
సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్ రామ్ గోపాల్ వర్మ. ఆయన తీసే సినిమాలే కాదు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు కూడా వివాదస్పదం అవుతుంటాయి. ఏ అంశంపైనా అయినా కాస్త వ్యంగ్యంగా స్పందించడం ఆయనకు అలవాటు. తాజాగా మెగాస్టార్ చిరంజీవిపై ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్ చేశాడు.
మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘భోళా శంకర్’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ సూపర్ హిట్ వేదాళంగా తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రానికి ఫస్ట్ షో నుంచే నెగెటివ్ టాక్ వినిపించింది. సాధారణ ప్రేక్షకులతో పాటు మెగా అభిమానులు కూడా ఈ చిత్రం పట్ల అసంతృప్తిగానే ఉన్నారు. చిరంజీవి ఇమేజ్‌ని డ్యామేజ్ చేసేలా ఈ చిత్రం ఉందని కొంతమంది మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ చిత్రం విడుదలకు ముందు హైపర్ ఆది చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. ప్రిరిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్‌ని పొగడ్తలతో ముంచేశాడు. సినిమా వేదికపై రాజకీయాలు మాట్లాడుతూ..మెగా ఫ్యామిలీపై భక్తిని చాటుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆది స్పీచ్‌పై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
(చదవండి: భోళా శంకర్ మూవీ రివ్యూ)
రియాల్టీకి దూరమవుతున్నారు: ఆర్జీవీ
ఇక భారీ అంచనాల మధ్య ఈ చిత్రం విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో నెట్టింట మరోసారి ‘భోళా శంకర్’పై చర్చ మొదలైంది. సినిమా ప్రమోషన్స్‌లో కొంతమంది అతిగా మాట్లాడారనే అభిప్రాయం వ్యక్తం చేస్తునారు. మెగాస్టార్ చిరంజీవి కూడా కొంతమంది పొగడ్తలకు పడిపోయి, కథల ఎంపిక విషయంలో పొరపాటు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఇక ఇలాంటి విషయాలపై చాలా చురుగ్గా స్పందించే ఆర్జీవీ.. తాజాగా ఆసక్తికర ట్వీట్ చేశాడు. పొగడ్తలకు అలవాటు పడిపోయి రియాల్టీకి దూరమవుతున్నారని అనిపిస్తోందంటూ పరోక్షంగా చిరంజీవిని విమర్శించాడు. ‘జబర్ , హైపర్ లాంటి ఆస్థాన విదూషకుల భజన పొగడ్తలకి అలవాటుపడిపోయి , రియాల్టీ కి మెగా దూరమవుతున్నారని అనిపిస్తోంది’అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ఆ తర్వాత దానికి కొనసాగింపుగా ‘పొగడ్తలతో ముంచే వాళ్ళ బ్యాచ్ కన్నా ప్రమాదకరమైన వాళ్ళు ఉండరు... రియాల్టీ తెలిసే లోపల రాజు గారు మునిగిపోతారు .. వాళ్ళ పొగడ్తల విషం నుంచి తప్పించుకోవాలంటే ఆ జాతిని మైల్ దూరం పెట్టటమే’ అని ఆర్జీవీ రాసుకొచ్చాడు.
పొగడ్తలతో ముంచే వాళ్ళ బ్యాచ్ కన్నా ప్రమాదకరమైన వాళ్ళు వుండరు... రియాల్టీ తెలిసే లోపల రాజు గారు మునిగిపోతారు .. వాళ్ళ పొగడ్తల విషం నుంచి తప్పించుకోవాలంటే ఆ జాతిని మైల్ దూరం పెట్టటమే
— Ram Gopal Varma (@RGVzoomin) August 11, 2023
“Of many a proud structure’s ruin , teeny weeny rain drops have been the cause “… https://t.co/chFBuJHsz1