కొత్త ఏడాదికి వెల్‌కమ్ చెప్పాల్సింది పోయి జీవితానికే ముగింపు పలికాడో సింగర్. ఆవేశంలో తన ప్రియురాలిని గన్‌తో కాల్చడమే కాక తను సైతం ఆత్మహత్య చేసుకుని పిల్లలను ఎవరూ లేని అనాథలను చేశాడు. వివరాల్లోకి వెళితే.. అమెరికన్ ర్యాపర్ జె స్టాష్(అసలు పేరు జస్టిన్ జోసెఫ్), జెనటీ గాలెగోస్ గత కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్నారు. జనవరి ఒకటవ తేదీ ఉదయాన వీరిద్దరూ గొడవ పడినట్లు తెలుస్తోంది. దీంతో స్టాష్ ప్రేయసిని మాస్టర్ బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లి గన్‌తో కాల్చి చంపాడు.
తర్వాత తనూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాల్పుల శబ్ధం విన్న గాలెగోస్ తనయులు వారి నాయనమ్మతో పాటు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్టాష్, గాలెగోస్ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పిల్లల శరీరంపై ఎటువంటి గాయాలు లేకపోవడంతో వారిపై దాడి జరగలేదని నిర్ధారించారు.
Comments
Please login to add a commentAdd a comment