సాక్షి, చెన్నై: దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్. ఆయన తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా 2.o... 'రోబో'కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథనం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 2.o సినిమా మొత్తం నిడివి వంద నిమిషాలు మాత్రమేనట. అంటే గంట 40 నిమిషాలు మాత్రమే. ఒకప్పుడు సినిమా నిడివి మూడు గంటలు ఉంటే.. ఇప్పుడు రెండున్నర గంటలకు తగ్గిన సంగతి తెలిసిందే. మామూలుగా కమర్షియల్ సినిమాలు రెండు గంటలకుపైగా ఉండటం సర్వసాధారణం. కానీ ఆ ట్రెండ్‌కు భిన్నంగా గంట 40 నిమిషాల్లో ఈ అత్యంత భారీ సినిమాను శంకర్ ముగించినట్టు చెప్తున్నారు. ఏమాత్రం సాగదీసే సీన్స్ లేకుండా.. చూస్తున్నంతసేపు ఉత్కంఠగా ఉండేలా సినిమాను కుదించబోతున్నారని చెప్తున్నారు. ఇది సినిమాకు ఏమేరకు కలిసివస్తుందో చూడాలి. ఈ సినిమాను తమిళ, తెలుగు, హిందీ, అరబిక్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్14న విడుదల చేయబోతున్నారు. లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అక్షయ్‌కుమార్, అమీజాక్సన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఏ.ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment