
ఫొటోలో కళ్లను కళ్లద్దాలు కవర్ చేస్తున్నాయి కానీ ఆ కళ్లలో మాత్రం కసి ఉందన్న విషయం ఫేస్‌లో ఉన్న కోపం చెప్తోంది. మరి ఆ కోపం, కసి ఎందుకు? ఎవరిపై అన్న విషయాలు తెలుసుకోవాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు ఆగాల్సిందే. ‘కబాలి’లో స్టైలిష్‌గా చూపించిన రంజిత్. పా దర్శకత్వంలో మళ్లీ సూపర్ స్టార్ రజనీ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘ కాలా’. మంగళవారం రజనీకాంత్ (67) బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయన అల్లుడు, హీరో, దర్శక–నిర్మాత ధనుష్ ‘కాలా’ సెకండ్ లుక్‌ను రిలీజ్ చేశారు.
‘‘మా ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ ‘కాలా’ సెకండ్ లుక్. హ్యాపీ బర్త్‌డే సూపర్ స్టార్. వన్ అండ్ ఓన్లీ ‘కాలా’’ అని ధనుష్ పేర్కొన్నారు. మరోవైపు రాజకీయల్లో రజనీ రాక గురించిన ఎనౌన్స్‌మెంట్ మంగళవారం వస్తుందని ఊహించిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. ‘కాలా’ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ టాక్.