రజనీకి టెస్ట్ పెడుతున్న శంకర్ | Diretor shankar to do makeup test for rajani for robo 2 | Sakshi
Sakshi News home page

రజనీకి టెస్ట్ పెడుతున్న శంకర్

Published Tue, Nov 24 2015 11:36 AM | Last Updated on Thu, Sep 12 2019 10:40 AM

రజనీకి టెస్ట్ పెడుతున్న శంకర్ - Sakshi

రజనీకి టెస్ట్ పెడుతున్న శంకర్

'ఐ' సినిమా ఫెయిల్యూర్తో ఢీలా పడిపోయిన దర్శకుడు శంకర్, తనని తానూ ప్రూవ్ చేసుకోవటానికి మరో భారీ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే శివాజీ, రోబో లాంటి రెండు బ్లాక్ బస్టర్స్ అందించిన రజనీకాంత్ కాంబినేషన్లో రోబో సీక్వల్కు రంగం సిద్ధం చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా 2016 జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

రజనీకాంత్, ప్రస్తుతం పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కపాలీ షూటింగ్లో పాల్గొంటున్నాడు. మలేషియాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు వారం రోజులు గ్యాప్ రావటంతో.. ఆ గ్యాప్లో రోబో 2కు కావాల్సిన మేకప్ టెస్ట్లో పాల్గొననున్నాడు సూపర్ స్టార్. అవతార్, ఐ లాంటి భారీ చిత్రాలకు మేకప్ ఆర్టిస్ట్గా పనిచేసిన సీన్ ఫుట్ రజనీకి మేకప్ టెస్ట్ చేయబోతున్నాడు.

హాలీవుడ్ సూపర్ స్టార్ ఆర్నాల్డ్ విలన్గా నటిస్తున్న ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, రోబో, బాహుబలి సినిమాలకు గ్రాఫిక్స్ సూపర్ వైజర్గా పనిచేసిన శ్రీనివాస మోహన్ మరోసారి గ్రాఫిక్స్ బాధ్యతలు తీసుకున్నాడు. దీపిక పదుకొనే హీరోయిన్గా నటించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement