
కొండలు విరిగిపడి మనల్ని బెదిరించడానికి చూడవచ్చు. సముద్రాలు ఉప్పొంగి వచ్చి జడుపు జ్వరం తెప్పిద్దామని ప్రయత్నించవచ్చు. భూతలం తన వీపు విదుల్చుకుని బెంబేలెత్తించేద్దామని పగుళ్లివ్వవచ్చు. కాని మనిషి కొనసాగుతూ వచ్చాడు. కొనసాగుతూనే ఉన్నాడు. కరోనాతో ఇప్పుడు మానవజాతి చేస్తున్నది సుదీర్ఘపోరాటం అని గ్రహించే సమయం వచ్చేసింది. ఇందులో ఆగడానికి లేదు.అలిసిపోవడానికి లేదు. గెలవడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. గెలవాలంటే తోడు కావాలి.
పరస్పర ధైర్యవచనం కావాలి. ఇది రెండు రోజుల క్రితం అమెరికాలోని లాస్ ఏంజలస్‌లో తీసిన ఫొటో. కరోనా లక్షణాల వల్ల నర్సింగ్‌హోమ్‌లో క్వారంటైన్‌లో ఉన్న భర్తను భార్య బయట నుంచి పలకరిస్తున్న దృశ్యం ఇది. భౌతిక దూరం పాటించాలి కనుక అద్దాల గదిలో అతడు ఉంటే బయట ఆమె ఉంది. ఇద్దరూ ఫోన్ ద్వారా మాట్లాడుకుంటూ ఉన్నారు. ‘తొందరగా నయమయ్యి వచ్చేస్తావులే’ అని ఆమె బహుశా అంటుండవచ్చు. మనం కూడా అదే అనుకోవాలి. తొందరగా ఈ కరోనా నుంచి బయటపడిపోతాములే అని. అంతే కదూ.
Comments
Please login to add a commentAdd a comment