నటి అంజలి రూట్ మార్చారు. నటిగా కోలీవుడ్, టాలీవుడ్ అంటూ చక్కర్లు కొడుతున్న ఈ అమ్మడికి ప్రస్తుతం టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గాయి. అయితే కోలీవుడ్‌లో మాత్రం బిజీగానే ఉన్నా.. సక్సెస్‌లు మాత్రమే తగ్గాయి. తాజాగా నటించిన లిసా చిత్రంపై ఈ సంచలన నటి చాలా ఆశలు పెట్టుకున్నారు. పైగా 3డీ ఫార్మెట్‌లో తెరకెక్కడంతో హర్రర్ కథా చిత్రం లిసా అందరినీ భయపెట్టి వసూళ్లు రాబడుతుందని ఆశించారు.
అయితే ఇటీవల తెరపైకి వచ్చిన లిసా చిత్రం అంజలి ఆశలపై నీళ్లు చల్లింది. అదే విధంగా ఇటీవల తెలుగు, తమిళ భాషల్లో ఈ అమ్మడు హర్రర్ చిత్రాలనే చేస్తూ వచ్చారు. లిసా చిత్ర రిజల్ట్‌తో అంజలి రూట్ మార్చినట్లు తెలుస్తోంది. హర్రర్ కథా చిత్రాలు వర్కౌట్ కాకపోవడంతో ఈ బ్యూటీ ఇప్పుడు కామెడీకి మారిపోయారు. దర్శకుడు కృష్ణన్ జయరాజ్ తాజాగా ఒక వినోదభరిత కథా చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ఈయన ఇంతకు ముందు మిర్చి శివ, వసుంధర జంటగా సొన్నా పురియాదు అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. తన తాజా చిత్రంలో హీరోయిన్‌గా నటి అంజలిని ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం అంజలి విజయ్‌సేతుపతికి జంటగా నటించిన సింధుబాధ్, శశికుమార్ సరసన నటించిన నాడోడిగళ్–2 చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి.
ఈ చిత్రాలు సాధించే విజయాల కోసం అంజలి ఆశగా ఎదురుచూస్తోందట. నటుడు జైతో ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టడంతో కొంతకాలం ఒంటరిగానే ఉన్న అంజలి తాజాగా మరో నటుడితో లవ్‌లో పడ్డట్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందులో నిజం ఎంత అన్నది అంజలి స్పందిస్తేగానీ తెలియదు. అన్నట్లు ఇటీవల ఈ బ్యూటీ కాస్త బరువు తగ్గి మరింత అందంగా తయారయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment