సూపర్‌స్టార్ రజినీకాంత్ 'జైలర్' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. దీంతో తలైవా అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆయన సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మలేషియా,జపాన్ సింగపూర్‌లో ఈయనకు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికీ 'బాషా', 'ముత్తు' లాంటి సినిమాలు అక్కడి ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. వాటిని రిపీటెడ్‌గా చూస్తారు. కానీ ఆయన నటించిన గత చివరి సినిమాలు 'పేట', 'దర్బార్', 'అన్నాత్తే' కమర్షియల్‌గా అక్కడ హిట్ కొట్టాయి.
(ఇదీ చదవండి: నేను ఎక్కడున్నా ఆమె నా గుండెల్లోనే ఉంటుంది: సుడిగాలి సుధీర్)
తాజాగా జైలర్ సినిమాను చూసేందకు జపాన్‌లోని ఒసాకా నుంచి ఒక జంట చెన్నైకి వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా జపాన్‌లో కూడా విడుదలైంది. కానీ తలైవా గడ్డపైనే జైలర్‌ను చూడాలని వారు ఇంత దూరం వచ్చినట్టు రజనీకాంత్ జపాన్ ఫ్యాన్స్ అసోషియేషన్ లీడర్ యసుదా హిడెతోషి తెలిపారు. ఆయన రజనీ పేరుతో జపాన్‌లో పలు సేవా కార్యక్రమాలు చేశారు. సినిమాకు సంబంధించిన కార్యక్రమాల కోసం జపాన్‌కు రజనీ వెళ్తే ఆ ఏర్పట్లాన్ని యసుదానే చూసుకుంటారు.
ఇక, జపాన్‌లో అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్స్ భారీగా ఉన్నారు. జపాన్‌లో రజనీకాంత్ తర్వాత అత్యంత అధికంగా ఫ్యాన్స్ బేస్ ఉన్న హీరో ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. ఆయన సినిమాలు అక్కడ కలెక్షన్లు కొల్లగొడుతున్నాయి. ఎన్నో రికార్డులు సృష్టించిన ఆర్ఆర్ఆర్.. కథల పుస్తక రూపంలో అక్కడ ఎంతగానో ఆకట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment