క్షమాపణ చెప్పిన డైరెక్టర్ శంకర్ | journalists manhandled by bouncers during shoot of Robo 2 | Sakshi
Sakshi News home page

క్షమాపణ చెప్పిన డైరెక్టర్ శంకర్

Published Wed, Mar 22 2017 3:46 PM | Last Updated on Tue, Sep 5 2017 6:48 AM

క్షమాపణ చెప్పిన డైరెక్టర్ శంకర్

క్షమాపణ చెప్పిన డైరెక్టర్ శంకర్

రజనీకాంత్, శంకర్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం రోబో 2 మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటి వరకు

రజనీకాంత్, శంకర్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం రోబో 2 మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటి వరకు సినిమా భారీతనంలో న్యూస్ లో వినిపించిన రోబో పేరు ఇప్పుడో జర్నలిస్ట్ లపై దాడి చేయటంతో తెర మీదకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్  ట్రిప్లికేన్ పరిసర ప్రాంతాల్లో వేసిన సెట్ జరుగుతుండగా.. కవర్ రేజ్ కోసం వెళ్లిన ఇద్దరు జర్నలిస్ట్ లపై యూనిట్ సంబంధించిన బౌన్సర్ లు దాడి చేశారు. ఈ సందర్భంగా చిత్ర సహాయ దర్శకుల్లో ఒకరు జర్నలిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తించారు.

 

ఈవిషయం పెద్దదై కేసుల దాక వెల్లటంతో యూనిట్ సభ్యులు వెంటనే నష్టనివారణకు దిగారు. స్వయంగా దర్శకుడు శంకర్ కలుగజేసుకొని జర్నలిస్ట్ లను క్షమాపణ కోరారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలతో పాటు ఫ్యాచ్ వర్క్ షూటింగ్ జరుపుకుంటోంది. రజనీకాంత్ సరసన అమీజాక్సన్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement