ఒక్క సెట్కే 20 కోట్లా..? | 20cr set for action sequence in Robo2 | Sakshi
Sakshi News home page

ఒక్క సెట్కే 20 కోట్లా..?

Published Tue, Feb 16 2016 11:58 AM | Last Updated on Sun, Sep 3 2017 5:46 PM

ఒక్క సెట్కే 20 కోట్లా..?

ఒక్క సెట్కే 20 కోట్లా..?

భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి పెంచిన సినిమా రోబో. సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ సృష్టించిన ఈ విజువల్ వండర్ ప్రాంతీయ భాషా చిత్రాల మార్కెట్ హద్దులను చెరిపేసింది. దీంతో ఈ సినిమాకు సీక్వల్ తెరకెక్కించడం పై చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వచ్చింది. మరోసారి సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయక పాత్రలో అలరించనున్నాడు.

భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అదే స్థాయిలో ఓ భారీ సెట్ను నిర్మిస్తున్నారు చిత్రయూనిట్. ఓ యాక్షన్ ఎపిసోడ్ కోసం 20 కోట్ల రూపాయలతో చెన్నై శివార్లలో సెట్ వేస్తున్నారు. ఈ సెట్లో రజనీకాంత్, అక్షయ్ కుమార్పై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీబేట్స్ ఈ యాక్షన్ సీన్స్ను భారీగా డిజైన్ చేస్తున్నాడు. 400 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న రోబో 2ను 2017 చివర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement