‘‘సినిమా థియేటర్లు, సినిమా బిజినెస్ అనేవి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, టీవీ వల్ల ఆల్రెడీ ఎఫెక్ట్ అయ్యాయి. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే మంచి సినిమాలు తీయాలి. అంతేకాకుండా చిన్న ప్రాంతాల్లో ఉండే థియేటర్లలో కూడా లైటింగ్, సౌండింగ్ బాగుండేలా చూసుకోవాలి. అప్పుడే ఫ్రెష్ ఆడియన్స్ రావడానికి ఇంట్రెస్ట్ చూపుతారు’’ అని నిర్మాత డి. సురేశ్‌బాబు అన్నారు. రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం ‘2.0’.
2010లో వచ్చిన రోబోకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని 2డీలోనే కాకుండా 3డీలోనూ ప్రజెంట్ చేయనున్నట్లు లైకా ప్రొడక్షన్స్ పేర్కొంది. దీనికోసం పలు థియేటర్లను త్రీడీలోకి మార్చడానికి సన్నాహాలు చేయనున్నారు. ఈ విశేషాలు తెలియజేయడానికి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సురేశ్‌బాబు మాట్లాడుతూ – ‘‘ప్రేక్షకులు ఇంటికే పరిమితమైపోతే స్లోగా ఫిల్మ్ ఇండస్ట్రీ పడిపోతుంది. టెక్నాలజీ పరంగా సినిమా అప్‌గ్రేడ్ అయినప్పుడే మరింత కాలం సినిమా ఇండస్ట్రీ ఉంటుంది.
ఇలా ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్, డైరెక్టర్లు అందరూ కలిసి సినిమా వ్యూను బెటర్ చేయడానికి కృషి చేయడం ఇండస్ట్రీని అభివృద్ధి పథంలో నడిపిస్తుంది. ‘బాహుబలి’, ‘రోబో’ లాంటి సినిమాలను త్రీడీలో చూసినప్పుడు ప్రేక్షకులు మంచి అనుభూతి పొందుతారు’’ అన్నారు. ‘‘రోబో 2.0’ సినిమాతో త్రీడీ టెక్నాలజీని ఎడాప్ట్ చేసుకుని, థియేటర్లలో ప్రేక్షకులకు మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిద్దాం’’ అన్నారు శరత్ మరార్. లైకా ప్రొడక్షన్స్ క్రియేటివ్ హెడ్ రాజు మహాలింగం మాట్లాడుతూ– ‘‘సినిమా అంతటినీ త్రీడీలో చేయడం కాస్త రిస్క్‌తో కూడుకున్నదే. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించాలనే తపనతో ఇలా చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా వీలయినన్ని ఎక్కువ థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.
అప్పుడే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు– డి.సురేశ్‌బాబు
Published Sat, Sep 23 2017 11:40 PM | Last Updated on Thu, Sep 12 2019 10:40 AM
Advertisement