మెగాస్టార్ మూవీపై వర్మ యూటర్న్! | Mega Star is beyond Mega Fantastic, says ram gopal varma | Sakshi
Sakshi News home page

మెగాస్టార్ మూవీపై వర్మ యూటర్న్!

Published Wed, Jan 18 2017 4:56 PM | Last Updated on Tue, Sep 5 2017 1:32 AM

మెగాస్టార్ మూవీపై వర్మ యూటర్న్!

మెగాస్టార్ మూవీపై వర్మ యూటర్న్!

సోషల్ మీడియాలో కామెంట్లతో వివాదాలకు కేంద్రబిందువుగా ఉండే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ రొటీన్ కు భిన్నంగా స్పందించాడు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఖైదీ నెంబర్.150ని చూసిన వర్మ ఆ మూవీపై సంచలన కామెంట్లు చేశాడు. చిరంజీవి మూవీ ఖైదీ మెగా మెగా మెగా ఫంటాస్టిక్ అని ట్వీట్ చేశాడు. మెగాస్టార్ ఎనర్జీ లెవల్స్ ఇప్పటికీ ఓ రేంజ్ లో ఉన్నాయని వర్మ కితాబిచ్చాడు. తొమ్మిదేళ్ల కిందట సినిమాలకు దూరంగా వెళ్లినప్పుడు చిరు ఎలా ఉన్నారో.. ఇప్పుడు ఖైదీ మూవీలో అంతకంటే చాలా యంగ్ గా కనిపిస్తున్నారని ట్వీట్ లో రాసుకొచ్చాడు వర్మ.

వీవీ వినాయక్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మించిన చిరంజీవి 150 చిత్రం ఖైదీ నెంబర్.150ని ఇప్పుడే చూశానని.. చిరుకు 150 మిలియన్ చీర్స్ అని పేర్కొన్నాడు. వర్మ ఏం చేసినా తన మార్క్ ఉంటుందనడంలో సందేహం అక్కర్లేదు. బాలకృష్ణ నటించిన వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి తెలుగోడి చరిత్రను తెలిపే గొప్ప మూవీ అని ప్రశంసించిన రాంగోపాల్ వర్మ.. చిరు మాత్రం తమిళ మూవీ 'కత్తి'ని రీమేక్ చేశారని తీవ్రంగా విమర్శించాడు.   
(చదవండి: చిరు అభిమానులకు శుభవార్త) 

ఇటీవల ఖైదీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ.. వర్మ, యండయూరి వీరేంద్రనాథ్ లను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేయగా.. కొన్నిరోజులపాటు నాగబాబును విమర్శిస్తూ వర్మ వరుస ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇటీవల చిరంజీవి మాట్లాడుతూ.. తనతో పాటు పవన్ కల్యాణ్ గురించి కూడా వర్మ పలు విమర్శలు చేశాడని, ఆయన ఎవరినీ వదలట్లేదని అన్నారు. మరోవైపు భారీ కలెక్షన్లతో ఖైదీ మూవీ దూసుకుపోతుండటంతో మెగా ఫ్యామిలీతో పాటు మూవీ యూనిట్ చాలా హ్యాపీగా ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement