసం
Justice For Lisa Twitter Trend: అభిమానం వెర్రితలలు వేస్తే ఎలా ఉంటుందో నిరూపించే ఘటన ఇది. ఓ పాప్ సింగర్ కోసం కోట్ల మంది కదిలారు. #justiceforlisa.. ఇప్పుడు ట్విటర్లో మోత మోగిపోతున్న హ్యాష్‌ట్యాగ్. లీసా అనే యంగ్ ర్యాపర్‌కు న్యాయం చేయాలంటూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. ఓవైపు పాత ట్వీట్లు డిలీట్ చేస్తుంటే.. లక్షల కొద్దీ కొత్త ట్వీట్లు పుట్టుకొస్తుండడం విశేషం. ఈ క్రమంలో ఇప్పటికే ఒకటిన్నర మిలియన్ల ట్వీట్లు దాటిపోయాయి మరి! దక్షిణ కొరియా పాప్ గ్రూప్ ‘బ్లాక్‌పింక్’కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ గ్రూప్‌లోని నలుగురు సింగర్స్‌లో లీసా మనోబల్(24) ఒకరు. ఆమె అసలు పేరు ప్రణ్ప్రియా మనోబల్. థాయ్‌లాండ్‌లో పుట్టి, పెరిగిన లీసా.. 2010లో పదమూడేళ్ల వయసుకి వైజీ ఎంటర్టైన్మెంట్ లేబుల్‌లో చేరింది. ఆ తర్వాత దక్షిణ కొరియాకు మకాం మార్చేసి.. 2016 నుంచి బ్లాక్‌పింక్‌లో సింగర్‌గా కొనసాగుతోంది. బ్లాక్‌పింక్‌లో స్టార్డమ్, వరల్డ్‌వైడ్ ఫ్యాన్‌ఫాలోయింగ్, బ్రాండ్ అంబాసిడర్ల లిస్ట్.. ఇలా ఎందులో చూసుకున్నా ఈమెకే క్రేజ్ ఎక్కువ. అలాంటిది.. కొద్దికాలంగా బ్లాక్‌పింక్ ఈవెంట్లకు లీసా పూర్తిగా దూరంగా ఉంటోంది. ఈమధ్య బివిల్‌గరి ఫ్యాషన్వీక్తో పాటు మరికొన్ని షోస్‌కు లీసాను వైజీ ఎంటర్టైన్మెంట్ ప్రమోట్ చేయలేదు. మిగతా ముగ్గురు సింగర్స్ జీసూ, జెన్నీ, రోజ్‌లను మాత్రం ప్రతీదానికి అనుమతిస్తున్నారు. ఈ వ్యవహారంపై లీసా అభిమానుల నుంచి నిరసర వ్యక్తంకాగా.. స్పందించిన వైజీ ఎంటర్టైన్మెంట్ కరోనా నిబంధనల కారణంగానే లీసాను అనుమతించడం లేదంటూ వివరణ ఇచ్చుకుంది. దీంతో అగ్గిరాజుకుంది. లీసాకు మద్దతుగా ఆమె ఫ్యాన్స్.. #justiceforlisa, #YGLetLisaDoHerWork హ్యాష్‌ట్యాగ్‌లను నడిపిస్తున్నారు. స్వదేశం నుంచి ఫ్రాన్స్‌కు లీసాను రప్పించడం, పారిస్ ఫ్యాషన్ వీక్‌లో అవకాశం ఇవ్వకపోవడాన్ని ఆమెకు జరిగిన అవమానంగా భావిస్తున్నారు అభిమానులు. మిగతా సింగర్స్ విషయంలో లేని ఆంక్షలు, అభ్యంతరాలు.. లీసాకు మాత్రమే ఎందుకని నిలదీస్తున్నారు. ఈ క్రమంలోనే గుర్రుగా ట్విటర్లో పోస్టులు పెడుతున్నారు. అయితే బివిల్‌గరి సీఈవో జీన్ క్రిస్టోఫె బాబిన్ స్పందిస్తూ.. కొవిడ్ నిబంధనలు, పైగా ఆమె(లీసా) సొంత ఏజెన్సీ సూచనల మేరకే లీసా దూరంగా ఉంటోందని వెల్లడించారు. తెరపైకి రేసిజం! ఇక ఈ వివాదంలోకి రేసిజం ప్రస్తావన తెస్తున్నారు కొందరు. దక్షిణ కొరియా వ్యాపారవేత్త, వైజీ ఎంటర్టైన్మెంట్ సీఈవో వాంగ్బోక్యుంగ్ జాత్యాహంకారంతో లీసాను పక్కనపెట్టిందనేది వాళ్ల వాదన. లీసా థాయ్‌లాండ్ ర్యాపర్ కావడం వల్లే ఈ వివక్ష అని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో వాంగ్బోక్ మీద RIP పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు వైజీ ఎంటర్టైన్మెంట్ తన షేర్లు పతనం కాకుండా ఉండేందుకు #justiceforlisa ట్వీట్లను డిలీట్ చేయిస్తోందన్న వాదన తెర మీదకు వచ్చింది. దీంతో లీసా ఫ్యాన్స్ మరింత రెచ్చిపోయి ట్వీట్లేస్తున్నారు. కేవలం మ్యూజిక్ కేటగిరీలోనే ఒకటిన్నర మిలియన్ల ట్వీట్లు రాగా, మొత్తంగా నాలుగు మిలియన్లకు పైనే లీసా మద్దతు ట్వీట్లు పోస్ట్ అయ్యి ఉంటాయని తెలుస్తోంది. #YGLetLisadoHerWork Pinche vieja ojalá y se valla al infierno. pic.twitter.com/GyQzTYeKt0 — lililie🇲🇽 (@Lili_valdezz) October 6, 2021 YG prefers to delete our hashtag instead of giving us a statement as to why they are restricting lisa's work and as far as i remember they never even moved this fast to clean up the mess when lisa was being dragged by antis 🤭 JUSTICE FOR LISA#YGLetLisadoHerWork — ʟᴇᴍᴏɴ (@Lmonart_) October 6, 2021 సింగిల్‌గా దుమ్మురేపింది వైజీ ఎంటర్టైన్మెంట్తో కొద్దికాలంగా ఆమెకు పొసగడం లేదన్న వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. ఈ ఊహాగానాల నడుమే ఆమె బ్లాక్‌పింక్ నుంచి బయటకు వచ్చేస్తుందంటూ కథనాలూ వెలువడ్డాయి. కానీ, లీసా ఇప్పటివరకు స్పందించింది లేదు. ఇదిలా ఉండగానే సెప్టెంబర్‌లో లాలిసా పేరుతో సోలో ఆల్బమ్ రిలీజ్ చేసింది లీసా. సౌత్ కొరియాలో ఏడున్నర లక్షల కాపీలు అమ్ముడుపోయి.. రికార్డు సృష్టించాయి. అంతేకాదు యూట్యూబ్ ఒక్కరోజులో 76.3 మిలియన్ల వ్యూస్ రాబట్టి మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఫ్యాన్స్ రెచ్చిపోతున్న క్రమంలో ఆమె ఇంకా బ్లాక్పింక్లోనే కొనసాగుతుందా? లేకపోతే బయటకు వచ్చేస్తుందా? అనేది చూడాలి. -
21 ఏళ్ల బంధానికి ముగింపు పలికిన నటుడు!
Kamal Sadanah to Divorce Lisa John: హిందీ నటుడు, నిర్మాత కమల్ సదన 21 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. భార్య లీసా జాన్‌తో విడిపోతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం ఇద్దరూ విడివిడిగా బతుకుతున్నట్లు వెల్లడించాడు. 'చూడటానికి ఇద్దరు వ్యక్తులు కలిసే ఉంటున్నా ఒకే దారిలో వెళ్లలేరు. ఇలాంటివి చాలాచోట్ల జరుగుతూ ఉంటాయి. అందులో మాది కూడా ఒకటి' అని సింపుల్‌గా చెప్పుకొచ్చాడు. కాగా కమల్, లీసా 2000వ సంవత్సరం జనవరి 1న పెళ్లి చేసుకున్నారు. వీరికి కొడుకు అంగత్, కూతురు లియా సంతానం. మేకప్ ఆర్టిస్ట్‌గా పని చేస్తున్న లిసా ప్రస్తుతం తన తల్లిదండ్రులతో కలిసి గోవాలో నివసిస్తున్నట్లు సమాచారం. 1992లో వచ్చిన 'బేఖుడి' సినిమాలో కాజోల్కు జోడీగా నటించాడు కమల్. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ఆయన 2007లో 'విక్టోరియా నెంబర్ 203: డైమండ్స్ ఆర్ ఫరెవర్' చిత్రంతో నిర్మాతగా మారాడు. అనంతరం 2014లో 'రోర్' సినిమాతో దర్శకుడిగానూ అవతారమెత్తాడు. అభినవ్ శుక్లా,హిమార్ష, సుబ్రత్ దత్త, వీరేంద్ర సింగ్, అలీ ఖలీ మీర్జా ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. -
ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో కలిస్, లీసా, జహీర్ అబ్బాస్
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో మరో ముగ్గురు మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, దిగ్గజ ఆల్‌రౌండర్ జాక్వస్‌కలిస్... అలనాటి పాకిస్తాన్ డాషింగ్ బ్యాట్స్‌మన్, మాజీ సారథి జహీర్ అబ్బాస్... ఆస్ట్రేలియా మహిళల జట్టు మాజీ కెప్టెన్ లీసా స్థాలేకర్ కొత్తగా ఈ జాబితాలో చేరినట్లు ఆదివారం ఐసీసీ ప్రకటించింది. కరోనా నేపథ్యంలో వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో షాన్ పొలాక్‌తో పాటు భారత దిగ్గజం సునీల్ గావస్కర్ పాల్గొని ఈ ముగ్గురికీ శుభాకాంక్షలు తెలిపారు. దక్షిణాఫ్రికా తరఫున 1995– 2014 మధ్య కాలంలో 166 టెస్టులు, 328 వన్డేలు, 25 టి20 మ్యాచ్‌ల్లో కలిస్ ప్రాతినిధ్యం వహించాడు. సఫారీల తరఫున టెస్టుల్లో అత్యధికంగా 13,289 పరుగులు చేసి 292 వికెట్లు తీశాడు. వన్డేల్లో 11,579 పరుగులు సాధించి 273 వికెట్లు పడగొట్టాడు. గ్రేమ్ పొలాక్, బ్యారీ రిచర్డ్స్, డొనాల్డ్ తర్వాత ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు పొందిన నాలుగో దక్షిణాఫ్రికా క్రికెటర్ కలిస్. ‘ఏదో ఆశించి నేను ఆట ఆడలేదు. నా జట్టును గెలిపించేందుకు నిజాయితీగా ఆడాను. కానీ ఈరోజు ఐసీసీ గుర్తింపు లభించడం ఆనందంగా ఉంది’ అని 44 ఏళ్ల కలిస్ వ్యాఖ్యానించాడు. మహిళల వన్డే ప్రపంచకప్ (2005, 2013), టి20 ప్రపంచ కప్ (2010, 2012) గెలుపొందిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యురాలైన 41 ఏళ్ల లీసా స్థాలేకర్... భారత్‌లోని పుణే నగరంలో పుట్టి ఆస్ట్రేలియాకు వలస వెళ్లింది. ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో స్థానం పొందిన ఐదో మహిళా క్రికెటర్ లీసా. తన కెరీర్లో 8 టెస్టులు ఆడి 416 పరుగులు చేసి, 23 వికెట్లు తీసింది. 125 వన్డేలు ఆడి 2,728 పరుగులు చేసి 146 వికెట్లు పడగొట్టింది. 54 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడిన లీసా 769 పరుగులు చేసి 60 వికెట్లు తీసింది. హనీఫ్ మొహమ్మద్, ఇమ్రాన్ ఖాన్, జావెద్ మియాందాద్, వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్ తర్వాత ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో స్థానం సంపాదించిన ఆరో పాకిస్తాన్ ప్లేయర్ జహీర్ అబ్బాస్. 73 ఏళ్ల జహీర్ అబ్బాస్ 1969 నుంచి 1985 వరకు పాక్ జట్టు తరఫున ఆడారు. 78 టెస్టులు ఆడిన ఆయన 5,062 పరుగులు సాధించారు. ఇందులో 12 సెంచరీలు, 20 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 62 వన్డేలు ఆడిన అబ్బాస్ 2,572 పరుగులు చేశారు. ఇందులో 7 సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో 100 కంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఏకైక ఆసియా క్రికెటర్ జహీర్ అబ్బాస్ కావడం విశేషం. -
రూట్ మార్చిన అంజలి
నటి అంజలి రూట్ మార్చారు. నటిగా కోలీవుడ్, టాలీవుడ్ అంటూ చక్కర్లు కొడుతున్న ఈ అమ్మడికి ప్రస్తుతం టాలీవుడ్లో అవకాశాలు తగ్గాయి. అయితే కోలీవుడ్‌లో మాత్రం బిజీగానే ఉన్నా.. సక్సెస్‌లు మాత్రమే తగ్గాయి. తాజాగా నటించిన లిసా చిత్రంపై ఈ సంచలన నటి చాలా ఆశలు పెట్టుకున్నారు. పైగా 3డీ ఫార్మెట్లో తెరకెక్కడంతో హర్రర్ కథా చిత్రం లిసా అందరినీ భయపెట్టి వసూళ్లు రాబడుతుందని ఆశించారు. అయితే ఇటీవల తెరపైకి వచ్చిన లిసా చిత్రం అంజలి ఆశలపై నీళ్లు చల్లింది. అదే విధంగా ఇటీవల తెలుగు, తమిళ భాషల్లో ఈ అమ్మడు హర్రర్ చిత్రాలనే చేస్తూ వచ్చారు. లిసా చిత్ర రిజల్ట్‌తో అంజలి రూట్ మార్చినట్లు తెలుస్తోంది. హర్రర్ కథా చిత్రాలు వర్కౌట్ కాకపోవడంతో ఈ బ్యూటీ ఇప్పుడు కామెడీకి మారిపోయారు. దర్శకుడు కృష్ణన్ జయరాజ్ తాజాగా ఒక వినోదభరిత కథా చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈయన ఇంతకు ముందు మిర్చి శివ, వసుంధర జంటగా సొన్నా పురియాదు అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. తన తాజా చిత్రంలో హీరోయిన్గా నటి అంజలిని ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం అంజలి విజయ్‌సేతుపతికి జంటగా నటించిన సింధుబాధ్, శశికుమార్ సరసన నటించిన నాడోడిగళ్–2 చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. ఈ చిత్రాలు సాధించే విజయాల కోసం అంజలి ఆశగా ఎదురుచూస్తోందట. నటుడు జైతో ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టడంతో కొంతకాలం ఒంటరిగానే ఉన్న అంజలి తాజాగా మరో నటుడితో లవ్‌లో పడ్డట్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందులో నిజం ఎంత అన్నది అంజలి స్పందిస్తేగానీ తెలియదు. అన్నట్లు ఇటీవల ఈ బ్యూటీ కాస్త బరువు తగ్గి మరింత అందంగా తయారయ్యారు. -
అంజలి చాలా నేర్పించింది!
సినిమా: నటి అంజలి సీనియర్ కావడంతో నాకు చాలా నేర్పించింది అని చెప్పాడు వర్థమాన నటుడు శ్యామ్ జోన్స్. వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం లిసా. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. తెలుగులోనూ అనువాదమై విడుదల కానుంది. దీంతో ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్న చిత్ర హీరో శ్యామ్ జోన్స్ తన అనుభవాలను పంచుకుంటూ చెన్నైలోని లయోలా కళాశాలలో బీకాం చదువుతున్నప్పుడే నటనపై ఆసక్తి కలిగిందని చెప్పాడు. అలా సినిమా ఆలోచనలతోనే డిగ్రీని పూర్తి చేశానని తెలిపాడు. ఆ తరువాత ఏమాలి చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని చెప్పాడు. అందులో సముద్రకనితో నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నాడు. తొలి చిత్రంతోనే నటుడిగా మంచి గుర్తింపు వచ్చిందన్నాడు. ఆ తరువాత లిసా చిత్రంలో బ్రహ్మానందంకు కొడుకుగా యువ కథానాయకుడిగా నటించానని చెప్పాడు. ఇందులో తాను, నటి అంజలి జంటగా నటించామని తెలిపారు. బెంగళూర్ నుంచి కోడైక్కానల్కు వెళ్లే కళాశాల జంటగా నటించామని తెలిపాడు. నటిగా తనకు సీనియర్ అయిన నటి అంజలి చాలా విషయాలను తనకు చెప్పిందని, అలా నటనలో శిక్షణ ఇచ్చిందని చెప్పాడు.ఈ చిత్ర తెలుగులోనూ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పినట్లు తెలిపారు. కాగా ధర్మప్రభు అనే చిత్రంలోనూ హీరోగా నటించానని, అందులో యమలోకంలో యోగిబాబు, భూలోకంలో తానూ హీరోలుగా నటించినట్లు చెప్పాడు. ఈ చిత్రం జూన్‌లో తెరపైకి రావడానికి రెడీ అవుతోందని తెలిపాడు. ఇది విభిన్నమైన వినోదభరిత కథా చిత్రంగా ఉంటుందని చెప్పాడు. తాను కుర్రాడిని కావడంతో యువ కథానాయకుడిగా నటించే అవకాశాలు వస్తున్నాయని, తదుపరి ఇద్దరు ప్రముఖ దర్శకుల చిత్రాల్లో నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయని చెప్పాడు. నటుడు విజయ్‌సేతుపతి తర హాలో అన్ని రకాల పాత్రల్లో నటించి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించాలని కోరుకుంటున్నానని శ్యామ్జోన్స్ అంటున్నాడు -
అందాల రాక్షసి
పెనం మీద దోశ వేస్తున్నారు నటి అంజలి. కానీ ఆ కాలిన దోశను ప్లేట్లో వేయలేదు. పెనంతో సహా డైరెక్టర్ ఫేస్ మీద విసిరి కొట్టారు. కోపంతో కాదులేండి. పొరపాటున డైరెక్షన్ మారి, డైరెక్టర్‌కి తగిలింది. ‘లీసా’ సినిమాలోని ఓ సన్నివేశం చిత్రీకరణలో భాగంగా ఇది జరిగింది. షాట్‌కు కాస్త దూరంగా ఉండటంతో పెద్ద దెబ్బకూడా తగల్లేదట దర్శకునికి. అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న హారర్ చిత్రం ‘లీసా’. రాజు విశ్వనాథ్ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ పీజీ ముత్తయ్య నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాను హిందీలో కూడా డబ్ చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొడైకెనాల్లో జరుగుతోంది. లొకేషన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ ఫొటోను ట్యాగ్ చేసిన రాజు మా సినిమాలో ‘గార్జియస్ ఘోస్ట్’ అని అంజలిని ఉద్దేశించి సరదాగా అన్నారు. బహుశా పెనం ఎఫెక్ట్కే అంజలికి ఈ బిరుదు ఇచ్చి ఉంటారు. ఇదిలా ఉంటే ‘లీసా’ చిత్రాన్ని 3డీలో తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం అడ్వాన్డ్స్ టెక్నాలజీతో ఉన్న 8కె హీలియం కెమెరా వాడుతున్నారు. ‘‘అందం, అభినయంతో పాటు తమిళం, తెలుగు మాట్లాడగలిగే కథానాయిక కావాలనుకున్నాం. అందుకే అంజలిని ఎంపిక చేశాం. దాదాపు 200 టైటిల్స్ అనుకున్నాం. ఫైనల్‌గా ‘లీసా’ అని ఫిక్స్ అయ్యాం. విభిన్నమైన హారర్ చిత్రం ఇది’’ అని పేర్కొన్నారు దర్శకుడు రాజు. -
మ్యూజియంలో మైక్రోస్కోపిక్ మోనాలీసా
లండన్: ప్రపంచంలో అత్యంత ఖరీదైన... అందమైన పెయింటింగుల్లో మోనాలీసా ఒకటి. ఆమె.. ఇప్పుడు సాంకేతిక నిపుణుల చేతిలో కొత్త రూపం దాల్చింది. పారిస్ లౌన్రే మ్యూజియంలో అతి సూక్ష్మ రూపంలో దర్శనమిస్తోంది. నానో టెక్నాలజీని ఉపయోగించి రూపొందించిన ఆ వర్ణ చిత్రం ఓ పిక్సల్ కంటే తక్కువగా ఉండి, ఐఫోన్ రెటీనా డిస్ ప్లే లా నిజమైన మోనాలీసా కంటే సుమారు పదివేల రెట్లు తక్కువగా కనిపిస్తోంది. లేజర్ ప్రింటింగ్ టెక్నాలజీలో ఇప్పుడు అద్భుతాలను సృష్టించగల్గుతున్నారు. ఏ చిత్రాన్నైనా భిన్నంగా చూపించగల్గుతున్నారు. సుమారు 127.000 (డాట్స్ పర్ ఇంచ్) డిపిఐ రిజల్యూషన్ తో చిత్రాలు రూపొందే అవకాశం ఉండటంతో పాటు...అధిక నాణ్యత ఉండే ఈ కొత్త టెక్నాలజీపైనే అంతా ఆధారపడుతున్నారు. ముఖ్యంగా వార పత్రికలు వంటివి ప్రింట్ చేసేందుకు సుమారు మూడు వందల డిపిఐతో ఇది మంచి ఫలితాలనిస్తోంది. ఈ లేజర్ టెక్నాలజీతో ఓ కొత్త అప్లికేషన్ ను కూడా రూపొందించే అవకాశం ఉన్నట్లుగా డెబ్ మార్క్ టెక్నికల్ యూనివర్శిటీ పరిశోధక బృందం చెప్తోంది. దీంట్లో డేటాను కనిపించకుండా ఉండేంత సూక్ష్మ రూపంలో దాచుకునేందుకు వీలౌతుంది. సీరియల్ నెంబర్లు, బార్ కోడ్ లు వంటి వాటితో పాటు... ఇతర డేటానూ భద్రపరచుకోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. దీంతో మోసాలకు పాల్పడేవారికి ముకుతాడు వేయొచ్చంటున్నారు అధ్యయనకారులు. ఇప్పుడు ఈ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా మోనాలీసా చిత్రానికి వినియోగించి అతి సూక్ష్మరూపంలో రూపొందించి ప్రత్యేకతను చాటారు. కుడ్య రూపాలు, చిత్రాలకే కాక... అలంకరణలు, మొబైల్ ఫోన్లు వంటి ఉత్పత్తుల కోసం ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. కార్ల భాగాలు, వాయిద్య పరికరాల ప్యానెల్స్, బటన్స్ వంటి వస్తువుల తయారీ సులభతరం అవుతుండటంతో ఈ కొత్త విధానంపై విదేశీ కంపెనీలు సైతం ఆసక్తి చూపుతున్నాయి. -
10 పాయింట్స్ ఇక నా జీవితం ముగిసినట్లే అనుకున్నా!
మోడల్, నటి లిసారే (లిసా రాణి రే) మహేష్‌బాబు ‘టక్కరిదొంగ’లో భువన పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు సైతం చేరువయ్యారు. ఈ అందాల నటి మాటల్లో కనిపించే పరిణతి ‘టెన్ పాయింట్స్’లో చదువుదాం... 1- సంతోషం క్యాన్సర్‌కి ముందు, తరువాత అని నా జీవితం రెండుగా విభజితమైపోయింది. క్యాన్సర్‌కి ముందు నా ప్రాధాన్యతల జాబితాలో ఏవేవో ఉండేవి. ఇప్పుడు ఒకే ఒకటి ఉంది. అదే ‘సంతోషం’ సంతోషాన్ని సంతోషంతో మాత్రమే సాధించగలం! 2- తాజాగా... సౌందర్యసాధనాల వల్ల ముఖం తాజాగా ఉండడం కంటే ప్రయాణం వల్లే తాజాగా ఉంటుంది. ఎందరో కొత్త వ్యక్తులతో మాట్లాడతాం. కొత్త విషయాలు తెలుస్తాయి. ఈ ప్రయాణంలో కొత్త ప్రదేశాల్లోకే కాదు...మనలోకి మనం కూడా ప్రయాణిస్తాం. 3- అధికారి మన శరీరం అనేది కార్యాలయం అనుకుంటే మనమే పర్యవేక్షణ అధికారి. మన బలాలు, బలహీనతల గురించి మనమే తెలుసుకోవాలి. సమస్య ఉన్నచోట పరిష్కారం ఆలోచించాలి. అనేకానేక విషయాల్లో నన్ను నేను దగ్గరిగా పర్యవేక్షించుకుంటాను. 4- చీకటి జీవితం నిండా కాంతిపుంజాలు మాత్రమే ఉండవు. చీకట్లు కూడా ఉంటాయి. అప్పుడే కదా వెలుతురు విలువ ఏమిటో తెలిసేది. నాకు క్యాన్సర్ ఉందని తెలిసినప్పుడు ‘ ఇక నా జీవితం ముగిసినట్లే’ అనుకున్నా. కానీ అది నిజం కాలేదు. 5- విజయం విజయం తరువాత లభించేది ఉత్సాహం మాత్రమే కాదు... అంతకుముందెన్నడూ లేని శక్తి కూడా మనలోకి వచ్చి చేరుతుంది. క్యాన్సర్‌పై విజయం సాధించిన తరువాత... నాలో ఎన్నో సృజనాత్మక ఆలోచనలు మొలకెత్తాయి. 6- భారం మన జీవితాన్ని మనం గొప్పగా తీర్చిదిద్దుకోవడం, లక్ష్యాలు పెట్టుకోవడంలో తప్పు లేదు. అయితే లక్ష లక్ష్యాలతో జీవితం మీద భారం మోపకూడదు. బండి అయినా సరే, జీవితం అయిన సరే... భారం ఎంత తక్కువగా ఉంటే... అంత చురుకుదనం. 7- బలం కొన్నిసార్లు బలహీనతలే బలాలవుతాయి. నన్ను నేను సంపూర్ణంగా మోదించుకున్నప్పుడు...నాలోని అసంపూర్ణ ప్రయత్నాలు, ఫలితాలను గురించి కూడా ఆమోదించుకుంటాను. ఆ తరువాతే వాటిపై పై చేయి సాధించడం గురించి ఆలోచిస్తాను. 8- రచన మనమేమిటో తెలుసుకోవడానికి, మన పయనం గురించి తెలుసుకోవడానికి రచన అనేది మంచి మార్గం. అందుకే నేను కూడా ‘ది ఎల్లో డైరీస్’ పేరుతో ఒక బ్లాగ్‌ను నిర్వహిస్తున్నాను. 9- ఆయుధం నిరాశానిస్పృహల్లో ఉన్నప్పుడు ధైర్యవచనలే ఆయుధాలు. నేను క్యాన్సర్‌తో బాధ పడుతున్న సమయంలో, క్యాన్సర్‌ని జయించిన అనేకమంది విజేతలతో మాట్లాడాను. వారి మాటల్లో నుంచి ఎంతో ధైర్యాన్ని కూడగట్టుకున్నాను. 10- సేవ సేవ చేయడం ద్వారా లభించే తృప్తి శరీరానికి, మనసుకు సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. క్యాన్సర్ పేషెంట్లకు అండగా నిలిచే ఢిల్లీలోని ‘లివింగ్ విత్ క్యాన్సర్’ స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తున్నాను. -
ఒక ప్రేమ ఒక పగ
జూలై 30, 2011... ఉదయం ఆరున్నర దాటుతోంది. సిడ్నీలోని సీబీడీ అపార్ట్మెంట్ ఆవరణ అంతా గందరగోళంగా ఉంది. ‘‘తప్పుకోండి... తప్పుకోండి... ఏం జరిగింది?’’... గుమిగూడిన జనాన్ని తోసుకుంటూ ముందుకు వచ్చాడో వ్యక్తి. నేలమీద ఉన్న రక్తపు మరకలు, వాటి చుట్టూ ఉన్న చాక్‌పీస్ మార్కులు, వాటిని పరిశీలిస్తున్న పోలీసుల్ని చూస్తూనే విస్తుపోయాడు. ‘‘ఏం జరిగింది?’’ అన్నాడు ఆతృతగా. ‘‘ఫ్లాట్ నంబర్ 1503లోని అమ్మాయి పై నుంచి పడిపోయింది’’ అది వింటూనే ‘లీసా’ అంటూ గావుకేక పెట్టాడా వ్యక్తి. పరిశోధనలో మునిగివున్న సార్జెంట్ కూపర్ వెంటనే ఆ అరుపు వచ్చినవైపు చూశాడు. ఖరీదైన జీన్స్, టీషర్ట వేసుకుని పాష్‌గా ఉన్నాడా వ్యక్తి. జరిగినదాన్ని నమ్మలేను అన్నట్టుగా అతడి కళ్లు విప్పారి ఉండిపోయాయి. పొంగుకొస్తున్న దుఃఖంతో పెదవులు అదురుతున్నాయి. క్షణంలో ముఖం కందిపోయింది. కన్నుల గుండా అశ్రుధారలు పొంగుకొస్తున్నాయి. మెల్లగా ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లాడు కూపర్. ‘‘ఆ అమ్మాయి మీకు తెలుసా?’’ అన్నాడు అతడి ముఖంలోకే చూస్తూ. ‘‘తెలుసు సార్. తను నాకు కాబోయే భార్య... లీసా ఆర్నమ్’’... బావురున్నాడు. ‘‘మీరు ఫేమస్ వ్యాపారి సైమన్ గిటానీ కదా!’’ అవునన్నట్టు తలూపాడు. ‘‘తనెక్కడుంది సార్... ఎలా ఉంది? ఏం ప్రమాదం లేదు కదా?’’ అతడి ఆతృత చూసి జాలేసింది కూపర్‌కి. ‘‘సారీ మిస్టర్ గిటానీ... షి ఈజ్ నో మోర్. పదిహేనో అంతస్తు నుంచి పడటం వల్ల వెంటనే చనిపోయింది.’’ ‘‘నో... లీసా’’... వెక్కి వెక్కి ఏడవసాగాడు. ‘‘బాధపడకండి. ధైర్యంగా ఉండండి’’ అని భుజం తట్టాడు కూపర్. అంతలో సబార్డినేట్ వచ్చి... ‘‘సర్... అపార్ట్మెంట్ చూడాలన్నారు కదా’’ అన్నాడు. అవునన్నట్టు తలాడించి... ‘‘మిస్టర్ గిటానీ... మీరూ రండి’’ అన్నాడు. సరేనన్నట్టు తలూపి వారి వెంట నడిచాడు సైమన్ గిటానీ. వాళ్లు వెళ్లేసరికి 1503వ ఫ్లాట్‌లో ల్యాండ్ ఫోన్ రింగవుతోంది. కూపర్ ఫోన్ తీసి హలో అనేలోపే అవతలి గొంతు కంగారుగా పలికింది... ‘‘లీసా... ఎలా ఉన్నావమ్మా?’’ కూపర్ ‘‘హలో’’ అన్నాడు. ఒక్క క్షణం అవతలి నుంచి శబ్దం రాలేదు. ఆ తర్వాత ఆమె అడిగింది.. ‘‘ఎవరు మీరు? లీసా ఎక్కడ?’’ ‘‘మీరెవరు?’’ ‘‘లీసా వాళ్ల మమ్మీని.’’ ‘‘సారీ మేడమ్. మీ అమ్మాయి లీసా... ఆత్మహత్య చేసుకుంది.’’ ‘‘వ్వా...ట్’’... అరించిందామె. ‘‘లేదు. నా బంగారుతల్లి నన్ను వదిలి వెళ్లిపోదు. మీరు అబద్ధం చెబుతున్నారు. పిలవండి... నా లీసాని పిలవండి’’... పిచ్చి పట్టినట్టుగా అరుస్తూ ఏడుస్తోంది. ‘‘కంట్రోల్ యువర్సెల్ఫ్ మేడమ్. నేను చెప్పేది నిజమే. తెల్లవారు జామున మీ అమ్మాయి పదిహేనో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. నేను ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన పోలీసాఫీసర్ని.’’ ‘‘లేదు. తను ఆత్మహత్య చేసుకోదు. అంత పిరికిది కాదు తను. నిన్ననే నాతో మాట్లాడింది. నీ దగ్గరకు వచ్చేస్తానమ్మా అంది. ఇంతలోనే ఎందుకు చనిపోతుంది! వాడే... వాడే తనని చంపేసి ఉంటాడు. వాణ్ని నేను వదలను.’’ కూపర్ భృకుటి ముడివడింది. ‘‘ఎవరి గురించి అంటున్నారు?’’ ‘‘ఇంకెవరు? వాడే... ఆ సైమన్... నా కూతురి జీవితాన్ని నరకం చేసేశాడు. వాడ్ని వదిలించుకుని వచ్చేస్తానని నిన్ననే నాతో చెప్పింది లీసా. కానీ ఇంతలోనే...’’ దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోయింది. మరుక్షణంలో ఫోన్ కట్ అయ్యింది. నిట్టూర్చాడు కూపర్. రిసీవర్ని క్రెడిల్ చేసి వెనక్కి తిరిగాడు. ‘‘మిస్టర్ సైమన్ గిటానీ... యు ఆర్ అండర్ అరెస్ట్’’ అంటూ అతడి చేతికి బేడీలు వేశాడు. ‘‘మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సర్. నేనెందుకు లీసాని చంపుతాను? తను నా ప్రాణం. త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. చాన్నాళ్లుగా కలిసేవుంటున్నాం.’’ చురుక్కున చూశాడు కూపర్. ‘‘కలిసే ఉంటున్నారా? మరి తను చనిపోయిన రోజు నువ్వు ఫ్లాట్‌లో ఎందుకు లేవు?’’ గతుక్కుమన్నాడు సైమన్. బిత్తర చూపులు చూశాడు. తర్వాత తేరుకుని అన్నాడు. ‘‘నేను పనుండి ఆ రాత్రి ఇంటికి రాలేదు సర్. ఏం జరిగిందో నాకెలా తెలుస్తుంది చెప్పండి!’’ ‘‘తెలుసుకోకుండా నువ్వు ఉండలేవు కదా మిస్టర్ గిటానీ... ఆ అపార్ట్మెంట్లోకి చీమ వచ్చినా నీకు తెలిసిపోతుంది.’’ ‘‘ఏమంటున్నారు సర్?’’ ‘‘చాలు ఇక నటించకు’’... కూపర్ అరుపుతో ఉలిక్కిపడ్డాడు సైమన్. ‘‘అపార్ట్‌మెంట్స్‌లో బయటి నుంచి ఎవరు వచ్చినా తెలియడానికి సీసీ కెమెరా పెడతారు. ఒకటి రోడ్డు వైపు... ఒకటి అపార్ట్మెంట్ వైపు. మీ అపార్ట్మెంట్లోనూ అలానే ఉన్నాయి. అయితే అదేంటోగానీ... నీ ఫ్లాటు దగ్గర కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఒకటీ రెండూ కాదు... మూడు. మరీ విచిత్రం ఏమిటంటే... ఇక ఏ ఫ్లాటు దగ్గరా ఒక్క కెమెరా కూడా లేదు. ఎందుకంటావ్?’’ మాట్లాడలేదు సైమన్. లీసా అంటే తనకెంతో ఇష్టమని, ఆమెనెంతో ప్రేమించానని పోలీసులు, న్యాయస్థానం ముందు మొసలి కన్నీళ్లు కార్చాడు సైమన్ గిటానీ. అయితే అతడికి లీసా మీద ప్రేమ ఏమాత్రం ఉందో కొన్నాళ్లకే తేలిపోయింది. కేసు నడుస్తుండగానే రేచెల్ లూయిస్ అనే మరో అమ్మాయిని తన జీవితంలోకి ఆహ్వానించాడు. ఆమెతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. చివరికి కోర్టుకి కూడా ఆమెను తీసుకునే వచ్చేవాడు. తన ఐశ్వర్యం, పలుకుబడితో కేసు నుంచి బయటపడతాననుకున్న సైమన్ నమ్మకాన్ని న్యాయస్థానం పటాపంచలు చేసింది. అతడిని కటకటాల వెనక్కి నెట్టింది. ప్రేమను పగతో కాలరాసిన అతడికి తగిన శాస్తి జరిగింది! ‘‘ఏం మాట్లాడవ్. నీ గుట్టు రట్టయ్యిందనా? ఆ మూడు కెమెరాలూ నువ్వేంటో చెప్పాయి మిస్టర్ గిటానీ. ఇక నిన్నెవరూ కాపాడలేరు’’ అంటూ వెళ్లిపోతోన్న కూపర్ వైపు అయోమయంగా చూస్తూండిపోయాడు సైమన్ గిటానీ. అతడు ఊహించలేదు... తాను పెట్టిన కెమెరాలే తన నిజ స్వరూపాన్ని బయటపెడతాయని. అందుకే షాక్ తిన్నాడు. తనని తాను తిట్టుకున్నాడు. కానీ నిజాన్ని మాత్రం తనంతట తాను అంగీకరించకూడదని నిర్ణయించుకున్నాడు. కేసు నడిచిన మూడేళ్లూ అలానే వాదించాడు. తాను అమాయకుడినని అన్నాడు. లీసాని ప్రాణంగా ప్రేమించానన్నాడు. ఆమె ఎందుకు చనిపోయిందో తనకు తెలియదన్నాడు. కోటీశ్వరుడైన వ్యాపారి కాబట్టి తనను తాను కాపాడుకోగలనన్న నమ్మకంతో అడ్డంగా వాదించాడు. అయితే నిజం ముందు డబ్బు ఓడిపోయింది. న్యాయం ముందు అతడి పలుకుబడి తలదించుకుంది. లీసా ఎంత మంచిదో తెలిసిన కొందరు ధైర్యంగా ముందుకొచ్చి సాక్ష్యం చెప్పారు. ఆమెను సైమన్ ఎంతగా హింసించాడో కోర్టు ముందు వెల్లడించారు. అమాయకురాలైన లీసాకి అనుకోకుండా సైమన్‌తో పరిచయమైంది. అది ప్రేమగా మారి, పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనకు దారి తీసింది. అందుకు సైమన్ కూడా ఒప్పుకున్నాడు. అయితే పెళ్లికి ముందు కొన్నాళ్లు కలిసుందామన్నాడు. సీబీడీ అపార్ట్మెంట్లోని ఖరీదైన 1503 ఫ్లాట్‌ను తమ ప్రేమ మందిరంగా మార్చేశాడు. తన ప్రేమతో లీసాని ఉక్కిరిబిక్కిరి చేశాడు. కానీ అతడు తన నిజమైన రూపాన్ని ఎక్కువకాలం దాచి పెట్టలేకపోయాడు. లీసాని తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలని ఆరాటపడేవాడు. ఆమె ఎవరితో మాట్లాడకూడదు. ఎవరినీ కలవకూడదు. ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే తిట్టేవాడు. జిమ్‌కి వెళ్తానంటే కాళ్లు విరగ్గొడతాననేవాడు. ఆమెకంటూ ప్రత్యేక ప్రపంచమనేది లేకుండా చేశాడు. నాలుగ్గోడల మధ్య బందీని చేసేశాడు. కుమిలిపోయింది లీసా. అతడి కంబంధ హస్తాల నుంచి తప్పించుకోవాలని ఆరాటపడింది. మానసిక ఒత్తిడిని తట్టుకోలేక, సైమన్కి తెలియకుండా ఓ డాక్టర్ని ఇంటికి పిలిపించుకుని రహ స్యంగా చికిత్స తీసుకునేది. జిమ్ ట్రెయినర్‌ని కూడా ఇంటికే రమ్మనేది. కానీ అది సైమన్కి తెలిసిపోవడంతో వాళ్లకు ఫోన్లు చేసి వార్నింగ్ ఇచ్చాడు. మళ్లీ వస్తే మర్యాదగా ఉండదన్నాడు. దాంతో అల్లాడిపోయింది లీసా. అతడి పైశాచిక ప్రేమను భరించడం తన వల్ల కాదనిపించింది. ఇక అతడికి దూరంగా వెళ్లిపోవాలనుకుంది. ఆమె ఆలోచనను పసిగట్టి పగబట్టాడు సైమన్. ఏం జరిగినా సరే, ఆమెను వెళ్లనివ్వకూడదనుకున్నాడు. అతడి ఆలోచనలను తెలుసుకోలేకపోయింది లీసా. తల్లికి ఫోన్ చేసి, ఎలాగైనా అతడిని వదిలించుకుని వచ్చేస్తానని చెప్పింది. ఆ రోజు రాత్రి గడవక ముందే సైమన్ చేతిలో హత్యకు గురయ్యింది. పదిహేనో అంతస్తు నుంచి క్రూరంగా లీసాని తోసి చంపేశాడు సైమన్. తెల్లవారుజామున... ఆమె కంగారుగా ఫ్లాట్‌లోంచి బయటకు పరుగెత్తడం, పారిపోవాలని ప్రయత్నించడం, అతడు ఆమె నోరు మూసి బాల్కనీలోని రెయిలింగ్ దగ్గరకు లాక్కెళ్లడం ఒక కెమెరాలో రికార్డయ్యింది. ఆమెను అక్కడ్నుంచి తోసేయడం మసకమసకగా కనిపించింది. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు తయారయ్యి, బయటకు వెళ్లిపోవడం మరో కెమెరాలో రికార్డయ్యింది. వాటిని చూసిన ఆస్ట్రేలియా అత్యున్నత న్యాయ స్థానం సైమన్కి ఇరవయ్యారేళ్ల కఠిన కారా గార శిక్ష విధించింది. పద్దెనిమిదేళ్ల వరకూ ఏ కోర్టూ అతడికి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసింది. తీర్పు వెలువడగానే లీసాకి న్యాయం జరిగిందంటూ పలువురు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అది నిజమా? లీసాకి న్యాయం జరిగిందా? అతడిని ప్రాణంగా ప్రేమించింది. జీవితమంతా అతడి ప్రేమలో మునిగి తేలాలనుకుంది. అయితే అతడి ప్రేమ పాశవికమని, అతడి కౌగిలి సర్ప పరిష్వంగమని తెలిసి తప్పుకోవాలనుకుంది. అతడికి దగ్గరవడం ఆమె తప్పు కాదు. దూరమవ్వాలనుకోవడమూ తప్పు కాదు. ప్రేమను మాత్రమే ఆశించిన ఆ అమాయకురాలిని దారుణంగా పొట్టనబెట్టుకున్నాడు సైమన్. తప్పు చేసింది అతను. మరి ఆమెకెందుకు శిక్ష పడాలి? ఆమె ఎందుకు ప్రాణం పోగొట్టుకోవాలి? నూరేళ్లు బతకాల్సిన ఆమె, ముప్ఫయ్యేళ్లకే మృత్యు ఒడికి ఎందుకు చేరాలి? చెప్పండి... లీసాకి న్యాయం జరిగిందా?!! - సమీర నేలపూడి