రజనీకాంత్‌ - కార్తీక్‌‌ సుబ్బరాజ్ కాంబినేషన్‌ రిపీట్‌ | Rajinikanth Next Movie With Karthik Subbaraj | Sakshi
Sakshi News home page

రజనీకాంత్‌ - కార్తీక్‌‌ సుబ్బరాజ్ కాంబినేషన్‌ రిపీట్‌

Published Mon, Feb 8 2021 5:45 AM | Last Updated on Mon, Feb 8 2021 7:19 AM

Rajinikanth Next Movie With Karthik Subbaraj - Sakshi

రజనీకాంత్‌– డైరెక్టర్‌ కార్తీక్‌ సుబ్బరాజ్‌ కాంబినేషన్‌ మరోసారి రిపీట్‌ కానుందని కోలీవుడ్‌ టాక్‌. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా నటించిన చిత్రం ‘పేట్ట’. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. తాజాగా మరోసారి వీరిద్దరూ కలసి పనిచేయనున్నారట. రజనీకాంత్‌ను రెండోసారి డైరెక్ట్‌ చేసే అవకాశం ఈ యంగ్‌ ఫిల్మ్‌ మేకర్‌కి వచ్చిందని టాక్‌. ప్రస్తుతం ‘అన్నాత్తే’ అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేస్తున్నారు రజనీకాంత్‌. ఈ సినిమా తర్వాత వీరి సినిమా సెట్స్‌ మీదకు వెళ్లొచ్చట. ప్రస్తుతం విక్రమ్, ఆయన తన యుడు ధ్రువ్‌ విక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు కార్తీక్‌ సుబ్బరాజ్‌. ఈ సినిమా పూర్తయ్యాక రజనీ సినిమా ప్రారంభం కానుందట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement