చిరు అభిమానులకు శుభవార్త | chiranjeevi movie khaidi no.150 enters 100 crore collections club | Sakshi
Sakshi News home page

చిరు అభిమానులకు శుభవార్త

Published Wed, Jan 18 2017 6:08 PM | Last Updated on Tue, Sep 5 2017 1:32 AM

చిరు అభిమానులకు శుభవార్త

చిరు అభిమానులకు శుభవార్త

హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత మెగాస్టార్ హీరోగా తెరకెక్కిన మూవీ 'ఖైదీ నెంబర్.150' అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ నెల 11న విడుదలైన ఖైదీ మూవీ వారం రోజుల్లో వంద కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ విషయాన్ని సినీ నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. ఫస్ట్ వీక్ టోటల్ గ్రాస్ కలెక్షన్లు 108.48 కోట్లు సాధించిన చిరు లేటెస్ట్ మూవీ బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను సాధించడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. ఏడు రోజులకుగానూ రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.76.15 కోట్లు రాబట్టిందని అల్లు అరవింద్ చెప్పారు.  వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ మూవీని చిరు తనయుడు రాంచరణ్ నిర్మించిన విషయం తెలిసిందే. అయితే చిరు 150వ మూవీకి దర్శకుడి కోసం ఏమంత పెద్దగా చర్చలు జరపలేదని, వీవీ వినాయక్ అయితేనే న్యాయం చేయగలడని మేం భావించామన్నారు.

'ఈ మెగా మూవీలో భాగస్వాములు అయిన అందరికీ అభినందనలు. ఫాస్టెస్ట్ 100 కోట్లు సాధించిన టాలీవుడ్ మూవీ ఖైదీ. తెలుగు రాష్ట్రాల్లో రూ.76.15 కోట్లు సాధించిన ఖైదీ వసూళ్లు కర్ణాటకలో రూ.9కోట్లు, తమిళనాడులో రూ.60లక్షలు నార్త్ అమెరికాలో రూ.17 కోట్లు రాబట్టింది. రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో రూ.3.90కోట్లు కలెక్ట్ చేసింది. దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత చిరంజీవి రీఎంట్రీని ప్రజలు, అభిమానులు ఆదరించినందుకు ప్రొడక్షన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. త్వరలో కృతజ్ఞాభినందనలకు ఆ మూవీ యూనిట్ త్వరలో ఓ సభను నిర్వహించనుంది' అని అల్లు అరవింద్ తెలిపారు. ఆ సభను ఎక్కడ, ఎప్పుడు జరుపుతామన్నది మూవీ యూనిట్ ముందుగానే వెల్లడిస్తుందన్నారు.
(చదవండి: ఖైదీ మూవీపై వర్మ యూటర్న్!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement