
'దేవర' కోసం ఎన్టీఆర్ అమెరికా వెళ్లిపోయాడు. లెక్క ప్రకారం హైదరాబాద్‌లో ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాలి. కానీ ఊహించిన దానికంటే అభిమానులు ఎక్కువగా వచ్చారు. 5 వేల మందికి పట్టే చోటుకి ఏకంగా 25 వేల మందికి పైగా వచ్చారు. తోపులాటని కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. అలానే ఇంతమందిని తట్టుకోవడం కష్టమని చెప్పి కార్యక్రమాన్ని రద్దు చేశారు. దీంతో తారక్‌ని కళ్లారా చూడాలనుకున్న వాళ్లకు నిరాశ తప్పలేదు.
(ఇదీ చదవండి: వాళ్లకు ఇచ్చారు.. మాకు పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు: ఎన్టీఆర్ ఫ్యాన్స్)
'దేవర' ప్రీ రిలీజ్ రద్దవడంతో అభిమానుల్ని ఉద్దేశిస్తూ ఎన‍్టీఆర్ నుంచి వీడియో వచ్చింది. 'భద్రతాపరమైన కారణాల వల్ల ఈవెంట్ క్యాన్సిల్ చేశాం. మళ్లీ చెబుతున్నాను. మీతో పాటు నేనూ బాధపడుతున్నాను. మీ కంటే నా బాధ చాలా పెద్దది, ఎక్కువ కూడా' అని తారక్ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు.
ముందు నుంచి ఉన్న ప్లాన్ ప్రకారం సోమవారం వేకువజామున అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌కి ఎన్టీఆర్ బయలుదేరాడు. అక్కడ సెప్టెంబరు 26న ప్రీమియర్స్ పడతాయి. దీంతో అక్కడే జరగబోయే బియాండ్ ఫెస్ట్ కార్యక్రమంలో పాల్గొంటాడు. అలానే కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇస్తాడు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ వస్తాడు. దీనిబట్టి చూస్తే 'దేవర' ప్రీ రిలీజ్ ఇక లేనట్లే. అభిమాన హీరోని చూడాలనుకునే ఫ్యాన్స్‌కి ఇది ఓ రకంగా బ్యాడ్ న్యూసే.
(ఇదీ చదవండి: 'దేవర' కోసం జాన్వీ.. తెలుగులో ఎంత చక్కగా మాట్లాడిందో)
We regret being in this situation but are forever grateful to our beloved Man of Masses NTR’s fans. 🙏🏻🙏🏻
The biggest celebration awaits. See you in theatres on Sept 27th.#Devara #DevaraOnSep27th pic.twitter.com/oSXa2ga6Za— Devara (@DevaraMovie) September 22, 2024