రజనీకాంత్ 5, అక్షయ్ కుమార్ 12 | Shankar Rajini Kanth Robo sequal updates | Sakshi
Sakshi News home page

రజనీకాంత్ 5, అక్షయ్ కుమార్ 12

Published Tue, Mar 28 2017 3:09 PM | Last Updated on Tue, Sep 5 2017 7:20 AM

రజనీకాంత్ 5, అక్షయ్ కుమార్ 12

రజనీకాంత్ 5, అక్షయ్ కుమార్ 12

శంకర్, రజనీకాంత్ల కాంబినేషన్లో రూపొందుతున్న రోబో 2కు సంబంధించిన అప్ డేట్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే బడ్జెట్, కాస్టింగ్ లాంటి అంశాలతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచేసే వార్త ఒకటి కోలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. రోబో సినిమా కోసం రజనీని రకరకాల గెటప్స్లో చూపించిన దర్శకుడు శంకర్, ఈ సీక్వల్ కోసం కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడట.

2.0 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీ కాంత్ కోసం 5 విభిన్న గెటప్స్ను సెలెక్ట్ చేశాడు. సైంటిస్ట్ వశీకర్, రోబో చిట్టితో పాటు మరో మూడు గెటప్స్లో రజనీ అలరించనున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో విలన్గా నటిస్తున్న బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ను కూడా కొత్తగా చూపించబోతున్నాడు శంకర్. ఈ సినిమాలో అక్షయ్ 12 డిఫరెంట్ లుక్స్లో కనిపించనున్నాడు. 400 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కుతున్న 2.0 (రోబో 2) దీపావళి కానుకగా అక్టోబర్లో రిలీజ్ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement