'Prema Charitra (Krishna Vijayam)' Superstar Krishna's Last Film Ready For Release - Sakshi
Sakshi News home page

Krishna: 16 సంవత్సరాల తర్వాత రిలీజ్‌కు రెడీ అయిన కృష్ణ చివరి చిత్రం

Published Thu, Jun 1 2023 7:30 PM | Last Updated on Thu, Jun 1 2023 7:39 PM

Krishna Last Film Prema Charitra Krishna Vijayam Ready for Release - Sakshi

సూప‌ర్ స్టార్ కృష్ణ న‌టించిన ఆఖ‌రి చిత్రం `ప్రేమ చ‌రిత్ర కృష్ణ విజ‌యం`. ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం రిలీజ్‌ చేశారు. క‌న్న‌డ‌లో ప‌లు చిత్రాలకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించి ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్న హెచ్ మ‌ధుసూద‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శ్రీపాద్ హంచాటే నిర్మాత‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రం జూన్ లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మానికి కృష్ణ ప‌ర్స‌న‌ల్ మేక‌ప్ మేన్ మాధ‌వ‌రావు, తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ‌, ల‌య‌న్ సాయి వెంక‌ట్, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ వినాయ‌క‌రావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఈ సంద‌ర్భంగా కృష్ణ ప‌ర్స‌న‌ల్ మేక‌ప్ మేన్ మాధ‌వ‌రావు మాట్లాడుతూ.. 'గ‌త నాలుగు రోజులుగా కృష్ణగారి జ‌న్మదిన వేడుక‌లు బ్ర‌హ్మాండంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమాలో కృష్ణ గారు చాలా గ్లామ‌ర్‌గా ఉన్నారు, ఎన‌ర్జిటిక్‌గా న‌టించారు. క‌చ్చితంగా ఈ చిత్రం మంచి విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది' అన్నారు. ప్ర‌ముఖ నిర్మాత తుమ్మ‌ల‌పల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ... 'ద‌ర్శ‌కుడు మ‌ధుసూద‌న్ నాకు మంచి మిత్రుడు. క‌న్న‌డ‌లో ఆయ‌న ఎన్నో అవార్డులు అందుకున్నారు. `ప్రేమ చ‌రిత్ర కృష్ణ విజ‌యం` ట్రైల‌ర్ చాలా ఫ్రెష్‌గా, క‌ల‌ర్ ఫుల్ గా ఉంది. ఇటీవ‌ల `మోస‌గాళ్ల‌కు మోస‌గాళ్లు ` చిత్రం రీ-రిలీజ్ అవగా హౌస్‌ఫుల్ క‌లెక్ష‌న్స్ తో ర‌న్ అవుతోంది. ఈ చిత్రం కూడా అదే విధంగా ఆడాల‌ని కోరుకుంటున్నా`` అన్నారు.

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ వినాయ‌క రావు మాట్లాడుతూ... 'మే 31 అంటే కృష్ణ గారి అభిమానుల‌కు పెద్ద పండ‌గే. అంత‌టా ఆయ‌న బ‌ర్త్ డే వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. వారు లేకుండా జ‌రుగుతోన్న మొద‌టి పుట్టిన రోజు ఇది. ఆయ‌న గురించి నేను `దేవుడులాంటి మ‌నిషి` పుస్త‌కం రాశాను. దానికి మంచి పేరొచ్చింది. ఒక రోజు పిలిచి రీ ప్రింట్ చేయ‌మ‌న్నారు. వేసే లోపే దురదృష్ట‌వ శాత్తూ ఆయ‌న క‌న్నుమూశారు. ప్ర‌స్తుతం కొన్ని మార్పులు చేర్పుల‌తో ఆ పుస్త‌కాన్ని త్వ‌ర‌లో తీసుకొస్తున్నా' అన్నారు

ద‌ర్శ‌కుడు హెచ్ మ‌ధుసూద‌న్ మాట్లాడుతూ... 'డైరె‌క్ట‌ర్ గా నా తొలి సినిమా వంశం. ఆ చిత్రానికి ఎన్నో అవార్డ్స్ వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో శ్రీపాద్ హంచాటే గారు పిలిచి కృష్ణ గారితో సినిమా చేద్దామ‌న్నారు. సంతోషంతో ఓకే చేశాను. 2007లో సినిమా పూర్త‌యింది. విడుద‌ల కోసం ఎంతో వెయిట్ చేశాను. అయినా  రిలీజ్ కాలేదు. ఈ లోపు నేను క‌న్న‌డ‌లో చాలా పిక్చ‌ర్స్ డైరె‌క్ట్ చేశాను. కానీ కృష్ణ గారి సినిమా ఎలాగైనా రిలీజ్ చేయాల‌నుకున్నా. ప్ర‌స్తుతం ఉన్న టెక్నాల‌జీకి త‌గ్గ‌ట్టుగా మార్చి నేనే విడుద‌ల చేస్తున్నా. ఈ నెలలోనే విడుదల చేస్తా. కృష్ణ గారి అభిమానులు, ప్రేక్ష‌కులు ఈ చిత్రాన్ని పెద్ద స‌క్సెస్ చేస్తార‌ని కోరుకుంటున్నా' అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement