ఖైదీతో బాహుబలి | When Baahubali star Prabhas, SS Rajamouli paid a surprise visit to Chiranjeevi's Khaidi No 150 set | Sakshi
Sakshi News home page

ఖైదీతో బాహుబలి

Published Fri, Oct 21 2016 11:22 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

ఖైదీతో బాహుబలి - Sakshi

ఖైదీతో బాహుబలి

ఒకరు మెగాస్టార్.. ఇంకొకరు యంగ్ రెబల్ స్టార్. ఇద్దరూ ఆత్మీయంగా కలుసుకున్న వేళ పక్కనే రాజమౌళి చిరునవ్వులు చిందిస్తున్న వేళ.. ఈవేళ ఏ వేళ అయ్యుంటుందా? అని ఆలోచించడం మొదలుపెట్టేశారా? మరేం లేదు. చిరంజీవి తాజా చిత్రం ‘ఖైదీ నం. 150’, ప్రభాస్ ‘బాహుబలి 2’ షూటింగ్ ఆర్‌ఎఫ్‌సీలో జరిగాయి.

రెండు సినిమాల షూటింగ్ లొకేషన్ దగ్గర దగ్గరే కావడంతో ఈ స్టార్స్ ఇద్దరూ మీట్ అయ్యారు. షాట్ గ్యాప్‌లో ‘ఖైదీ నం. 150’ లొకేషన్‌కి వెళ్లిన ప్రభాస్, రాజమౌళీలను చిరంజీవి ఆప్యాయంగా ఆహ్వానించారు. ఆ టైమ్‌లో క్లిక్‌మన్న ఫొటో సోషల్ మీడియలో హల్‌చల్ చేస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement