
దేశంలోనే భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 2.ఓ సినిమాలో నటించటంపై బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ స్పందించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో రజనీకాంత్‌తో కలిసి నటించటం ఆనందంగా ఉందని తెలిపారు. అంతేకాదు రజనీ స్టైల్ కు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘ఒక రోజు సెట్ లో తరువాతి షాట్ కోసం రెడీ అవుతున్నాం. ఆ సమయంలో రజనీ తన ప్యాంట్‌కు అంటుకున్న దుమ్మును దులుపుకుంటున్నారు. ఆయన ఎంత స్టైల్‌గా ఆ పనిచేస్తున్నారంటే.. యూనిట్ అంతా ఆయన్ని అలా చూస్తూ ఉండిపోయాం. ఆయన ఏం చేసినా అంత స్టైల్ గా ఉంటుంది. ఆయన చేతిలో దెబ్బలు తినటాన్ని కూడా ఎంజాయ్ చేస్తా ’ అన్నారు.
2.ఓ సినిమాలోని ఆయన పాత్ర గురించి మాట్లాడిన అక్షయ్ ‘పోస్టర్‌లోనే చెప్పినట్టుగా సినిమాపై వస్తున్న వార్తలన్ని అబద్ధం. ఎవరికీ ఏమీ తెలియదు. మాకు ఏ విషయం బయటకు చెప్పే అధికారం లేదు. కానీ సినిమా చూసినప్పుడు అందరూ సర్‌ప్రైజ్ అవుతారు. చాలా మంది ప్రతినాయక పాత్ర ఎందుకు చేశావని అడుగుతున్నారు. ఎందుకు చేయకూడదు..? విలన్ ఉన్నప్పుడే.. హీరో ఉంటాడు. దేశంలోనే భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తానని నేనెప్పుడూ ఊహించలేదు. అలాంటి అవకాశం వచ్చిన ఎలా వదులుకుంటా’మని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment