
వర్మ ట్వీట్లపై చిరంజీవి ఏమన్నారు..
Published Mon, Jan 9 2017 5:59 PM | Last Updated on Tue, Sep 5 2017 12:49 AM

ఖైదీ నెం.150 చిత్రం ప్రీలాంచ్ వేడుక సందర్భంగా చెలరేగిన వివాదంపై ఎట్టకేలకు చిరంజీవి స్పందించారు. వ్యక్తిగతంగా తనకు ఎవరితోనూ విభేదాలు లేవని, తాను రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్లను పట్టించుకోనని చెప్పారు. అయితే తన పెద్ద తమ్ముడు నాగబాబు ఏ సందర్భంలో హర్టయ్యాడో మాత్రం తనకు తెలియదని ఆయన అన్నారు.
ఖైదీ నెం.150 చిత్రం ప్రీలాంచ్ వేడుక వేదికపై నాగబాబు మాట్లాడుతూ యండమూరి వీరేంద్రనాథ్, రాంగోపాల్ వర్మల పేర్లు ప్రస్తావించకుండా వారిని తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. దానిపై వర్మ కూడా అదేస్థాయిలో ప్రతిస్పందిస్తూ వరుసపెట్టి ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా కూడా 'తేలుపిల్ల కుట్టిందా.. వానపాము కరిచిందా' అంటూ నాగబాబు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని వర్మ ప్రశ్నించారు. (తేలుపిల్ల కుట్టిందా, వానపాము కరిచిందా?)
Advertisement
Advertisement