లక్కీగర్ల్‌ కాజల్‌ | kajal agarwal to Lucky chance ajith in 57 th movie | Sakshi
Sakshi News home page

లక్కీగర్ల్‌ కాజల్‌

Published Thu, Jan 19 2017 4:38 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

లక్కీగర్ల్‌ కాజల్‌ - Sakshi

లక్కీగర్ల్‌ కాజల్‌

హీరోయిన్లకు లక్‌ కూడా సీజన్‌లా వరిస్తుందనిపిస్తోంది. ఒక్కోసారి ఒక్కో నటిని అది పీక్‌ స్థాయికి తీసుకెళుతుంది. తారామణులు నయనతార, సమంత, శ్రుతీహాసన్‌ లాంటి వారంతా అలా వెలుగొందుతున్న వారే. తాజాగా నటి కాజల్‌అగర్వాల్‌కు మళ్లీ టైమ్‌ వచ్చినట్లుంది. మొన్నటి వరకూ చాలా డల్‌గా సాగిన ఈ అమ్మడి నట జీవితం ప్రస్తుతం యమ స్పీడ్‌ అందుకుంది. తెలుగులో పలువురు టాప్‌ మోస్ట్‌ హీరోయిన్లను దాటుకుంటూ మెగాస్టార్‌ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నంబర్‌–150 చిత్రంలో ఆయనతో రొమాన్స్‌ చేసే అవకాశం కాజల్‌ను వరించింది. ఆ చిత్రం ఇప్పుడు కలెక్షన్లను కొల్లగొడుతూ కాజల్‌అగర్వాల్‌ ఖాతాలో ఎప్పటికీ గుర్తుండే చిత్రంగా నమోదైంది. ఇంకా చెప్పాలంటే ముందుగా ఆ చిత్రంలో నటించే అవకాశాన్ని చేజార్చుకున్న కొందరు నాయికలిప్పుడు చాలా చింతిస్తున్నారట. ప్రస్తుతం తమిళంలో అజిత్‌ సరసన ఆయన 57వ చిత్రంలో నటిస్తున్న కాజల్‌ తాజాగా మరో జాక్‌పాట్‌ను కొట్టేశారు. ఇళయదళపతి విజయ్‌కు జంటగా మరోసారి నటించడానికి రెడీ అవుతున్నారు.

ఈ సంగతి ఇంతకు ముందే వెల్లడైనా, అధికారకపూర్వకంగా విజయ్‌ 61వ చిత్రంలో నాయకిగా కాజల్‌ కన్ఫార్మ్‌ అయ్యారు. ఇది తను ఇయళదళపతితో నటించనున్న మూడో చిత్రం అవుతుంది. ఇంతకు ముందు తుపాకీ, జిల్లా వంటి విజయవంతమైన చిత్రాల్లో విజయ్‌తో డ్యూయెట్లు పాడారన్నది గమనార్హం. అట్లీ దర్శకత్వం వహించనున్న ఈ భారీ చిత్రాన్ని శ్రీతేనాండాళ్‌ ఫిలింస్‌ సంస్థ నిర్మించనుంది. చిత్ర షూటింగ్‌ ఫిబ్రవరి ప్రథమార్థంలో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని తొలుత అమెరికాలో ప్రారంభించి మేజర్‌ పోర్షన్‌ను అక్కడ చిత్రీకరించడానికి చిత్ర యూనిట్‌ ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిసింది. అయితే తాజాగా ఈ చిత్ర షూటింగ్‌ చెన్నైలోనే ప్రారంభించి కొంత భాగాన్ని చిత్రీకరించిన తరువాత ఏప్రిల్‌లో యూఎస్‌ఏలో షూటింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిసింది. సమ్మర్‌ కాలాన్ని విజయ్‌ చిత్ర యూనిట్‌ యూఎస్‌ఏ లోనే గడపనున్నట్లు సమాచారం. అమెరికాతో పాటు మరికొన్ని దేశాల్లోనూ చిత్రీకరణను జరుపుకోనున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement