చిరు, కాజల్పై కీలక సన్నివేశాలు.. | Kajal attends Chiru's 150 film shooting | Sakshi
Sakshi News home page

చిరు, కాజల్పై కీలక సన్నివేశాలు..

Aug 25 2016 6:26 PM | Updated on Oct 30 2018 5:58 PM

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెం.150' షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. తాజాగా చిత్ర షూటింగ్లో హీరోయిన్ కాజల్ ఎంటర్ అయింది.

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెం.150' షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. తాజాగా చిత్ర షూటింగ్లో హీరోయిన్ కాజల్ ఎంటర్ అయింది. చిరు, కాజల్లపై సన్నివేశాల చిత్రీకరణ మొదలయినట్లు సమాచారం. చిరుతో చిందేసే హీరోయిన్ ఎవరనే దానిపైన నెలలు నెలలు చర్చ జరిగిన విషయం తెలిసిందే. చివరికి ఆ అవకాశం టాలీవుడ్ చందమామను వరించింది.
 

'జనతా గ్యారేజ్' సినిమాలో తారక్తో కలిసి పక్కా లోకల్ పాట చిత్రీకరణను పూర్తి చేసుకున్న కాజల్.. గురువారం మెగాస్టార్ చిత్ర షూటింగ్లో పాల్గొంది. చిరంజీవిలాంటి లెజెండ్తో కలిసి పని చేయడం చాలా అద్భుతంగా ఉందంటూ కాజల్ పట్టరాని సంతోషాన్ని వ్యక్తం చేస్తుందట చిత్ర యూనిట్తో.

తమిళ హిట్ సినిమా 'కత్తి'కి రీమేక్గా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. దేవీశ్రీప్రసాద్ సంగీతాన్నందిస్తున్నారు. ఈ చిత్రంతో రామ్ చరణ్ తొలిసారి నిర్మాతగా మారారు. చిరు పుట్టినరోజు కానుకగా సినిమా టైటిల్ను, ఫస్ట్ లుక్ను విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement