పవన్ కల్యాణ్ గురించి చిరంజీవి ఏం చెప్పినా అది ఆసక్తికరమే.

పవన్ కల్యాణ్ గురించి చిరంజీవి ఏం చెప్పినా అది ఆసక్తికరమే. 'సాక్షి టీవీ'కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పవన్ గురించి కూడా పలు విషయాలు చెప్పారు. సరిగ్గా తాను సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లిన సమయంలో పవన్ సినిమాల్లో బాగా వచ్చాడని, తన స్థానాన్ని భర్తీ చేశాడని తెలిపారు. బ్రహ్మాండమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించినందుకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు.
ఖైదీ నెం. 150 సినిమా బుధవారం విడుదల అవుతున్న సందర్భంగా ఆయన సాక్షి టీవీకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒకప్పుడు ఆయనతో కలిసి మూడు సినిమాల్లో నటించిన రోజా.. ఇప్పుడు చిరంజీవిని ఇంటర్వ్యూ చేయడం విశేషం. ఈ సందర్భంగానే ఆయన పవన్ గురించి కూడా చెప్పారు.