మళ్లీ ఫ్యాన్స్‌ మీట్‌.. ఆగస్ట్‌లో అనౌన్స్‌మెంట్‌? | RajinikanthPolitical Party Announces in August | Sakshi
Sakshi News home page

మళ్లీ ఫ్యాన్స్‌ మీట్‌.. ఆగస్ట్‌లో అనౌన్స్‌మెంట్‌?

Published Thu, Jun 8 2017 12:02 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM

మళ్లీ ఫ్యాన్స్‌ మీట్‌.. ఆగస్ట్‌లో అనౌన్స్‌మెంట్‌? - Sakshi

మళ్లీ ఫ్యాన్స్‌ మీట్‌.. ఆగస్ట్‌లో అనౌన్స్‌మెంట్‌?

‘‘ఆ దేవుడు ఆదేశిస్తాడు.. ఈ అరుణాచలం పాటిస్తాడు’... రజనీకాంత్‌ నటించిన ‘అరుణాచలం’లోని డైలాగ్‌ ఇది. ఇటీవల అభిమానులను కలిసినప్పుడు ఈ డైలాగ్‌ని మార్చి, వేరే రకంగా మాట్లాడారాయన. ‘మీరు రాజకీయాల్లోకి వస్తారా?’ అని అభిమానులు అడిగితే.. ‘ఒకవేళ అది దేవుడి నిర్ణయమైతే అదే జరుగుతుంది’ అన్నారు.

ఉన్నట్టుండి అభిమానులను రజనీకాంత్‌ కలవడం, అది కూడా వరుసగా నాలుగు రోజులు వాళ్లని కలిసి, ఫొటోలు దిగడం చర్చనీయాంశమైన విషయం విదితమే. రజనీ సొంతంగా రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్నారని, అందుకే ఇలా ఫ్యాన్స్‌ని కలిశారని పలువురి నమ్మకం. ఆ నమ్మకం నిజమయ్యే అవకాశాలెక్కువగా కనిపిస్తున్నాయని చెన్నై వర్గాలు అంటున్నాయి. మరోసారి రజనీ తన అభిమానులను కలవనున్నారట.

 ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘కాలా’ చిత్రం షూటింగ్‌ ఇటీవల ముంబైలో మొదలైంది. ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయిన నేపథ్యంలో రజనీ చెన్నై రిటర్న్‌ అయ్యారట. కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొనాలనుకుంటున్నారట. ఈ గ్యాప్‌లో మళ్లీ ‘ఫ్యాన్స్‌ మీట్‌’ ఏర్పాటు చేయాలనుకుంటున్నారని భోగట్టా. ఈ ఏడాది ఆగస్ట్‌లో రజనీ పొలిటికల్‌ పార్టీ అనౌన్స్‌ చేస్తారని కోడంబాక్కమ్‌ వర్గాలు అంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement