
రజనీకాంత్
క్యారే సెట్టింగా..? అంటూ ఓ పక్క థియేటర్లలో సందడి చేస్తూనే మరో సినిమాలో బిజీ అయిపోయారు రజనీకాంత్. ‘కాలా’ చిత్రం గత శుక్రవారం రిలీజ్ అయింది. అదే రోజున కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమాను డెహ్రాడూన్‌లో స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లేలోగా ఈ సినిమాను కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట రజనీ. అందుకే సినిమాకు ఫుల్ డేట్స్ కూడా కేటాయించేసారట. వచ్చే ఏడాది సంక్రాతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తోందట సన్ నెట్ వర్క్ సంస్థ.
విశేషం ఏంటంటే 2019 సంక్రాంతికి శంకర్ దర్శకత్వంలో రజనీ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘2.0’ కూడా విడుదల కావాలి. వీఎఫ్‌ఎక్స్ పనుల కారణంగా పలు మార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం 2019 సంక్రాంతికి కూడా రాకపోవచ్చు అని చెన్నై టాక్. సో.. కార్తీక్ సుబ్బరాజ్ సినిమా కూడా ‘2.0’ కంటే ముందే ఆడియన్స్‌ని పలకరించొచ్చు అని ఊహాగానాలు విని పిస్తున్నాయి. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా పూర్తి పొలిటికల్ టచ్‌తో ఉండబోతోందనే వార్తలు వినిపించినప్పటికీ ‘‘పొలిటికల్ టచ్ ఉండదు.
కానీ రజనీకాంత్‌ని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించే చిత్రమిది’’ అని పేర్కొన్నారు కార్తీక్ సుబ్బరాజ్. పొంగల్‌కి ‘2.0’ కాకపోతే కార్తీక్ సుబ్బరాజ్ సినిమా. ఏదైతేనేం.. పొంగల్‌కి తలైవర్ సినిమా తోడైతే అభిమానులకు పండగే. అన్నట్లు.. ‘2.0’ని వచ్చే ఏడాది రిప్లబిక్ డేకి రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఒకవేళ సంక్రాంతికి కార్తీక్ సుబ్బరాజ్‌తో చేస్తున్న సినిమా వచ్చి, ఆ వెంటనే ‘2.0’ కూడా వస్తే.. ఫ్యాన్స్‌కి డబుల్ ఫెస్టివల్. అయినా.. కలెక్షన్స్ డివైడ్ అవుతాయి కాబట్టి.. వారం పది రోజుల గ్యాప్‌లో రెండు రజనీ సినిమాలు వచ్చే చాన్సే లేదు.
Comments
Please login to add a commentAdd a comment