
రోబో 260 కోట్లు
‘ఐ’ సినిమాలో ప్రత్యర్థులపై పగ తీర్చుకోవడానికి హీరో విక్రమ్ చిన్న చిన్న ప్లాన్స్ వేయడు. ఒక ప్లాన్‌ని మించి మరొక ప్లాన్
♦ జనవరిలో ‘రోబో2’ షురూ!
♦ విలన్‌గా ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్ ఓకే!
‘ఐ’ సినిమాలో ప్రత్యర్థులపై పగ తీర్చుకోవడానికి హీరో విక్రమ్ చిన్న చిన్న ప్లాన్స్ వేయడు. ఒక ప్లాన్‌ని మించి మరొక ప్లాన్ ఉండాలనుకుంటాడు. అందుకే సినిమాలో ‘అంతకు మించి’ అని విక్రమ్‌తో చిత్రదర్శకుడు శంకర్ అప్పుడప్పుడు డైలాగ్ చెప్పించాడు. ఇప్పుడు శంకర్ ‘రోబో 2’ విషయంలో ‘అంతకు మించి’ అంటున్నారు. తొలి భాగానికన్నా మించిన బడ్జెట్‌తో, అంతకు మించిన గ్రాఫిక్స్‌తో, అంతకు మించిన కథ, కథనాలతో ‘రోబో 2’ని రూపొందించాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ‘రోబో-2’ గురించి ఇంట్రస్టింగ్ డీటైల్స్...
►‘రోబో’కి దాదాపు 130 కోట్లకు అటూ ఇటూగా బడ్జెట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ బడ్జెట్‌కి రెండింతలతో ‘రోబో 2’ తీయాలనుకుంటున్నారట శంకర్. మలి భాగం నిర్మాణ వ్యయం 260 కోట్ల రూపాయల దాకా అవుతుందని చెన్నయ్ టాక్.
►‘రోబో 2’కి కథ అనుకున్నప్పుడే ఇది భారీ బడ్జెట్ చిత్రం అవుతుందని శంకర్‌కి తెలుసు. అలాగే, కొంతమంది నిర్మాతలు కూడా ఈ చిత్రం బడ్జెట్ గురించి తెలుసుకుని ‘రిస్క్ తీసుకోవడం అనవసరం’ అని ఫిక్స్ అయ్యారనే టాక్ వచ్చింది. ఒకానొక దశలో ఈ చిత్రానికి నిర్మాత దొరకడం కష్టం అనే వార్త కూడా ప్రచారమైంది. చివరికి విజయ్‌తో ‘కత్తి’ చిత్రాన్ని నిర్మించిన ‘లైకా ఇంటర్నేషనల్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చింది.
►{పీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయి. వాస్తవానికి ఈ డిసెంబర్‌లోనే చిత్రీకరణ మొదలుపెట్టాలనుకున్నారు. అయితే, రజనీకాంత్ కథానాయకునిగా నటిస్తున్న ‘కపాలి’ అప్పటికి పూర్తయ్యే అవకాశం లేదట. అందుకని ‘రోబో-2’ని 2016 జనవరిలో మొదలుపెట్టాలనుకుంటున్నారు.
► మొదటి షెడ్యూల్‌ను చెన్నైలోనే జరపడానికి ప్లాన్ చేశారు. కొన్ని రోజులు షూటింగ్ తర్వాత విదేశాల్లో షూటింగ్ జరుపుతారు.
► హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తారనే వార్త ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఆయన భారీ పారితోషికం డిమాండ్ చేయడంతో ఆ పాత్రను ఇక్కడివాళ్లతోనే చేయించాలని శంకర్ అనుకున్నట్లు ఓ వార్త ఉంది. కానీ, ఆర్నాల్డ్‌ని ఖరారు చేసేశారు. రెండో షెడ్యూల్‌లో ఆయన పాత్ర చిత్రీకరణ ఉంటుంది.
► ‘రోబో’కు అద్భుతమైన స్వరాలందించిన ఎ.ఆర్. రహమాన్ ఈ రెండో భాగానికి కూడా సంగీతదర్శకునిగా వ్యవహరిస్తారు. రహమాన్‌కి శంకర్ చూచాయగా కథ చెప్పేశారట.
►తొలి భాగానికి రత్నవేలు ఛాయాగ్రాహకునిగా వ్యవహరించారు. మలి భాగానికి మాత్రం ‘ధూమ్’, ‘ధూమ్ 2’, ‘వాంటెడ్’ వంటి పలు భారీ బాలీవుడ్ చిత్రాలతో పాటు పలు దక్షిణాది చిత్రాలకు కెమెరామ్యాన్‌గా చేసిన నీరవ్ షాను తీసుకున్నారు.
► అన్నట్లు... ఈ చిత్రానికి ‘రోబో 2’ టైటిల్ కాదు. వేరే అనుకుంటున్నారు. మరో వారంలో టైటిల్‌ను రిజిస్టర్ చేయనున్నారు.