హీరో.. విలన్... రెండూ రజనీయే!
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘రోబో’కి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘2.0’ చిత్రంలో విలన్ ఎవరు? అనడిగితే... బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ అని ఎవరైనా టక్కున జవాబు చెప్పేస్తారు. ఇది నిజమని నమ్మితే పప్పులో కాదు... తప్పులో కాలేసిట్లే! అదేంటీ... అక్షయ్ విలన్ కాదా? మరి, ఎవరు విలన్‌గా నటిస్తున్నారు? అనేగా మీ డౌట్. ఎవరో కాదు... రజనీయేనట! ‘2.0’లో సైంటిస్ట్‌గా, రోబోగా, విలన్‌గా, ఇద్దరు మరుగుజ్జులుగా... మొత్తం ఐదు గెటప్పుల్లో రజనీకాంత్ కనిపిస్తారని కోలీవుడ్ టాక్. ‘రోబో’లో చిట్టి (రోబో)గా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రజనీ అదరగొట్టారు.
సీక్వెల్‌లోనూ అలాంటి పాత్రలో కనిపిస్తారన్నమాట. మరి, అక్షయ్‌కుమార్ ఏ పాత్ర చేస్తున్నారు? అనడిగితే... ఆయనదీ విలన్ పాత్రే. అక్షయ్ 12 గెటప్పుల్లో కనిపిస్తారని టాక్. ఆల్రెడీ ‘క్రౌమేన్’గా అక్షయ్ ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మిగతా గెటప్పులు ఎలా ఉంటాయో చూడాలి. ఇందులో అమీ జాక్సన్ కథానాయికగా నటించారు. భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయట. దీపావళికి సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.