ఆర్నాల్డ్ ప్లేస్లో హృతిక్ రోషన్! | Hrithik roshan to play villain in rajanikanth robo 2 | Sakshi
Sakshi News home page

ఆర్నాల్డ్ ప్లేస్లో హృతిక్ రోషన్!

Published Tue, Dec 15 2015 7:25 PM | Last Updated on Thu, Sep 12 2019 10:40 AM

ఆర్నాల్డ్ ప్లేస్లో హృతిక్ రోషన్! - Sakshi

ఆర్నాల్డ్ ప్లేస్లో హృతిక్ రోషన్!

సెట్స్ మీదకు రాక ముందు నుంచే సంచలనాలను నమోదు చేస్తోంది రోబో 2. శంకర్, రజనీ కాంత్ల కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న, ఈ భారీ చిత్రానికి అదే స్ధాయిలో భారీ కాస్టింగ్ను సెట్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. అందుకే రజనీకి ప్రతినాయకుడిగా హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్డ్ను నటింప చేయాలని ప్రయత్నించారు. ఆర్నాల్డ్ కూడా అంగీకరించినా, షూటింగ్ కోసం ఎక్కువ రోజులు కేటాయించలేక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడట.

ఆర్నాల్డ్ స్థానంలో ఇండియన్ హీరోను రీప్లేస్ చేసే ఆలోచనలో ఉన్నాడు శంకర్. సినిమా స్థాయి మరింతగా పెరగాలంటే బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉన్న స్టార్ హీరో అయితే సినిమాకు బిజినెస్ పరంగా కూడా ప్లస్ అవుతోందని భావిస్తున్నారు. అందుకే బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ను రజనీకి విలన్గా నటింప చేయాలని ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే శంకర్, హృతిక్ రోషన్ను కలిసి కథ చెప్పడానికి రెడీ అవుతున్నాడన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement