
రోబో 2 @ 150
‘రోబో 2’ @ 150 అనగానే.. ఇది ఆ సినిమా బడ్జెట్ అయ్యుంటుందని అనుకోవడం సహజం. అయితే ఈ సైన్స్ ఫిక్షన్ మూవీని దాదాపు 350 కోట్ల రూపాయలతో
‘రోబో 2’ @ 150 అనగానే.. ఇది ఆ సినిమా బడ్జెట్ అయ్యుంటుందని అనుకోవడం సహజం. అయితే ఈ సైన్స్ ఫిక్షన్ మూవీని దాదాపు 350 కోట్ల రూపాయలతో తీస్తు న్నారని విన్నాం కదా? మరి.. 150 ఏంటి? అని సినిమా బడ్జెట్ గురించి తెలిసినవాళ్లు అనుకుంటారు. 150 అనేది ఈ సినిమా బడ్జెట్‌కి సంబంధించినది కాదు. గతేడాది డిసెంబర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అప్పట్నుంచీ ఇప్పటివరకూ 150 రోజులు షూటింగ్ చేశారు. ఇటీవల చిత్రీకరించిన క్లయిమాక్స్‌తో సహా 60 శాతం సినిమా పూర్తయింది. క్లయిమాక్స్ సీక్వెన్స్ ఫైట్ మాస్టర్ స్టంట్ సిల్వ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సన్నివేశాల్లో రజనీకాంత్ కనబర్చిన ఎనర్జీ సూపర్ అంటున్నారు సిల్వ. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు, చిత్ర కథానాయకుడు రజనీకాంత్, కథానాయిక అమీ జాక్సన్‌పై ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించడానికి ప్లాన్ చేశారని సమాచారం. నవంబర్‌లో ఫస్ట్ లుక్‌ని విడుదల చేయాలను కుంటున్నారు. కాగా, ఈ చిత్రంలో రజనీ ఎలా కనిపిస్తారు? అనే ఊహకు తెరదించుతూ ఈలోపే చిత్రదర్శకుడు శంకర్ శాంపిల్‌గా ఓ వర్కింగ్ స్టిల్ బయటపెట్టారు. దీపావళి సందర్భంగా వచ్చే ఏడాది అక్టోబర్ 19న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారట!