
Vijay Deverakonda and Ananya Panday shoot for Liger in Los Angeles: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా 'లైగర్'. అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతుంది. ఇటీవలె లాస్ వెగాస్‌లో షెడ్యూల్ పూర్తి చేసిన చిత్ర బృందం ప్రస్తుతం లాస్ ఏంజెల్స్‌లో షెడ్యూల్‌ని ప్రారంభించింది.
దీనికి సంబంధించిన ఫోటోలను చార్మీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. లైగర్ టీం..లాస్ ఏంజెల్స్ నుంచి హాయ్ చెబుతుంది అంటూ ఫోటోను పంచుకుంది. ఇందులో విజయ్ దేవరకొండ, అనన్య పాండే, చార్మీ, పూరి జగన్నాథ్ ఉన్నారు. ఈ చిత్రంలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. సీనియర్ నటి రమ్యకృష్ణ ముఖ్య పాత్ర పోషిస్తుంది. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడెక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment