అది మాత్రం టాప్ సీక్రెట్ : హీరోయిన్ | Amy jackson about robo sequel | Sakshi
Sakshi News home page

అది మాత్రం టాప్ సీక్రెట్ : హీరోయిన్

Published Sun, Apr 23 2017 11:08 AM | Last Updated on Tue, Sep 5 2017 9:31 AM

అది మాత్రం టాప్ సీక్రెట్ : హీరోయిన్

అది మాత్రం టాప్ సీక్రెట్ : హీరోయిన్

గ్రేట్ డైరెక్టర్ శంకర్, సూపర్ స్టార్ రజనీకాంత్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రస్టీజియస్ మూవీ 2.0. భారతీయ సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్గా నటిస్తుండగా బ్రిటీష్ బ్యూటి అమీజాక్సన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన ప్రతీ విషయాన్ని సీక్రెట్ ఉంచిన యూనిట్ ఒక్కొట్టిగా రివీల్ చేస్తోంది.

తాజాగా ఓ ఇంటర్య్వూలో సినిమా కాస్ట్యూమ్స్కు సంబంధించిన విశేషాలను హీరోయిన్ అమీజాక్సన్ వెల్లడించింది. సినిమాలోని లీడ్ క్యారెక్టర్స్ అన్నింటికీ లాస్ ఏంజెల్స్ డిజైనర్స్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారని వెల్లడించింది. హాలీవుడ్ సినిమాలు హర్రీపొట్టర్, మెన్ ఇన్ బ్లాక్, ద హాబిట్ లాంటి చిత్రాలకు పనిచేసిన డిజైనర్స్ రోబో సీక్వల్కు పనిచేశారు. హీరో రజనీకాంత్, విలన్ అక్షయ్ కుమార్తో పాటు తాను కూడా స్వయంగా లాస్ ఏంజెల్స్ వెళ్లి బాడీ మౌల్డ్స్ ఇచ్చామని తెలిపింది. అయితే ఈ సినిమాలో తన గెటప్ ఎలా ఉంటుందన్న విషయం మాత్రం టాప్ సీక్రెట్ అంటూ ఊరిస్తుంది ఈ బ్రిటీష్ భామ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement