రజనీ రోబో 2 షూటింగ్కు బ్రేక్ | Rajinikanth, Shankar robo 2 shooting stalled | Sakshi
Sakshi News home page

రజనీ రోబో 2 షూటింగ్కు బ్రేక్

Published Fri, Nov 4 2016 9:54 AM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM

రజనీ రోబో 2 షూటింగ్కు బ్రేక్

రజనీ రోబో 2 షూటింగ్కు బ్రేక్

సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రంలో 2.o. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్ లో బిజీగా ఉంది. అయితే యుఎస్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది.

రజనీకాంత్, అమీజాక్సన్, మోడల్ సుధాన్షు పాండే లపై షూటింగ్ జరుగుతుండగా సాంకేతిక కారణాల వల్ల షూటింగ్ ను నిలిపివేశారు. ఈ షెడ్యూల్ లో కొన్ని సీన్స్ ను శంకర్ తన ఫేవరెట్ స్టైల్ లో ఫ్రీజ్ టెక్నిక్ తో తెరకెక్కించాలని నిర్ణయించాడట. అయితే అందుకోసం ఏర్పాటు చేసిన కెమెరాలలో తలెత్తిన సాంకేతిక కారణల వల్ల షూటింగ్ నిలిచిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. అయితే వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించి ఈ రోజు లేదా రేపు షూటింగ్ తిరిగి ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు రోబో యూనిట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement