ఇయర్ ఎండింగ్‌లో రజనీకాంత్ అభిమానుల మనసు ‘రొంబ సంతోషం’తో నిండిపోనుంది. అంతేకదా.. అభిమాన కథానాయకుణ్ణి కలిసే అవకాశం వస్తే... రొంబ సంతోషమే కదా. ఇంతకీ రొంబ అంటే ఏంటి? అంటే.. ‘చాలా’ అని అర్థం. ఈ ఏడాది మేలో రజనీ తన అభిమానులను కలసిన విషయం తెలిసిందే. మళ్లీ ‘ఫ్యాన్స్ మీట్’ ఏర్పాటుకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 26 నుంచి 31 వరకు ఫ్యాన్స్ మీట్‌ను కోడంబాక్కంలోని తన రాఘవేంద్ర మ్యారేజ్ హాల్‌లో అభిమానులను కలవనున్నారు. ప్రతి రోజు సుమారు వెయ్యి మంది అభిమానులను మీట్ అవుతారట.
26న కాంచీపురం, తిరువళ్లూర్, కృష్ణగిరి, ధర్మపురి, నీలగిరి ఫ్యాన్స్‌ని, 27న తిరువారూర్, నాగపట్టణం, పుదుకోటై్ట, రామనాథపురం అభిమానులను, 28న మధురై, నామక్కల్, సేలమ్ ఫ్యాన్స్‌ను, 29న కోయంబత్తూర్, ఈరోడ్, వెల్లూర్ ఫ్యాన్స్‌ను, నార్త్ మరియు సెంట్రల్ చెన్నై ఫ్యాన్స్‌ను 30న, సౌత్ చెన్నై ఫ్యాన్స్‌ను 31న కలవనున్నారు. అయితే కొన్ని కండీషన్స్ పెట్టారు.
ఫ్యాన్స్ క్లబ్ నుంచి ముందుగానే ప్రతి అభిమాని తమ ఐడీ కార్డ్‌ను తీసుకోవాలి. కార్డ్ లేని వారిని లోపలకి అనుమతించరట. అలాగే, మద్యం సేవించిన వారికి ప్రవేశం లేదట. రజనీ దగ్గరగా వచ్చి కౌగిలించుకోవటం, కాళ్ల మీద పడటంలాంటివి చేయకూడదనే కొన్ని సూచనలూ అభిమానులకు జారీ చేశారని చెన్నై టాక్. ఈ మీట్‌లో అయినా రజనీకాంత్ తన పొలిటికల్ ఎంట్రీ గురించి ఏదైనా ప్రకటిస్తారేమోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment