Oscars Nominations 2021: Check Here Full List Of Oscar Nominees And Movies - Sakshi
Sakshi News home page

ఆస్కార్‌ ఫైనల్‌ బరిలో నిలిచిన చిత్రాలు ఇవే..

Published Tue, Mar 16 2021 12:52 PM | Last Updated on Tue, Mar 16 2021 7:20 PM

Oscars Nominations Final List For 2021 - Sakshi

లండన్‌: ప్రతియేటా ప్రపంచవ్యాప్తంగా చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దర్శకులకు, నటీనటులకు, రచయితలకు, ఇతర సాంకేతిక నిపుణులకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక అవార్డు ఆస్కార్‌. 2020 ఏడాదికి గాను 93వ ఆస్కార్‌ అవార్డుల వేడుక వచ్చే నెల ఏప్రిల్‌ 25న అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో నిర్వహించనున్నారు. ఆస్కార్‌ అవార్డుల ఎంపిక ప్రక్రియ తుది ఘట్టానికి చేరింది. ఈ నేపథ్యంలో ఆస్కార్‌ అవార్డుకు పోటీపడే  చిత్రాల నామినేషన్‌ను లండన్‌లో ప్రియాంక- నిక్‌ జోనాస్‌ దంపతులు 2021 ఆస్కార్‌  నామినేషన్‌ చిత్రాల జాబితాను సోమవారం ప్రకటించారు.

2018లో వచ్చిన  బ్లాక్‌ ఫాంథర్‌  సినిమాతో చాడ్విక్ బోస్మాన్ గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. అతను నటించిన ‘మా రైనీస్ బ్లాక్ బాటమ్’ చిత్రం ప్రస్తుతం ఉత్తమ నటుడు కేటగిరీలో ఆస్కార్‌ రేసులో ఉంది. కాగా, బోస్మాన్ గతేడాది క్యాన్సర్‌తో మరణించడం విషాదకరం. క్రిస్టొఫర్ నొలన్ దర్శకత్వం వహించిన టెనెట్‌ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో ఉంది. ఇదిలా ఉండగా భారత్‌ నుంచి ఆస్కార్‌కు పోటీప​​డ్డ సూరారై పొట్రు (ఆకాశమే నీ హద్దురా..!) ఆస్కార్‌ బరిలో నుంచి వైదొలిగింది. మరోవైపు 2021 ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ వేడుకలు కోవిడ్‌-19 కారణంగా రెండు నెలల పాటు వాయిదా పడ్డాయి.

2021 ఆస్కార్ నామినేషన్లు - పూర్తి జాబితా

ఉత్తమ చిత్రం కేటగిరీ

ది ఫాదర్‌
జుడాస్ అండ్‌ బ్లాక్ మెసయ్య
మాంక్
మినారి
నోమాడ్ ల్యాండ్‌
ప్రామిసింగ్‌ యంగ్‌ వుమన్‌
సౌండ్ ఆఫ్ మెటల్
ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7

ఉత్తమ దర్శకుడు కేటగిరీ

థామస్ వింటర్‌బర్గ్, (అనదర్‌ రౌండ్)
డేవిడ్ ఫించర్, (మాంక్)
లీ ఐజాక్ చుంగ్, (మినారి)
క్లోస్ జావో, (నోమాడ్లాండ్)
ఎమరాల్డ్ ఫెన్నెల్, (ప్రామిసింగ్ యంగ్ ఉమెన్)

ఉత్తమ నటుడు కేటగిరీ

రిజ్ అహ్మద్, (సౌండ్ ఆఫ్ మెటల్)
చాడ్విక్ బోస్మాన్, (మా రైనీస్ బ్లాక్ బాటమ్)
ఆంథోనీ హాప్కిన్స్, (ది ఫాదర్)
గ్యారీ ఓల్డ్మన్, (మాంక్)
స్టీవెన్ యూన్, (మినారి)

ఉత్తమ నటి కేటగిరీ

వియోలా డేవిస్, (మా రైనీస్ బ్లాక్ బాటమ్)
ఆండ్రా డే, (ది యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ బిల్లీ హాలిడే)
వెనెస్సా కిర్బీ, (పీసెస్ ఆఫ్ ఎ ఉమెన్)
ఫ్రాన్సిస్ మెక్‌డోర్మాండ్, (నోమాడ్‌ల్యాండ్)
కారీ ముల్లిగాన్, (ప్రామిసింగ్ యంగ్ ఉమెన్)

ఉత్తమ సహాయ నటుడు కేటగిరీ

సాచా బారన్ కోహెన్, (ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7)
డేనియల్ కలుయా, (జుడాస్ అండ్‌ బ్లాక్ మెసయ్య)
లెస్లీ ఓడోమ్ జూనియర్, (వన్ నైట్ ఇన్‌ మయామి)
పాల్ రాసి, (సౌండ్ ఆఫ్ మెటల్)
లాకీత్ స్టాన్ఫీల్డ్, (జుడాస్ అండ్‌ బ్లాక్ మెసయ్య)

ఉత్తమ సహాయ నటి కేటగిరీ

మరియా బకలోవా, (బోరాట్ సబ్‌సీక్వెంట్‌ మూవీఫిల్మ్)
గ్లెన్ క్లోజ్, (హిల్‌బిల్లీ ఎలిజీ)
ఒలివియా కోల్మన్, (ది ఫాదర్)
అమండా సెయ్ ఫ్రిడ్, (మాంక్)
యుహ్-జంగ్ యూన్, (మినారి)

ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే కేటగిరీ

విల్ బెర్సన్ & షాకా కింగ్, (జుడాస్ అండ్‌ బ్లాక్ మెసయ్య)
లీ ఐజాక్ చుంగ్, (మినారి)
ఎమరాల్డ్ ఫెన్నెల్, (ప్రామిసింగ్ యంగ్ ఉమెన్)
డారియస్ మార్డర్ & అబ్రహం మార్డర్, (సౌండ్ ఆఫ్ మెటల్)
ఆరోన్ సోర్కిన్, (ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7)

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీ

లవ్ అండ్ మాన్స్టర్స్
మిడ్నైట్ స్కై
ములన్
ది వన్ అండ్ ఓన్లీ ఇవాన్
టెనెట్

ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ

ఆన్‌వర్డ్‌
ఓవర్‌ ద మూన్‌
ఎ షాన్ ది షీప్ మూవీ: ఫార్మగెడాన్
సౌల్‌
వోల్ఫ్‌ వాకర్స్‌

(చదవండి: ఆస్కార్‌ నుంచి సూర్య సినిమా అవుట్‌.. నిరాశలో ఫ్యాన్స్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement