Megastar Chiranjeevi Waltair Veerayya Shooting Sets Video Goes Viral - Sakshi
Sakshi News home page

Waltair Veerayya: వావ్ సూపర్.. వాల్తేరు వీరయ్య భారీ షూటింగ్ సెట్‌..!

Published Tue, Dec 27 2022 7:25 PM | Last Updated on Tue, Dec 27 2022 7:51 PM

Megastar Waltair Veerayya Shooting Sets Video Goes Viral - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి బాబీ డైరెక్షన్‌లో నటిస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. శ్రుతి హాసన్‌ మెగాస్టార్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో మాస్‌ మహారాజ రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో వరుసగా అప్‌డేట్స్‌ ఇస్తూ ఫ్యాన్స్‌కు మరింత హైప్‌ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ సెట్స్‌ను పంచుకున్నరు మేకర్స్. ఈ వీడీయో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

సముద్రం ఒడ్డున వేసిన సినిమా సెట్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. సెట్‌లో చేసిన భారీ ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి.  ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు పాటలను రిలీజ్‌ చేశారు మేకర్స్. బాస్‌ పార్టీ, శ్రీదేవి సాంగ్‌తో పాటు వాల్తేరు వీరయ్య టైటిల్‌ సాంగ్ మెగా ఫ్యాన్స్‌ను ఊపేస్తున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 13, 2023న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement