అందుకే కాజల్ ను కాదన్నారా? | Why Chiru Said No to Kajal? | Sakshi
Sakshi News home page

అందుకే కాజల్ ను కాదన్నారా?

Published Fri, Jul 29 2016 7:54 PM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

అందుకే కాజల్ ను కాదన్నారా? - Sakshi

అందుకే కాజల్ ను కాదన్నారా?

టాలీవుడ్ చందమామ కాజల్ ఓ క్రేజీ ప్రాజెక్టును మిస్ అయ్యిందనేది ప్రస్తుతం వినిపిస్తున్న టాక్. మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ఇంతవరకు తేలని విషయమని తెలిసిందే. అయితే హీరోయిన్ల పరిశీలన లిస్ట్లో కాజల్ పేరు కూడా ఉందట. సర్థార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం లాంటి భారీ సినిమాలు నిరాశపరచడంతో కాజల్ పారితోషికం విషయంలో కాస్త దిగొచ్చింది. అదీ కాకుండా రామ్చరణ్తో ఉన్న స్నేహం, మెగాస్టార్ సరసన నటించే అరుదైన అవకాశం కాబట్టి తన రెమ్యూనరేషన్లో సగానికే ఓకే అనేయడానికి రెడీ అయ్యింది. కానీ కాజల్ను కాదన్నారు.

మగధీరలో రామ్ చరణ్, కాజల్ జంట ప్రేక్షకులను కనువిందు చేసింది. ఆ తర్వాత వచ్చిన నాయక్, గోవిందుడు అందరివాడేలే సినిమాల్లో కూడా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరింది. అబ్బాయి సరసన సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న కాజల్ బాబాయి సరసన మాత్రం ఫెయిల్ అయింది. సర్థార్ గబ్బర్ సింగ్ సినిమాలో పవర్ స్టార్ పక్కన చక్కగా మెరిసినా.. ఈ జంట ఫ్యాన్స్ను అంతగా ఆకట్టులేకపోయింది. అదే కారణంతో ఇప్పుడు చిరంజీవి సరసన కాజల్ను ఫ్యాన్స్ రిసీవ్ చేసుకుంటారో లేదోనన్న మీమాంస ఆమెను కాదనుకునేలా చేసిందట. మొత్తానికి క్రేజీ ఛాన్స్ కాజల్ మిస్సవ్వగా, చిరు హీరోయిన్ వేట మళ్లీ మొదటికొచ్చింది. ప్రస్తుతానికి కాజల్.. అజిత్ 'తల 57' తమిళ సినిమా షూటింగ్ కోసం బల్గేరియా బయలుదేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement