'దేవర' కోసం జాన్వీ.. తెలుగులో ఎంత చక్కగా మాట్లాడిందో | Janhvi Kapoor Video After Devara Movie Pre Release Event Cancelled, Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: 'దేవర' కోసం రెడీ అయిన జాన్వీ.. కానీ ప్రోగ్రాం రద్దయ్యేసరికి

Published Mon, Sep 23 2024 7:52 AM | Last Updated on Mon, Sep 23 2024 10:23 AM

Janhvi Kapoor Video After Devara Pre Release Event Cancelled

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. 'దేవర' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే పాటల్లో ఈమె గ్రేస్ చూసి చాలామంది ఫిదా అయిపోతున్నారు. మూవీలో ఎలా కనిపించబోతుందా అని ఫ్యాన్స్ వెయిటింగ్. ఇక 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఈమె కూడా సిద్ధమైంది. నీలం రంగు చీరలో అందాలన్నీ కనిపించేలా ముస్తాబైంది. కానీ ఈవెంట్ కాస్త రద్దవడంతో అభిమానుల గురించి ఓ వీడియో పోస్ట్ చేసింది. స్టేజీపై మాట్లాడటం కోసం ప్రిపేర్ అయింది కాస్త ఇప్పుడు వీడియోలో చెప్పేసింది.

(ఇదీ చదవండి: వాళ్లకు ఇచ్చారు.. మాకు పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు: ఎన్టీఆర్ ఫ్యాన్స్)

జాన్వీ ఏం చెప్పిందంటే?
'అందరికీ నమస్కారం. ముందుగా నన్ను ఇంతగా స్వాగతించి నా మీద ఇంత ప్రేమని చూపించిన తెలుగు ఆడియెన్స్ అలానే నన్ను జాను పాప అని పిలుస్తున్నందుకు ఎన్టీఆర్ సర్ ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు. మీరు అలా నన్ను సొంత మనిషిలా ఫీలవడం నాకెంతో ఆనందంగా ఉంది. మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో తెలుసు. అమ్మకు కూడా మీరందరూ అంతే ముఖ్యం. అలానే నాకు కూడా'

'నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీరందరూ గర్వపడేలా ప్రతిరోజు కష్టపడతాను. శివ సర్, ఎన్టీఆర్ సర్ ఈ సినిమా కోసం నన్ను ఎంపిక చేసుకోవడం నా అదృష్టం. మా ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను. నాకు చాలా సహాయపడిన చిత్రబృందానికి థ్యాంక్స్' అని వీడియోలో జాన్వీ కపూర్ తెలుగులో మాట్లాడింది.

(ఇదీ చదవండి: మీకంటే నేనెక్కువగా బాధపడుతున్నాను: ఎన్టీఆర్‌)

ఇక ఈ వీడియోకి 'నేను ఈ మాటలు స్వయంగా మీతో చెబుదామనుకున్నాను. కానీ ఈ సారికి అలా కుదరలేదు. మిమ్మల్నందరినీ త్వరలోనే కలుస్తాననుకుంటున్నా. ప్రస్తుతానికి ఇది నా నుంచి మీకు ఈ చిన్న మెసేజ్' అని జాన్వీ రాసుకొచ్చింది.

సెప్టెంబరు 27న 'దేవర' మూవీ థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే రెండు ట్రైలర్స్ రిలీజ్ కాగా.. మిశ్రమ స్పందన వచ్చింది. అయితేనేం సోషల్ మీడియాలో మాత్రం 'దేవర'పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. 'ఆచార్య'తో దెబ్బ తిన్న కొరటాల.. 'దేవర'తో కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. అలానే అనిరుధ్ మ్యూజిక్‌పైనా అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు.

(ఇదీ చదవండి: 'దేవర' రెండో ట్రైలర్‌ విడుదల)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement