ఫ్యాన్స్ మీట్‌లో మాట్లాడుతున్న సూపర్‌స్టార్ రజనీకాంత్
సాక్షి, చెన్నై : తాను రాజకీయాల్లోకి రాబోతున్నానంటూ వచ్చిన వార్తలపై సూపర్ స్టార్ రజనీకాంత్ మంగళవారం స్పందించారు. చెన్నైలో ఫ్యాన్స్ మీట్‌కు వచ్చిన ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించే విషయంపై ఈ నెల 31న ప్రకటన చేస్తానని పేర్కొన్నారు. ఆరు రోజుల పాటు జరగనున్న ఫ్యాన్స్ మీట్‌ను చెన్నైలోని శ్రీ రాఘవేంద్ర కళ్యాణ మండపంలో రజనీ ప్రారంభించారు. ‘మీట్ అండ్ గ్రీట్’ పేరిట లాంచ్ అయిన ఈవెంట్ ఈ నెల 31 వరకూ కొనసాగనుంది.
ఫ్యాన్స్ మీట్‌లో మాట్లాడిన రజనీ.. తనకు రాజకీయాలు కొత్త కాదని పేర్కొన్నారు. యుద్ధంలోకి దిగితే గెలిచి తీరాలని అన్నారు. తన పొలిటికల్ ఎంట్రీపై మీడియాకే ఎక్కువ ఆసక్తి ఉన్నట్లు కనిపిస్తోందని అన్నారు. హీరో అయ్యానంటే తనకే ఆశ్చర్యం వేస్తుందని చెప్పారు. కెరీర్ తొలినాళ్లలో హీరోగా చేయాలంటే భయపడ్డానని వెల్లడించారు. తొలి సినిమా హిట్ తర్వాత హేళన చేసిన వారే తనను అభినందిచారని చెప్పారు. నటనలో తనను మరోస్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి మహేంద్రన్ అని వివరించారు.
మరోవైపు రజనీ కచ్చితంగా రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని రిపోర్టులు వస్తున్నాయి. ఆయన సొంత పార్టీని స్థాపన చేస్తారని వాటి సారాంశం. కాగా, ఆరు రోజుల ఫ్యాన్స్ మీట్‌లో రోజుకు వెయ్యి మందిని రజనీకాంత్ కలుస్తారు. వారితో ఫొటో దిగనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment