లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో టాప్‌–10పైనే దృష్టి | India will be in top-10 at 2028 Los Angeles Olympics | Sakshi
Sakshi News home page

లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో టాప్‌–10పైనే దృష్టి

Published Sun, Jul 26 2020 6:38 AM | Last Updated on Sun, Jul 26 2020 6:38 AM

India will be in top-10 at 2028 Los Angeles Olympics - Sakshi

న్యూఢిల్లీ: లాస్‌ ఏంజెలిస్‌ –2028 ఒలింపిక్స్‌ నాటికి పతకాల జాబితాలో తొలి 10 స్థానాల్లో నిలిచేలా భారత్‌ గట్టి పోటీనిస్తుందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు అన్నారు. ఈ లక్ష్యాన్ని నెరవేర్చేందుకే ‘టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం జూనియర్‌ స్కీమ్‌’ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 10–13 వయస్సున్న చురుకైన క్రీడాకారులను ఎంపిక చేసి 2028నాటికి ఒలింపియన్లుగా తయారుచేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోచ్‌లతో వారికి శిక్షణ అందిస్తామని చెప్పారు. ఈ మేరకు సుశిక్షితులైన స్వదేశీ కోచ్‌ల పదవీకాలాన్ని పొడిగించామని పేర్కొన్నారు. భారత్‌ను క్రీడాశక్తిగా చూడాలనుకున్న ప్రతీ ఒక్కరి ఆకాంక్షను నెరవేర్చేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement