షూటింగ్‌లో హీరోకి గాయాలు | Hero Ajith kumar injured in accident at shooting spot | Sakshi
Sakshi News home page

షూటింగ్‌లో హీరోకి గాయాలు

Published Sun, Jun 21 2015 9:37 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

షూటింగ్‌లో హీరోకి గాయాలు - Sakshi

షూటింగ్‌లో హీరోకి గాయాలు

చెన్నై: షూటింగ్‌లో నటుడు అజిత్ గాయపడ్డాడు. ఎన్నైఅరిందాల్ తరువాత అజిత్ నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుటోంది. అజిత్ 56వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శివ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మిస్తున్నారు.చిత్ర షూటింగ్ సముద్రతీర ప్రాంతలో జరుగుతోంది.అజిత్ దుండగులతో పోరాడే సన్నివేశాల్ని చిత్రీకరిస్తుండగా ఆయన కంఠానికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చిత్ర యూనిట్ దిగ్భ్రాంతికి గురైంది.

వెంటనే ప్రథమ చికిత్స చేసి ఆస్పత్రిలో చేర్చేందుకు ప్రయత్నించగా  అజిత్ వద్దంటూ వారించి గాయాల బాధతోనే షూటింగ్ పూర్తి చేశారు.కాగా అజిత్‌కు షూటింగ్‌లో గాయాలవ్వడం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు ఆరంభం చిత్ర షూటింగ్ సమయంలోనూ కాలుకు బలమైన గాయాలయ్యాయి.ఆ తరువాత ఆయన స్టిక్ సాయంతోనే షూటింగ్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement