khaidi no.150
-
పిల్ల కాదు..మూడున్నర అడుగుల బుల్లెట్
-
ఖైదీ నెం.150 సక్సెస్ ట్రీట్ ఇచ్చిన సుబ్బరామిరెడ్డి
-
చిరు అభిమానులకు శుభవార్త
హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత మెగాస్టార్ హీరోగా తెరకెక్కిన మూవీ 'ఖైదీ నెంబర్.150' అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ నెల 11న విడుదలైన ఖైదీ మూవీ వారం రోజుల్లో వంద కోట్ల క్లబ్లో చేరింది. ఈ విషయాన్ని సినీ నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. ఫస్ట్ వీక్ టోటల్ గ్రాస్ కలెక్షన్లు 108.48 కోట్లు సాధించిన చిరు లేటెస్ట్ మూవీ బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను సాధించడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. ఏడు రోజులకుగానూ రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.76.15 కోట్లు రాబట్టిందని అల్లు అరవింద్ చెప్పారు. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ మూవీని చిరు తనయుడు రాంచరణ్ నిర్మించిన విషయం తెలిసిందే. అయితే చిరు 150వ మూవీకి దర్శకుడి కోసం ఏమంత పెద్దగా చర్చలు జరపలేదని, వీవీ వినాయక్ అయితేనే న్యాయం చేయగలడని మేం భావించామన్నారు. 'ఈ మెగా మూవీలో భాగస్వాములు అయిన అందరికీ అభినందనలు. ఫాస్టెస్ట్ 100 కోట్లు సాధించిన టాలీవుడ్ మూవీ ఖైదీ. తెలుగు రాష్ట్రాల్లో రూ.76.15 కోట్లు సాధించిన ఖైదీ వసూళ్లు కర్ణాటకలో రూ.9కోట్లు, తమిళనాడులో రూ.60లక్షలు నార్త్ అమెరికాలో రూ.17 కోట్లు రాబట్టింది. రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో రూ.3.90కోట్లు కలెక్ట్ చేసింది. దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత చిరంజీవి రీఎంట్రీని ప్రజలు, అభిమానులు ఆదరించినందుకు ప్రొడక్షన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. త్వరలో కృతజ్ఞాభినందనలకు ఆ మూవీ యూనిట్ త్వరలో ఓ సభను నిర్వహించనుంది' అని అల్లు అరవింద్ తెలిపారు. ఆ సభను ఎక్కడ, ఎప్పుడు జరుపుతామన్నది మూవీ యూనిట్ ముందుగానే వెల్లడిస్తుందన్నారు. (చదవండి: ఖైదీ మూవీపై వర్మ యూటర్న్!) -
చిరు అభిమానులకు శుభవార్త
-
మెగాస్టార్ మూవీపై వర్మ యూటర్న్!
సోషల్ మీడియాలో కామెంట్లతో వివాదాలకు కేంద్రబిందువుగా ఉండే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ రొటీన్ కు భిన్నంగా స్పందించాడు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఖైదీ నెంబర్.150ని చూసిన వర్మ ఆ మూవీపై సంచలన కామెంట్లు చేశాడు. చిరంజీవి మూవీ ఖైదీ మెగా మెగా మెగా ఫంటాస్టిక్ అని ట్వీట్ చేశాడు. మెగాస్టార్ ఎనర్జీ లెవల్స్ ఇప్పటికీ ఓ రేంజ్ లో ఉన్నాయని వర్మ కితాబిచ్చాడు. తొమ్మిదేళ్ల కిందట సినిమాలకు దూరంగా వెళ్లినప్పుడు చిరు ఎలా ఉన్నారో.. ఇప్పుడు ఖైదీ మూవీలో అంతకంటే చాలా యంగ్ గా కనిపిస్తున్నారని ట్వీట్ లో రాసుకొచ్చాడు వర్మ. వీవీ వినాయక్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మించిన చిరంజీవి 150 చిత్రం ఖైదీ నెంబర్.150ని ఇప్పుడే చూశానని.. చిరుకు 150 మిలియన్ చీర్స్ అని పేర్కొన్నాడు. వర్మ ఏం చేసినా తన మార్క్ ఉంటుందనడంలో సందేహం అక్కర్లేదు. బాలకృష్ణ నటించిన వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి తెలుగోడి చరిత్రను తెలిపే గొప్ప మూవీ అని ప్రశంసించిన రాంగోపాల్ వర్మ.. చిరు మాత్రం తమిళ మూవీ 'కత్తి'ని రీమేక్ చేశారని తీవ్రంగా విమర్శించాడు. (చదవండి: చిరు అభిమానులకు శుభవార్త) ఇటీవల ఖైదీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ.. వర్మ, యండయూరి వీరేంద్రనాథ్ లను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేయగా.. కొన్నిరోజులపాటు నాగబాబును విమర్శిస్తూ వర్మ వరుస ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇటీవల చిరంజీవి మాట్లాడుతూ.. తనతో పాటు పవన్ కల్యాణ్ గురించి కూడా వర్మ పలు విమర్శలు చేశాడని, ఆయన ఎవరినీ వదలట్లేదని అన్నారు. మరోవైపు భారీ కలెక్షన్లతో ఖైదీ మూవీ దూసుకుపోతుండటంతో మెగా ఫ్యామిలీతో పాటు మూవీ యూనిట్ చాలా హ్యాపీగా ఉన్నారు. Mega Star's Energy levels are SUPREME and he's looking younger than when he left films some 9 years back ..He's looking MEGA HANDSOME👍👍👍 — Ram Gopal Varma (@RGVzoomin) 18 January 2017 Just saw 150 ..Mega Star is beyond Mega Mega Mega Fantastic ..150 million Cheers to him ..👍😘🙏👌😍 — Ram Gopal Varma (@RGVzoomin) 18 January 2017 -
చిరు, బాలకృష్ణ మూవీలపై ప్రిన్స్ ఏమన్నారంటే...
హైదరాబాద్: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సంక్రాంతి బిగ్ సినిమా సంబరాలపై స్పందించారు. ట్విట్టర్ ద్వారా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మహేష్ ' ఖైదీ నెం.150, 'గౌతమి పుత్రి శాతకర్ణి' సినిమాలపై వరస ట్వీట్లలో ప్రశంసల జల్లు కురిపించారు. సాధారణంగా సినిమాలపై చాలా తక్కువగా స్పందించే ఈ టాలీవుడ్ సూపర్ స్టార్ , మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ సెన్సేషనల్ మూవీలపై ట్విట్టర్ ద్వారా స్పందిండం విశేషం. తన బీజీ షెడ్యూల్ లో ఈ రెండు సినిమాలను చూడటానికి సమయం కుదుర్చుకున్న మహేష్ .. ఖైదీ150,గౌతమి పుత్రి శాతకర్ణి విజయాలపై హర్షం వ్యక్తం చేశారు. రెండు సినిమాల టీములకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ముఖ్యంగా టాలీవుడ్ లో ఈ బిగ్ మూవీలతో సంక్రాంతి సంబరాల వర్షం కురుస్తోందంటూ అభినందనలు తెలిపారు. అలాగే 150 వ సినిమాతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవిపై ప్రశంసలు కురిపించారు. ఇన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని మిస్.. అయ్యాం..వెల్ కం బ్యాక్ అన్నారు. ఆయన లుక్స్ అద్భుతమనీ, తన మ్యాజిక్ తో అత్యంత ఉన్నతంగా నిలిచారని మహేష్ ట్వీట్ చేశారు. మరోవైపు మీ విజన్ కు, కన్విక్షన్ కు హ్యట్స్ ఆఫ్ అంటూ నందమూరి బాలకృష్ణ ను ఉద్దేశించి కమెంట్ చేశారు. గౌతమి పుత్ర శాతకర్ణిలో ఆయన నటన టాలీవుడ్ లో ఉత్తమమైన ప్రదర్శనగా నిలుస్తుందని కొనియాడారు. It's raining hits in TFI !! Got some time off to watch both the Sankranthi biggies .. — Mahesh Babu (@urstrulyMahesh) January 14, 2017 Hats off to #NBK for the portrayal of #GPSK! It will remain as one of the finest performances of TFI. — Mahesh Babu (@urstrulyMahesh) January 14, 2017 Missed u all these years sir..welcome back .. Congrats to the entire team of #KhaidiNo150. — Mahesh Babu (@urstrulyMahesh) January 14, 2017 -
చిరంజీవితో సినిమా అంటే భయమేస్తోంది: అరవింద్
సుదీర్ఘ కాలం తర్వాత చిరంజీవి హీరోగా వచ్చిన ఖైదీ నెం.150 తొలిరోజు కలెక్షన్లు చూశాక.. ఇంత పెద్ద హిట్ సినిమా తర్వాత 151వ సినిమా చేయాలంటే తనకు భయమేస్తోందని గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ చెప్పారు. తొలిరోజు ఖైదీ నెం. 150 సినిమాకు 47 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చిందని ఆయన తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో 30 కోట్లు వచ్చిందని, ఓవర్సీస్ కలెక్షన్లు కూడా బాగున్నాయని అన్నారు. రెండో రోజు కూడా కలెక్షన్లు ఏమాత్రం తగ్గలేదని, అయితే ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. సాధారణంగా వారాంతంలో అయితే సినిమాలు బాగా ఆడతాయని, కానీ వారం మధ్యలో వచ్చినా సినిమాకు ఇంత బంపర్ కలెక్షన్లు రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వచ్చిన స్పందనను బట్టి వారం మధ్యలో అయినా రిలీజ్ చేయొచ్చన్న నమ్మకం తమకు కుదిరిందన్నారు. ఇక్కడ బుకింగ్స్ ప్రారంభం కాకముందే ఓవర్సీస్ కలెక్షన్ల వివరాలు తెలుస్తాయి కాబట్టి.. అవి చూస్తుంటే ఆశ్చర్యం వేసిందన్నారు. అసలు ఎందుకంత ఆదరణ వచ్చిందో అర్థం కాలేదన్నారు. దర్శకుడు వినాయక్ తనను క్షమించాలంటూ.. ఇందులో కథ, ఇతర విషయాల కంటే చిరంజీవిని చూడటానికే అంతమంది జనం వచ్చారని ఆయన అన్నారు. మస్కట్ లాంటి దేశాల్లో తెలుగువాళ్లు ఎక్కువగా పనిచేసే ఫ్యాక్టరీలకు సినిమా కోసం సెలవు కూడా ఇచ్చేశారని ఆనందం వ్యక్తం చేశారు. చిరంజీవితో తదుపరి సినిమా చేసే అవకాశం తమకే ఉందని, దానికి బోయపాటి శ్రీనివాస్‌ను దర్శకుడిగా ఇప్పటికే అనుకున్నామని ఆయన వివరించారు. చిరంజీవి స్టామినా ఎంత ఉంటే అన్నాళ్ల పాటు సినిమా నడుస్తుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
చిరంజీవితో సినిమా అంటే భయమేస్తోంది
-
ఖైదీ నెం.150 పాట ఆన్లైన్లో లీక్!
దాదాపు పదేళ్ల తర్వాత చిరంజీవి నటించిన ఖైదీ నెం. 150 సినిమా థియేటర్లలో అలా విడుదలయ్యిందో లేదో.. అప్పుడే అందులోని ఒక పాట మొత్తం ఆన్లైన్లో లీకైపోయింది. పైరసీని అరికట్టేందుకు ఎంతగా పోరాటం జరుగుతున్నా, సినిమాలు విడుదల అవుతూనే వాటిలోని పాటలు, మొత్తం సినిమా కూడా ఈ మధ్య కాలంలో వెంటవెంటనే ఆన్లైన్లో వచ్చేస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఖైదీ నెం. 150 లోని 'సన్న జాజిలా పుట్టేసిందిరో.. మల్లె తీగలా చుట్టేసిందిరో.. తేనెటీగలా కుట్టేసిందిరో సుందరీ ఈ సుందరీ' అనే పాట ఇప్పుడు ఆన్లైన్లో లీకై, వైరల్‌గా స్ప్రెడ్ అవుతోంది. దీనిపై సినిమా వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎంతో కష్టపడి తాము సినిమా తీస్తుంటే, నిమిషాల వ్యవధిలోనే ఇలా ఆన్లైన్లో లీక్ చేయడం వల్ల అన్ని వర్గాలూ నష్టపోతున్నాయని అంటున్నారు. -
ఖైదీ నెం.150 పాట ఆన్లైన్లో లీక్!
-
సినీ ఖైదీ రాజకీయ అభిలాష
డేట్లైన్ హైదరాబాద్ చిరంజీవి చేసిన 150వ సినిమా ఆయన రాజకీయ జీవితంలో భాగంగా చూడాలంటే మాత్రం కుదరదు. అది తమిళంలో అద్భుతంగా నడిచిన సినిమా. నీళ్లు, రైతుల కడగండ్లు ప్రధాన ఇతివృత్తంగా కథ నడుస్తుంది. చిరంజీవి సహా ఆయన సమర్ధకులంతా ఈ సినిమాతో రైతుల సమస్యలు తీసుకుని గొప్ప పోరాటం చేసినట్టు చెప్పుకోవడం సమంజసం కాదు. రాజకీయాల్లో ఉండి, ఈ తొమ్మిది సంవత్సరాలు మీరు రైతులకు ఏం ఒరగబెట్టారు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. రాజకీయాలు కొందరికి వృత్తి, మరి కొందరికి హాబీ, మరెందరికో వ్యాపారం. అయితే రాజకీయాలు ఇంతకంటే భిన్నమైనవీ, ఇంతకంటే విలక్షణమైనవీ, ఇంతకంటే ఉదాత్తమైనవీ అన్న విషయం చాలా మంది రాజకీయ నాయకులు మరచిపోతున్నారు. ప్రజల కోసం జీవించడం అసలైన రాజకీయం అన్న విషయం తెలియని చాలామంది, సంపన్నులు కావడానికి రాజకీయాలు షార్ట్‌కట్ అనుకుంటుంటారు. అందుకే రాజకీయాల్లోకి వస్తారు. చెల్లితే స్థిరపడిపోతారు. చెల్లకపోతే వాపస్ వెళ్లిపోతారు. రాజకీయాలంటే పై మూడింటితో పాటు అధికారం కూడా అనుకుంటారు చాలామంది. ఒకసారి వస్తే ఆ అధికారం శాశ్వతమని నమ్మేవాళ్లు కొందరైతే, దాన్ని శాశ్వతం చేసు కోవడానికి నానా గడ్డీ కరవడానికి సిద్ధపడే వాళ్లు మరికొందరు. చేతికొచ్చిన అధికారాన్ని ఏంచేసైనా సరే కాపాడుకోవడం, కలకాలం చేజారిపోకుండా చూసుకోవడం రాజనీతి అని కొందరు అనుకుంటారు. ఆ రకంగా తమను మించిన రాజనీతిజ్ఞులు ప్రపంచంలో లేరని నమ్ముతుంటారు. అదే విషయం అందరికి చెబుతుంటారు కూడా. ఇట్లాంటి వారంతా ఇతరేతర కారణాలతో అధికారంలోకి వచ్చినా తెరమరుగు అయ్యాక చరిత్ర వీరిని మరచిపోతుంది. కొందరు మాత్రం కొంతలో కొంత అయినా జనం కోసం ఏదో ఒకటి చెయ్యా లనే తపన పడి సాధ్యమైనంత మేలు చేసి చిరస్థాయిగా నిలిచిపోతారు. సమ కాలీన రాజకీయాల పోకడ మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం నాయకులు రాజకీయాల అర్థం మార్చేస్తున్నారు. అధికారాన్ని శాశ్వతం చేసుకోవడం కోసం రాజకీయాలకే కొత్త నిర్వచనం చెబుతున్నారు. ప్రజారాజ్యం ముందూ–వెనుకా ఇటువంటి ఒకానొక సమయంలో రాజకీయాలలోకి వచ్చారు ప్రముఖ నటుడు చిరంజీవి. 2007లో తన 149వ సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్ విడుదలైన తరువాత 2008లో ఆయన సొంత పార్టీ ప్రజారాజ్యం స్థాపిం చారు. దేశ పౌరులందరికీ రాజకీయాలలోకి వచ్చే స్వేచ్ఛ ఉన్నట్టే చిరంజీవికి కూడా ఉంది. ఆయన సొంత పార్టీ పెట్టుకున్నా, మళ్లీ ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినా అది ఆయన ఇష్టం. రాజకీయాలకు కామా పెట్టి 150వ చిత్రంలో నటించినా ఎవరూ ఆక్షేపించనక్కరలేదు. ‘కామా పెట్టి’ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే 150వ సినిమా చేస్తున్నాను అన్నారు తప్ప రాజకీయాల నుంచి శాశ్వతంగా నిష్క్రమిస్తున్నాను అని ఫుల్స్టాప్ పెడు తున్నట్టు ఆయన ప్రకటించలేదు కాబట్టి. నిజానికి ఆయన రాజకీయాల్లో నుంచి తప్పుకుంటున్నాను అని ప్రకటించి ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ఇబ్బందులు కల్పించి ఉండేది కాదేమో! అలాగే ఆయన తమ్ముడు, జనసేన పార్టీ నాయకుడు పవన్ కల్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి గైర్హాజరై ఉండేవారు కాదేమో! ఇప్పటికైతే చిరంజీవి ఇంకా కాంగ్రెస్ నాయకుడే. ఆ పార్టీకి చెందిన కేంద్ర మాజీమంత్రి, రాజ్యసభ సభ్యుడు కూడా. చిరంజీవి సినిమాలకే పరిమితమైనా, రాజకీయాల్లోకి వచ్చాక ఇక సినిమాల వైపు చూడకపోయినా ఆయన గురించి ఇది చర్చిం చుకునే సందర్భం అయ్యేది కాదు. సినిమా రంగానికే పరిమితమై ఆయన మంచిచెడులను గూర్చి మాట్లాడేవాళ్లం, రాజకీయాల్లోనే ఉండిపోతే ఇంకో రెండేళ్ల పాటు ఆయన గురించి, ఆయన పార్టీ కాంగ్రెస్ గురించి మాట్లాడు కోవడానికి పెద్దగా ఏమీ ఉండేది కాదు. ఆయన రాజకీయాల్లో కొనసాగు తూనే మళ్లీ సినిమా మీద దృష్టి పెట్టిన సమయం సందర్భం కారణంగా ఈ చర్చ తప్పనిసరైంది. సమయం సందర్భం అంటే సంక్రాంతికి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి 150వ సినిమా, తెలుగుదేశం శాసనసభ్యుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం రెండింటి విడుదల. సంక్రాంతి సందర్భంగా బాలకృష్ణ సినిమాలు ఇప్పటి వరకు 18 విడుదల అయ్యాయట. అందులో ఆరు సినిమాలు చిరం జీవి సినిమాలతో పోటీ పడి బాక్సాఫీస్ హిట్ అయ్యాయి. గతంలో లాగా వీళ్లు సినిమా నటులు మాత్రమే కాదు, రెండు వైరి రాజకీయ పక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులు, రెండు సామాజిక వర్గాలకు ప్రతినిధులు. ఆ ముగ్గురూ... తెలుగునాట సినిమా రంగానికీ, రాజకీయాలకూ మధ్య రేఖలు పూర్తిగా చెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే సార్వత్రిక ఎన్నికల సమయానికి ఇప్పుడున్న రాజకీయ వాతావరణమే కొనసాగితే ముగ్గురు నటులు మూడు పార్టీలుగా ఎన్నికల బరిలోకి దిగి తమకు ఎంత ప్రజా భిమానం ఉందో తేల్చుకోవచ్చు. అప్పటిదాకా అదే పార్టీలో కొనసాగితే 2019లో చిరంజీవి కాంగ్రెస్‌కు స్టార్ ప్రచారకుడవుతారు, పోటీ చెయ్యాలన్న ఆలోచనలో మార్పు రాకపోతే పవన్ కల్యాణ్ తన పార్టీ జనసేనకు ఆకర్షణగా నిలబడతాడు. ఇక మూడో నటుడు, అధికారపక్షంలో ఉన్న మరో నటుడు, శాసనసభ్యుడు, మహానటుడు ఎన్టీ రామారావు కుమారుడు బాలకృష్ణ. ఇది ఆంధ్రప్రదేశ్‌లో రెండు సామాజిక వర్గాల మధ్య ఎంతోకాలంగా ఉన్న రాజకీయ ఘర్షణగా కూడా తీసుకోవచ్చు. కాపు సామాజిక వర్గానికి రిజర్వే షన్లు కల్పించకుండా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాన్ని తుంగలో తొక్కిందని ఆందోళన చేస్తున్న మాజీమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభానికి మద్దతుగా నిలబడ్డారు చిరంజీవి. కాగా కాపులకు అన్యాయం చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు పార్టీలో ఒక నాయకుడు బాలకృష్ణ. ఆ రాజకీయ సినిమాకి ఇంకా రెండేళ్ల సమయం ఉంది కాబట్టి ఇప్పుడు అసలు సినిమాల గురించి మాట్లాడుకుందాం. రాజకీయాల్లో కొనసాగుతూ సినిమాల్లో నటించడం సమంజసమేనా అన్న చర్చ జరుగుతున్నది. రాజ కీయాల్లోకి వచ్చాక ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉంటూ విశ్వామిత్ర సినిమాలో నటించారు. సినిమా షూటింగ్ జరిగిన నాచారం స్టూడియోకి అధికారులు ఫైళ్లు చంకన పెట్టుకుని సంతకాల కోసం వెళ్లేవారు. ఆయన విశ్వామిత్రుడి మేకప్‌లోనే ఆ ఫైళ్ల మీద సంతకాలు చెయ్యడం దేశమంతటా పత్రికలన్నీ ప్రముఖంగా ప్రచురించాయి. ఎన్టీఆర్‌ను నటుడిగా ఆరాధించి, ఆ కారణంగానే కాంగ్రెస్‌ను మట్టికరిపించి తెలుగుదేశంను అధికారంలోకి తీసుకొచ్చిన తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రిగా ఆయన సినిమాల్లో వేషాలు వెయ్యడం నచ్చలేదు. అందుకే ఆ వెంటనే వచ్చిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది. ఎటు ప్రయాణం? ఇక చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఏర్పాటు చేసిన తిరుపతి బహిరంగ సభలో ‘నాకు గంజీ తెలుసు, బెంజీ తెలుసు’ అని ప్రకటించి తొమ్మిదేళ్ల తరువాత ‘బాస్ ఈజ్ బ్యాక్ ’ అంటూ 150వ సినిమాతో మళ్లీ రంగ ప్రవేశం చెయ్యడం చర్చనీయాంశమైంది. అయితే బాస్ మళ్లీ రాజకీయాల్లోకి వెళ్లరా? అన్న ప్రశ్న తెర మీదకు వచ్చింది. ఇవాళ విడుదల అవుతున్న సినిమా సక్సెస్ మీద ఆధారపడి ఉంటుందేమో రాజకీయ భవిష్యత్తు మీద ఆయన నిర్ణయం. రాజకీయాల్లో కొనసాగడమా, శాశ్వతంగా సినిమాల్లోకి తిరిగి రావడమా లేక అక్కడో కాలు, ఇక్కడో కాలు వేసి అదృ ష్టాన్ని పరీక్షించుకోవడమా అన్నది చిరంజీవి నిర్ణయించుకుంటారు. కానీ ఆయన చేసిన 150వ సినిమా ఆయన రాజకీయ జీవితంలో భాగంగా చూడా లంటే మాత్రం కుదరదు. ఈ సినిమా తమిళంలో అద్భుతంగా నడిచిన సినిమా. నీళ్లు, రైతుల కడగళ్లు ప్రధాన ఇతివృత్తంగా కథ నడుస్తుంది. చిరంజీవి సహా ఆయన సమర్ధకులంతా ఈ సినిమాతో రైతుల సమస్యలు తీసుకుని గొప్ప పోరాటం చేసినట్టు చెప్పుకోవడం సమంజసం కాదు. రాజ కీయాల్లో ఉండి, ఈ తొమ్మిది సంవత్సరాలు మీరు రైతులకు ఏం ఒరగ బెట్టారు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇక అరవయ్యవ పడిలో పెద్దల సభ అని గౌరవంగా చెప్పుకునే రాజ్యసభ సభ్యుడై ఉండి, కేంద్ర మాజీమంత్రి అయి ఉండి చవకబారు పాటలకు చేసే డ్యాన్స్‌లను మాత్రం జనం మెచ్చరు. ఈ సందర్భంలో మహానటుడు అమితాబ్ బచ్చన్ గుర్తొస్తున్నాడు. ఆయన నెహ్రూ–గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. రాజీవ్‌గాంధీకి ఆప్తమిత్రుడు. ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో మిత్రుడి కోరిక మేరకు అలహాబాద్ నుంచి పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కానీ కొద్ది మాసాల్లోనే పదవికి రాజీనామా చేశారు. అప్పుడాయన చేసిన వ్యాఖ్య, ‘నేను నటుడిని, సినిమాల్లోనే తప్ప రాజకీయాల్లో నటించలేను’ అని. (వ్యాసకర్త : దేవులపల్లి అమర్, ఐజేయూ సెక్రటరీ జనరల్ datelinehyderabad@gmail.com) -
పవన్ గురించి చిరంజీవి ఏం చెప్పారు?
-
'వర్మ గురించి మాట్లాడటం వేస్ట్'
ట్విట్టర్లో ఎప్పుడూ కామెంట్లు పెడుతూ సంచలనాలకు కేంద్రబిందువుగా ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి మాట్లాడటం వేస్ట్ అని చిరంజీవి అన్నారు. ఖైదీ నెం.150 సినిమా ప్రీలాంచ్ వేడుక సందర్భంగా నాగబాబు - వర్మ మధ్య మొదలైన వివాదం గురించి 'సాక్షి టీవీ' ఇంటర్వ్యూలో ఆయనను అడిగినప్పుడు ఇలా స్పందించారు. ఎవరినైనా ఒకళ్లను పొగడాలంటే పొగడచ్చు గానీ, అందుకోసం రెండోవాళ్లను కించపరచడం సరికాదని, రాంగోపాల్ వర్మ అలాగే చేస్తారని అన్నారు. ఆయన చాలా కుత్సితంగా ఆలోచిస్తారని, తన సినిమా పోస్టర్లు విడుదల చేసినప్పుడు అందులోని లుంగీ స్టిల్ గురించి చాలా ఘోరంగా కామెంట్ చేశారని, అది మంచిపద్ధతి కాదని చెప్పారు. ఆయన చాలా మేధావి అని, తన ఆలోచనలను సక్రమంగా ఉపయోగించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి సినిమాలు చేస్తే బాగుంటుంది గానీ ఇలా కామెంట్లు చేయడం తగదని అన్నారు. నాగబాబు మనసులో ఏదీ దాచుకోలేడని, అందుకే ప్రీలాంచ్ వేడుక సందర్భంగా రాంగోపాల్ వర్మ గురించి గట్టిగా మాట్లాడాడని తెలిపారు. పవన్ కల్యాణ్ గురించి కూడా వర్మ పలు విమర్శలు చేశాడని, ఆయన ఎవరినీ వదలట్లేదని చెప్పారు. -
పవన్ గురించి చిరంజీవి ఏం చెప్పారు?
పవన్ కల్యాణ్ గురించి చిరంజీవి ఏం చెప్పినా అది ఆసక్తికరమే. 'సాక్షి టీవీ'కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పవన్ గురించి కూడా పలు విషయాలు చెప్పారు. సరిగ్గా తాను సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లిన సమయంలో పవన్ సినిమాల్లో బాగా వచ్చాడని, తన స్థానాన్ని భర్తీ చేశాడని తెలిపారు. బ్రహ్మాండమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించినందుకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఖైదీ నెం. 150 సినిమా బుధవారం విడుదల అవుతున్న సందర్భంగా ఆయన సాక్షి టీవీకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒకప్పుడు ఆయనతో కలిసి మూడు సినిమాల్లో నటించిన రోజా.. ఇప్పుడు చిరంజీవిని ఇంటర్వ్యూ చేయడం విశేషం. ఈ సందర్భంగానే ఆయన పవన్ గురించి కూడా చెప్పారు. -
వర్మ ట్వీట్లపై చిరంజీవి ఏమన్నారు..
ఖైదీ నెం.150 చిత్రం ప్రీలాంచ్ వేడుక సందర్భంగా చెలరేగిన వివాదంపై ఎట్టకేలకు చిరంజీవి స్పందించారు. వ్యక్తిగతంగా తనకు ఎవరితోనూ విభేదాలు లేవని, తాను రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్లను పట్టించుకోనని చెప్పారు. అయితే తన పెద్ద తమ్ముడు నాగబాబు ఏ సందర్భంలో హర్టయ్యాడో మాత్రం తనకు తెలియదని ఆయన అన్నారు. ఖైదీ నెం.150 చిత్రం ప్రీలాంచ్ వేడుక వేదికపై నాగబాబు మాట్లాడుతూ యండమూరి వీరేంద్రనాథ్, రాంగోపాల్ వర్మల పేర్లు ప్రస్తావించకుండా వారిని తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. దానిపై వర్మ కూడా అదేస్థాయిలో ప్రతిస్పందిస్తూ వరుసపెట్టి ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా కూడా 'తేలుపిల్ల కుట్టిందా.. వానపాము కరిచిందా' అంటూ నాగబాబు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని వర్మ ప్రశ్నించారు. (తేలుపిల్ల కుట్టిందా, వానపాము కరిచిందా?) -
తేలుపిల్ల కుట్టిందా, వానపాము కరిచిందా?
ఖైదీ నెం. 150 సినిమా ప్రీ లాంచ్ వేడుకలో మెగా బ్రదర్ నాగేంద్రబాబు మొదలుపెట్టిన వివాదాన్ని దర్శకుడు ఇప్పట్లో ముగించడానికి రాంగోపాల్ వర్మ ఇష్టపడుతున్నట్లు లేడు. చిరంజీవి ఫ్యాన్స్ డిజైన్ చేసిన పోస్టర్ అంటూ.. 'రౌడీ నెం.150' అనే ఒక పోస్టర్‌ను ఆదివారం విడుదల చేసిన వర్మ.. మళ్లీ అర్ధరాత్రి అదే అంశం మీద మరో సెటైర్ వేశాడు. నాగబాబును 'ఎన్బి' అని సంబోధించిన వర్మ.. ''నిన్న అంత అరిచి ఈవాళ ఇంత సైలెంట్‌గా ఉండటానికి కారణం, తేలుపిల్ల కుట్టిందా, వానపాము కరిచిందా?'' అని ప్రశ్నించాడు. (వర్మ సమర్పించు.. రౌడీ నెం.150) చిరంజీవి సినిమా ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ వేడుకలో మెగా బ్రదర్ నాగబాబు పరోక్షంగా రచయిత యండమూరి, రామ్‌గోపాల్ వర్మలపై మండిపడ్డారు. ఒక వ్యక్తి ఇక్కడ డైరెక్షన్ చేయడం చేతకాక ముంబై వెళ్లిపోయి అక్కడి నుంచి సోషల్ మీడియాలో కారుకూతలు కూస్తున్నాడని, ఎవరు పడితే వాళ్లు మెగాస్టార్‌ను ఒక మాట అంటే మైలేజి పెరుగుతుందని అనుకుంటున్నారని నాగేంద్రబాబు మండిపడ్డారు. అయితే దానిమీద వెంటనే ట్విట్టర్లో విపరీతంగా కౌంటర్లు వేసిన వర్మ.. దాన్ని అక్కడితో ఆపకుండా ప్రతిరోజూ అదే అంశంపై ఏదో ఒకటి చెబుతూనే ఉండటం గమనార్హం. (రచయిత, దర్శకులపై నాగబాబు మండిపాటు) NB ninna antha arichi ivvala intha silentgaa vundataaniki kaaranam, thelu pilla kuttindha? Vaana paamu karichindha? — Ram Gopal Varma (@RGVzoomin) January 8, 2017 -
ఖైదీ ఫంక్షన్ ముగించండి.. ఐజీ ఆదేశం
ఖైదీ నెం.150 చిత్ర ప్రీలాంచ్ వేడుకను వీలైనంత త్వరగా ముగించాలని గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్ సినిమాకు సంబంధించిన వర్గాలను ఆదేశించారు. హాయ్‌ల్యాండ్‌లో ఇప్పటికే పరిమితికి మించి జనం చేరుకున్నారని, తిరిగి వెళ్లే సమయంలో తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉన్నందున వెంటనే ఫంక్షన్ ముంగించాలని ఐజీ సంజయ్ ఆదేశించినట్లు తెలిసింది. వేదికపైకి వెళ్లిన పోలీసు ఉన్నతాధికారులు.. అల్లు అరవింద్‌తో చర్చించారు. ఏ ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదని, అందువల్ల దయచేసి ఫంక్షన్ వెంటనే ముగించాలని చెప్పారు. -
ఖైదీ నెం.150 ప్రీ రిలీజ్‌కు చిక్కులు
-
ఖైదీతో బాహుబలి
ఒకరు మెగాస్టార్.. ఇంకొకరు యంగ్ రెబల్ స్టార్. ఇద్దరూ ఆత్మీయంగా కలుసుకున్న వేళ పక్కనే రాజమౌళి చిరునవ్వులు చిందిస్తున్న వేళ.. ఈవేళ ఏ వేళ అయ్యుంటుందా? అని ఆలోచించడం మొదలుపెట్టేశారా? మరేం లేదు. చిరంజీవి తాజా చిత్రం ‘ఖైదీ నం. 150’, ప్రభాస్ ‘బాహుబలి 2’ షూటింగ్ ఆర్ఎఫ్సీలో జరిగాయి. రెండు సినిమాల షూటింగ్ లొకేషన్ దగ్గర దగ్గరే కావడంతో ఈ స్టార్స్ ఇద్దరూ మీట్ అయ్యారు. షాట్ గ్యాప్‌లో ‘ఖైదీ నం. 150’ లొకేషన్‌కి వెళ్లిన ప్రభాస్, రాజమౌళీలను చిరంజీవి ఆప్యాయంగా ఆహ్వానించారు. ఆ టైమ్‌లో క్లిక్‌మన్న ఫొటో సోషల్ మీడియలో హల్చల్ చేస్తోంది. -
ఖైదీ నెం.150 సెట్స్ లో అఖిల్ సందడి
మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'ఖైదీ నెం.150' సెట్స్‌లో అక్కినేని అఖిల్ సందడి చేశారు. మెగాస్టార్‌కి వీరాభిమాని అవ్వడమేకాకుండా చరణ్‌కు మంచి స్నేహితుడు కూడా కావడంతో అఖిల్ షూటింగ్ స్పాట్ కి వెళ్లాడు. చిరంజీవి తిరిగి సినిమాల్లో నటించడంపై ఇదివరకు ఓ సారి అఖిల్ మాట్లాడుతూ.. మెగాస్టార్ రీ ఎంట్రీ ఇస్తున్నందుకు ఇండస్ట్రీకి కంగ్రాట్స్ అని చెప్పి అభిమానులను ఆకట్టుకున్నాడు. మంగళవారం సెట్స్‌కు వెళ్లి సరదాగా గడిపాడు. 'ఖైదీ నెం.150' సినిమాకు దర్శకత్వం వహిస్తున్న వి.వి.వినాయక్.. అఖిల్‌ను టాలీవుడ్‌కి పరిచయం చేసిన విషయం తెలిసిందే. తన ఫస్ట్ డైరెక్టర్‌తో కలిసి సరదాగా సెల్ఫీ తీసుకున్నాడు. కాగా 'ఖైదీ నెం.150' సెట్స్‌కు సినీ ప్రముఖుల తాకిడి ఎక్కువగానే ఉంది. మెగాస్టార్ 150వ సినిమా చిత్రీకరణ చూసేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమాకు దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. -
చిరు, కాజల్‌పై కీలక సన్నివేశాలు..
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెం.150' షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. తాజాగా చిత్ర షూటింగ్లో హీరోయిన్ కాజల్ ఎంటర్ అయింది. చిరు, కాజల్‌లపై సన్నివేశాల చిత్రీకరణ మొదలయినట్లు సమాచారం. చిరుతో చిందేసే హీరోయిన్ ఎవరనే దానిపైన నెలలు నెలలు చర్చ జరిగిన విషయం తెలిసిందే. చివరికి ఆ అవకాశం టాలీవుడ్ చందమామను వరించింది. 'జనతా గ్యారేజ్' సినిమాలో తారక్‌తో కలిసి పక్కా లోకల్ పాట చిత్రీకరణను పూర్తి చేసుకున్న కాజల్.. గురువారం మెగాస్టార్ చిత్ర షూటింగ్లో పాల్గొంది. చిరంజీవిలాంటి లెజెండ్‌తో కలిసి పని చేయడం చాలా అద్భుతంగా ఉందంటూ కాజల్ పట్టరాని సంతోషాన్ని వ్యక్తం చేస్తుందట చిత్ర యూనిట్‌తో. తమిళ హిట్ సినిమా 'కత్తి'కి రీమేక్‌గా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. దేవీశ్రీప్రసాద్ సంగీతాన్నందిస్తున్నారు. ఈ చిత్రంతో రామ్ చరణ్ తొలిసారి నిర్మాతగా మారారు. చిరు పుట్టినరోజు కానుకగా సినిమా టైటిల్‌ను, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.