హీరోయిన్కి సూపర్ స్టార్ కితాబు | Rajinikanth praises robo 2 heroine Amy Jackson | Sakshi
Sakshi News home page

హీరోయిన్కి సూపర్ స్టార్ కితాబు

Published Sat, Mar 26 2016 10:11 AM | Last Updated on Sun, Sep 3 2017 8:38 PM

హీరోయిన్కి సూపర్ స్టార్ కితాబు

హీరోయిన్కి సూపర్ స్టార్ కితాబు

ఇప్పటి వరకు కెరీర్లో ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ లేకపోయినా, వరుసగా టాప్ హీరోల సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్ అమీ జాక్సన్. ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే భారీ బడ్జెట్తో తెరకెక్కుతన్న రోబో 2 సినిమాలో నటిస్తున్న ఈ బ్రిటీష్ బ్యూటీని, ఆ సినిమా హీరో రజనీకాంత్ తెగ పొగిడేస్తున్నాడు. ప్రస్తుతం ఢిల్లీలోని స్టేడియంలో ఫుట్ బాల్ మ్యాచ్కు సంబందించిన కీలక సన్నివేశాలు చిత్రకరిస్తున్న నేపథ్యంలో అమీ పనితీరును రజనీ పొగిడారు.

అమీజాక్సన్ను ఐశ్వర్యారాయ్తో పోల్చిన రజనీ, భవిష్యత్తులో ఈ బ్రిటిష్ భామ కూడా జాతీయస్థాయిలో టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకోవటం ఖాయం అంటున్నాడు. రోబో సినిమా కోసం ఐశ్వర్యతో కలిసి నటించిన రజనీ, ఆ సమయంలో ఐశ్వర్య వర్కింగ్ స్టైల్ భేష్ అంటూ పొగిడాడు. తాజాగా అమీ విషయంలో కూడా ఇదే విధంగా స్పందించాడు రజనీకాంత్. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న రోబో 2 సినిమాను ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement