
లాస్ ఏంజిల్స్: ద బెట్ అవార్డుల ఫంక్షన్ అట్టహాసంగా జరిగింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో ర్యాపర్, సింగర్ లిల్ నాస్ ఎక్స్ తన పర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు. 'కాల్ మీ బై యువర్ నేమ్' ఆల్బమ్ నుంచి 'మాంటెరో' పాటకు తోటి డ్యాన్సర్లతో కలిసి స్టెప్పులేశాడు. పాట పూర్తయ్యే చివరలో మాత్రం తోటి మేల్ డ్యాన్సర్‌కు గాఢంగా ముద్దు పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే ఇది కూడా పర్ఫామెన్స్‌లో భాగమేనని కొందరు ప్రేక్షకులు చప్పట్లు కొట్టి అభినందించారు.
కానీ సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లు అతడి తీరును దుమ్మెత్తిపోస్తున్నారు. ఆఫ్రికన్ సంస్కృతిని అవమానించాడంటూ సదరు ర్యాపర్‌ను ట్రోల్ చేస్తున్నారు. తాజాగా తనపై వస్తున్న విమర్శలకు ధీటుగా బదులిచ్చాడు లిల్ నాస్ ఎక్స్. "ఆఫ్రికన్ కల్చర్‌లో స్వలింగ సంపర్కం ఉనికిలో లేదని చాటిచెప్పాలని ఎందుకంత కష్టపడుతున్నారో.." అని వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. కాగా లిల్ నాస్ ఎక్స్ 2019లో తాను గే అని వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment