Ram Gopal Varma Tweet On Super Star Krishna Death, Goes Viral - Sakshi
Sakshi News home page

Superstar Krishna Death: కృష్ణ చనిపోయారని బాధపడకండి, స్వర్గంలో ఆమెతో కలిసి..: వర్మ ట్వీట్‌

Published Tue, Nov 15 2022 9:42 AM | Last Updated on Tue, Nov 15 2022 10:24 AM

Ram Gopal Varma Tweet On Super Star Krishna Death - Sakshi

ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్‌ కృష్ణ (79)  మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటే ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందతూ మంగళవారం తెల్లవారు జామును కన్నుమూశారు. ఆయన మృతితో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.  ఇక సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.  

చదవండి: మాటలకు అందని విషాదం ఇది: కృష్ణ మృతిపై చిరంజీవి దిగ్భ్రాంతి

మాటలకు అందని విషాదం అంటూ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ కృష్ణ మృతిపై స్పందించారు. ఈ మేరకు వర్మ ట్వీట్‌ చేస్తూ.. ‘కృష్ణ  గారు చనిపోయారని బాధపడనవసరం లేదు. ఇప్పటికే ఆయన, విజయ నిర్మల గారిని స్వర్గంలో కలుసుకుని ఉంటారు. వారిద్దరు కలిసి ఆనందంగా అక్కడ మంచి సమయాన్ని గుడుపుతుంటారని అనుకుంటున్నా’ అంటూ రాసుకొచ్చాడు. అంతేకాదు మోసగాళ్లకు మోసగాడు చిత్రంలోని వారిద్దరి పాటను ఆర్జీవీ ఈ ట్వీట్‌కు జత చేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement